Wednesday, February 1, 2012

ప్రభుత్వానికి మద్యం సిండికేట్ల వార్నింగ్

మద్యం విక్రయాలకు సంబంధించి ఒత్తిళ్లు తగ్గించకుంటే తాము ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని మద్యం సిండికేట్‌వ్యాపారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ ప్రాంతంలోని ఐఎంఎల్ డిపో ఎదుట మంగళవారం వారు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిండికేట్ నాయకులు తోట మనోహర్, గంగినేని ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక పక్క నెల నెలా టార్గెట్‌లు పెట్టి మద్యం విక్రయాలు జరిపిస్తూ, మరో పక్క ఏసీబీతో దాడులు చేయించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అసలు తప్పంతా ప్రభుత్వ విధానంలో ఉందని వారు దుయ్యబట్టారు.

ఎమ్మార్పీ ఉల్లంఘన వాస్తవమే అయినా, అందుకు కారణాలను ప్రభుత్వమే విశ్లేషించుకోవాలన్నారు. వేలం ద్వారా అధిక మొత్తాలను అర్జిస్తున్న ప్రభుత్వం తాజాగా ఎంఆర్పీకే మద్యం అమ్మాలంటూ ప్రకటనలు చేయడం సరికాదని వారు వాదించారు. తమపై వెంటనే ఏసీబీ దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐఎంఎల్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందచేశారు

No comments:

Post a Comment