(చిత్రం) ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి మంత్రి అహ్మదుల్లాను కలిసిన కర్నూలు జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్, ఎస్‌పి శివప్రసాద్.
ఏదైనా ప్రార్థనా మందిరానికి వెళ్లినప్పుడు ఆయా మతాల ఆచార వ్యవహారాలను పాటించడం పరిపాటి. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వెళ్లినపుడు ప్రముఖులు సైతం ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ ధరించడం మనం చూస్తుంటాం. అయితే ఆదివారం కర్నూలుకు వచ్చిన మైనారిటీ వర్గానికి చెందిన మంత్రివర్యులు అహ్మదుల్లాను కలిసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ రాంశంకర్‌నాయక్, ఎస్‌పి శివప్రసాద్ ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తన శాఖకు సంబంధించిన పనుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడానికి మైనారిటీ శాఖా మంత్రి అహ్మదుల్లా ఆదివారం కర్నూలు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు వెళ్లిన కలెక్టర్, ఎస్పీ ముస్లింల టోపీ ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రొటోకాల్ ఉన్నా, ఎక్కడికి వెళ్లినా నిత్యం ఖాకీ టోపీ తలపై పెట్టుకునే జిల్లా పోలీసు బాస్ అందుకు విరుద్ధంగా వ్యవహరించం గమనార్హం.
అయితే ఇక్కడ మరో గమ్మత్తేమిటంటే వాస్తవానికి ముస్లిం వర్గానికి చెందిన మంత్రి అహ్మదుల్లా తలపై ఎలాంటి టోపీ లేకుండానే అధికారులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికేందుకు వెల్లినపుడు ముస్లింల టోపీ ధరించడం వెనుక ఉన్న మతలబేమిటో అర్థం కావడం లేదు. మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకా.. లేక మత విశ్వాసాలను గౌరవిస్తున్నామని చెప్పుకునేందుకా.. దీనికి సమాధానం అధికారులే చెప్పాలి
ఇదే లెక్కన రేపు దేవాదాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు హిందూ సాంప్రదాయ దుస్తుల్లో వెళతారా ఈ అధికారులు? ఆ మంత్రే ఆ దుస్తులు వేసుకోడూ! ఇక్కడ మాత్రం ఆ మంత్రి వీళ్ళు పెట్టుకొచ్చిన టోపీ లాంటిది పెట్టుకున్నాడు కనుకనా!!
ReplyDeleteచెంచాగాళ్ళు చేసే పనులు ఇవి.అంతకంటే ఏమీ లేదు.
అంతే కదా మరి! ఆ ఎదవ పోలీసోడికి ఓ మెడల్ ఇప్పించాల్సిందే! :D
ReplyDeleteఇదిసరే గాని, మహిళా శాఖామంత్రిని కలవడానికి పోలీసాయనకి పట్టు చీర, గాజులు, గిరిజన శాఖామంత్రిని చూడాలంటే ఆకులు, ఈకలు, విల్లంబులు తప్పనిసరైతే ఎట్టా అని పరేషానవుతుండా. :P :))
చెంచాగాళ్ళు చేసే పనులు ఇవి.అంతకంటే ఏమీ లేదు._____________100% right!
ReplyDelete>>ఈకలు, విల్లంబులు తప్పనిసరైతే ఎట్టా అని పరేషానవుతుండా
ReplyDeleteయువజన శాఖామంత్రి వచ్చాడని షార్ట్స్, స్లీవ్ లేస్ టీ షర్ట్స్ లో వస్తారా?? వద్దు బాబూ వద్దు, ఆ ఊహే కష్టంగా ఉంది :))
అవునూ మరి మంత్రి వర్గంలో తీసుకుని ఇంకా ఏ శాఖా కేటాయించని మంత్రులు ఎవరైనా ఉంటె వాళ్ళని ఈ అధికారులు ఎలా కలుస్తారబ్బా?
ReplyDelete