నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చే మొరార్జీ 116వ జయంతి నేడు
మనిషి మనిషికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ భారతదేశ నాలుగో ప్రధాని మొరార్జీ దేశా య్‌కి మాత్రం అన్నీ ప్రత్యేకతలే. అది ఆయన పుట్టిన తేదీతోనే ఆరంభమవుతుంది. 1896 ఫిబ్రవరి 29న ప్రస్తుత గుజరాత్ రాష్ట్రం బల్సార్ జిల్లాలోని బధేలీ గ్రామంలో మొరార్జీ జన్మించా రు. అది లీప్ సంవత్సరం కావడంతో ఆయన పుట్టినరోజు నాలుగేళ్లకో సారి వస్తుంది. ఆయన 1977లో జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవిని అలంకరించిన తొలి కాంగ్రెసే తర నాయకుడిగా రికార్డుకెక్కారు. 81 ఏళ్ల వయసులో ఆ పదవిని చేపట్టిన ఆయన అతి పెద్ద వయస్కుడిగా ప్రధాని అయిన వ్యక్తిగా మరో రికార్డు నమోదుచేశారు. ఒక ఉపాధ్యాయుడి కొడుకు ప్రధానమంత్రి కావడం మరో విశేషం. ఇంకో అతి ముఖ్యమైన విశేష మేమంటే ఆయన రోజూ తన మూత్రాన్ని ఒక గ్లాసెడు తాగేవారు. దానివల్లే తాను ఆరోగ్యం గా ఉండే వాడినని తరచూ చెబుతుండేవారు. ప్రధాని పదవులు చేపట్టినవారందరిలో అతి చిన్న వయసులో... 15 ఏళ్లకే మొరార్జీకి వివాహమైంది. 1995 ఏప్రిల్ 10న ముంబైలో 99వ ఏట కన్ను మూశారు. దేశ ప్రధానులందరిలో ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా పేర్కొనవచ్చు.
-శర్మ సీహెచ్ విజయవాడ
No comments:
Post a Comment