పుస్తక పఠనం చేసేవారు చాలామంది కాన వస్తారు. అందులో విషయాలను అర్ధం చేసుకునే గ్రహణపరాయణత ఉన్న వారు మరికొందరు; అలా అర్ధం చేసుకున్న విషయాన్ని, ఇంకా విశ్లేషించి సారాన్ని ఆకళించుకునే వారు బహు కొద్ది మంది. ఆ విజ్ఞాన సారాన్ని దైనందన జీవిత విధి విధానాలతో జోడించి విషయాన్ని, సామాన్య పద ప్రయోగాలతో జనా హృదయాలకు తాకేటట్టు మాటలాడ్డం ఇంకా అరుదు. ఈ అరుదైన కోవకు చెందిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ప్రవచన శిరోమణి. నిరాడంబర జీవి, నిష్కలమైన వ్యక్తిత్వం వీరిధి.
శ్రీమద్భాగవతం, రామాయణం, పురాణాల మీద దాదాపు నూట ఇరవై ప్రవచనాలు చేశారు చాగంటి వారు. వీటిలో సుందర కాండ, సుబ్రహ్మణ్య వైభవం, స్థల పురాణం, గీతా వైభవం ఉన్నాయి.
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండు భక్తుల కధలు, మార్కండేయ చరిత్ర, నంది కధ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతమునందలి అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కధలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కధ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రధమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కధ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి వివరణ ఉంది. శిరిడి సాయి బాబా కధ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకధారా స్తోత్రం, గోమాత విశిష్ఠత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్ధం, శ్రీరాముని విశిష్ఠత, తిరుమల విశిష్ఠత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరాకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు ఛేశారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పఠిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని పొందారు.
ఇవేకాక పూజా విశిష్టత, ధ్యాన ప్రక్రియ, మనుష్య జీవితము, సంగీత సాహిత్య సమ్మేళనం, సామాజిక కర్తవ్యం, భక్తి, వివాహ వైభవం, గోమాత విశిష్టత, సనాతన ధర్మము, పూజా విధి, ఏకాదశి వ్రత మహత్యము, ఆదిత్య హృదయం, ఆది శంకరాచార్య శివానంద లహరి కూడా ఉన్నాయి. ఇలా విభిన్న అంశాల మీద ఏకధాటిగా మాట్లాడగల దిట్ట. ఆయన చెప్పినవి విన్నవారి మనసులని హత్తుకునేవిగా, అలోచింప జేసేవిగా ఉండటం బహు విశేషం.
వీరి ఉపన్యాసాలు, ప్రవచనలు తరచూ మా టీ వీ , భక్తి టీ వీ, ఎస్ వి బి సి చానెల్స్ లో ప్రసారమవుతున్నాయి. వీటికి అనేక అనుయాయులు ఉన్నారు.
నలబై రెండు రోజుల పాటు, గుంటూరులో సంపూర్ణ రామాయణం మీద ప్రవచనలు చేశారు. అలానే శ్రీమద్భాగవతం మీద నలబై రెండు రోజుల పాటు ఉపన్యసించారు. శివ పురాణం విషయాలపై ముప్పై రోజులు ఉపన్యసించి అనేక విషయాలను తన దృక్పథంలో చాటారు చాగంటి కోటేశ్వరరావు గారు.
భక్తి, భావం, నమ్రత కనిపిస్తాయి వీరి వ్యక్తిత్వంలో. హిందూ ధర్మ సాంప్రదాయాలు పాటిస్తూ, పాండిత్యం మూర్తీభవిస్తూ, ముఖ వర్ఛస్సు కలిగి ఉన్న వారు చాగంటి గారు. శివ తత్వం, శ్రీ కాళహస్తీశ్వర శతకం, లలితా సహస్రనామం తదితర అంశాల మీద మంచి వక్త.
కోటేశ్వరరావు గారికి డబ్బు యావ లేదు. భారతీయ సంస్కృతిక, సాంప్రదాయం, ఆధ్యాత్మికతలను పెంపొందిస్తూ, వాటి పరివ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఇది వారి జీవితాశయమని చెప్పవచ్చు. చాగంటి గారు కారణ జన్ములు అని కొందరు పండితులు సెలవిచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నారు (ప్రభుత్వ ఉద్యోగి). వీరి తండ్రి చాగంటి సుందర శివరావు గారు; తల్లి సుశీలమ్మ గారు. కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు;
చాగంటి కోటేశ్వరరావు గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం చాగంటి విద్యా పురస్కారం (పారితోషకం, జ్ఞాపిక) వైద్య విద్యార్ధికి అందజేస్తున్నారు.
అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు. అలాటిది స్వచ్ఛమైన భాషలో, నిబద్ధతో మాట్లాడ గల దిట్ట శ్రీ చాగంటి వారు. వీరికి భాష పై ఉన్న పట్టు అపారం. విషయంతో పాటు నిక్షిప్త, నిగూడార్ధాలు తెలిసుకున్నవారు; వీరికి వాక్ సుద్ధి ఉంది. వీరు ప్రసంగించినప్పుడు జనాలు మంత్ర ముగ్దులు అవటం కాయం; పండితులు, పామరులు అందరూ హర్షిస్తారు. విషయాన్ని అంత సూటిగా, సరళముగా జనముందుంచుతారు. ఆలోచింప చేయిస్తారు. ఇది అసామాన్యమైన విషయం.
అందుకున్న పురస్కారాలు:
శారదా జ్ఞాన పుత్ర
ప్రవచన చక్రవర్తి - కంచి కామకోటి శంకరాచార్య గారు చాగంటి గారికి " ప్రవచన చక్రవర్తి " గౌరవం ఇచ్చారు.
వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ప్రవృత్తి ఎంత బాగా నిర్వర్తించ వచ్చో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి నేర్చుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు.
అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు. అలాటిది స్వచ్చమైన భాషతో పాటు, అచ్చ తెలుగులో శాస్త్రీయ, సాంప్రదాయ, సాంస్కృతిక, పురాణ, నిత్య విధి విధానాల అంశాలపై అనర్గళముగా మాట్లాడుతూ జన ప్రవర్తనా నియమావళిని, వారి ఒరవడిని ప్రభావితం చేయగలుతున్న మహా వ్యక్తి శ్రీ చాగంటి వారు. అంతే కాదు మాటలాడే అంశం భావ, అంతర్గత, నిక్షిప్తార్ధాలను రంగరించుకుని విషయాన్ని నిబద్ధతో గంటాపథంగా చెప్పే అసామాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇలా చెప్పేవారున్నారు; వినే వారు కూడా బయలుదేరారు. విని మంచి చేద్దాం, మంచి ఒరవడి సాధించుకుందాం అన్న తాపత్రయం విన్న వారిలో బయలుదేరింది. ఇది గమనార్హం. ఎందుకంటే ఇది గొప్ప విషయం. విషయం అని చెప్పే కంటే మార్పు అని చెప్పడం సమంజసం. తెలుగు నాట ఇలాటి ఉదాహరణలు తారసిల్లడం ముదావహం. తెలుగు నాట వీరి అనుయాయులు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇలా జన హృదయాలని జయించుకున్నే మాహద్భాగ్యం ఎందరికి లభిస్తుంది? అది వారి అదృష్టం. హిందూ సంస్కృతిక, సాంప్రదాయ, ఆధ్యాత్మికత పెంపొందించి పరివ్యాప్తి చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు.
తెలుగు నాట ఇలాటి ఆణి ముత్యాలు మరికొన్నిదొరుకుతాయని ఆశిద్దాo . వీరి ప్రభావంతో మరిందరు అసలు తెలుగు ధనం సాధిస్తారని ఆశిద్ధాం. ..
చాగంటి వారి ప్రవచనాల వీడియోలు youtube లో , ఆడియో లు ఇతర విషయాలు వారి వెబ్సైటు ద్వారా దర్శించవచ్చు. వీరి ప్రవచనాలు పుస్తకాలు గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
వెబ్సైటు: http://telugu.srichaganti.net/Default.aspx
ఈ పోస్ట్ కు మూలాలు : ( కృతజ్ఞతలు )
http://telugu.srichaganti.net/SivaTatwam.aspx,
వికీ పెడియా,
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/nov12/telugutejomurthulu.html
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ మధ్యనే ఒక మిత్రుని ద్వారా వీరి గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు వీరి ప్రసంగాలు వినని రోజు వుండదు నాకు.తెలుగు వారు గర్వించదగ్గ మహానుభావులు శ్రీ చాగంటి గారు.
ReplyDeleteబ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రతిభ వర్ణిస్తూ, మీరు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మరిచారు. పురాణాల గురించే కాక, ఈనాటి విద్యార్ధులలో personality development ల గురించి కూడా, ఆయన ఎన్నెన్నో ప్రసంగాలు చేశారు. వాటిని http://www.youtube.com/watch?v=YDUm2344fwg లో వినొచ్చు.
ReplyDeleteప్రవచనాలు ఎంత గొప్పగా చెబుతారో అంతే అద్భుతంగా వీటినీ చెబుతారు. తెలుగువారికి ఓ గొప్ప వరం-శ్రీ చాగంటి వారు.
@harepala
ReplyDeleteకృతజ్ఞతలు.. వారొక కారణ జన్ములే
చాలా మంచి విషయాలు చెప్పారు . కృతజ్ఞలు. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పరిపూర్ణమైన వ్యక్తి
ReplyDeleteశ్రే.చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు వినడము అంటే మనము పూర్వజన్మలో చేసుకొన్న కొండంత పుణ్యం.
ReplyDeletesaraswathiputhrulu Sri Chaganti.
ReplyDeletelol,old attitude
ReplyDeletegreat human. i like him very much
ReplyDeleteNobody can give such discourses unless there are divine blessings. Earlier I was not giving much importance to his speeches, but more I watch more I realized that the Goddess Saraswati is talking through him.
ReplyDeleteశ్రీ గురుభ్యోనమః
ReplyDeleteబ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు ఎంత గొప్పమైనవి అంటే ఈనాడు సాటి లేరు ఆయనకీ ఎవ్వరూ! ఆయన వర్ణించే తీరు మహిమాన్వితం!
devuduni ekkado vetakalsina pani ledu.chaaganti gaari maatala lone devudu kanipistadu
ReplyDeleteKoteswararao garu chesthunna krushiki krutaznathabhivandanamulu
ReplyDeleteaa deva devuni maataga bhavistham.....
ReplyDelete