Monday, February 20, 2012

జీఎస్‌ఎం నెట్‌వర్క్‌లకు హ్యాకింగ్ ముప్పు - నిరూపించిన సైబర్ నిపుణులు


జీఎస్‌ఎం మొబైల్ నెట్‌వర్క్‌లలోని బలహీనతలను హాకర్లు అనువుగా మలుచుకుంటున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్ల నుంచి ఈ నెట్‌వర్క్‌లకు ముప్పు పొంచి ఉందని...వినియోగదారులకు సందేహం రాకుండా వారి సిమ్ నంబర్ల ద్వారా ఫోన్‌కాల్స్ చేసుకుంటున్నారని వివరిస్తున్నారు. ఆదివారం గోవా రాజధాని పనాజీలో జరిగిన సైబర్ భద్రత నిపుణుల సదస్సు ‘నల్‌కాన్’లో ఈ విషయాన్ని మాట్రిక్స్ షెల్ అనే సైబర్ నిపుణుల బృందం సోదాహరణంగా నిరూపించింది. మొబైల్‌కు ఐఎంఈఐ నంబర్ ఉన్నట్లే సిమ్ కార్డుకు కూడా ఐఎంఎస్‌ఐ అనే ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుందని బృంద సభ్యుడు అకీబ్ తెలిపారు. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వినియోగదారుడి గుర్తింపు ఇతరులకు తెలియరాదన్న ఉద్దేశంతో టెలికం కంపెనీలు తాత్కాలిక ఐఎంఎస్‌ఐ నంబర్‌ను సృష్టించడంతోపాటు సిమ్ నుంచి ఫోన్‌కాల్ వెళ్లినప్రతిసారీ దాన్ని మార్చాల్సి ఉందన్నారు. నిబంధనను పాటించకపోవడంతోహాకర్లు సామాన్యపరికరాలతోనే వినియోగదారుడి సిమ్ నుంచి కాల్స్ చేసుకుంటున్నారని తెలిపారు. దీన్ని నిరూపించేందుకు సదస్సులో పాల్గొన్న ఓ వ్యక్తి సిమ్ నంబర్‌ను హాకింగ్ చేసి ఫోన్‌కాల్ చేసి చూపారు.

No comments:

Post a Comment