రాజేంద్రనగర్, ఫిబ్ రవరి 14: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గండిపేట పార్కులో తిరుగుతున్న రెండు ప్రేమ జంటలకు బజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా వివాహం జరిపించారు. మంగళవారం ఉదయం నుంచి హిమాయత్‌సాగర్, గండిపేట పార్కులలో బజ రంగ్ దళ్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రేమికులను హడలెత్తించారు.
గండిపేట పార్కులో సరదాగా గడుపుతున్న షేక్‌పేట, కుమ్మరివాడలకు చెందిన సాయి గణేశ్, విజయలక్ష్మి అనే ప్రేమికులను పట్టుకుని బెదిరించి బలవంతంగా వివాహం జరిపించారు.
ఉప్పల్‌కు చెందిన మరో ప్రేమ జంట గండిపేట పార్కులో కూర్చొని ముచ్చటిస్తుండగా వారికి కూడా బలవంతంగా వివాహం జరిపించారు. ఈ సంఘటనలను చూసిన మిగతా ప్రేమికులు పారిపోయారు.
ప్రేమ జంటకు వివాహం :
బజరంగ్ దళ్ కార్యకర్తల అరెస్టు
మొయినాబాద్ : వాలెంటైన్స్ డేను బహిష్కరించి తీరుతామని అటు బజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రేమికుల స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై చర్యలు తప్పవని ఇటు పోలీసుల హెచ్చరికలతో నగర శివార్లలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచే మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం, గండిపేట, జింకల పార్కు, ఫామ్ హౌస్‌లు, రిసార్టుల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగకుండా ఒకరిద్దరు కార్యకర్తలు మాత్రమే తిరుగుతూ ప్రేమ జంటలను వెతికే పనిలో పడ్డారు.
ఉదయం తొమ్మిది గంటలలోపే బజరంగ్ దళ్ కార్యకర్తల కన్నుగప్పి నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ప్రేమ జంట మొయినాబాద్, శంకర్‌పల్లి మధ్య గల ప్రగతి రిసార్ట్స్ సమీపంలో సంచరిస్తుండగా అటువైపుగా వెళ్తున్న కార్యకర్తలు అడ్డుకుని వారికి వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరింత అప్రమత్తమై మధ్యాహ్నం వరకు చిలుకూరు బాలాజీ దేవాలయం వద్దకు చేరుకున్న బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ కె.నందు, సురక్షా ప్రముఖ్ మహేష్ తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు
No comments:
Post a Comment