Saturday, February 15, 2014

హైదరాబాదు బిర్యానీ @ ప్యారడైజ్

http://www.thehindu.com/multimedia/dynamic/01102/HY03BIRYANI01_1102730g.jpgహైదరాబాదు బిర్యానీ రుచి చూడాలంటే.. ఆ హోటల్ కు వెళ్లాల్సిందే. 1953వ సంవత్సరంలో సికింద్రాబాదులో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ ఉండేది. సినిమా హాలుకు అనుబంధంగా చాయ్, సమోసా, బిస్కట్ అమ్మే చిన్న టీ దుకాణం ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. కాలానుక్రమంలో ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ, హుస్సేన్ హిమ్మతీ టీ స్టాల్ మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. ప్రారంభంలో 10 మందికి పని కల్పించిన ఆ టీ స్టాల్ ప్రస్తుతం.. 800 మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ప్యారడైజ్ హోటల్ గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు ప్యారడైజ్ హోటల్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కేలా హోటల్ ను తీర్చిదిద్దారు. జంట నగరాల్లో ఇప్పుడు మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి. సికింద్రాబాదులోని ఈ హోటల్ నుంచి బిర్యానీ పార్శిల్స్ దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో వెళ్తుంటాయి.

కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారంటే.. ఈ బిర్యానీ ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి.. ఇలా చాలా మంది ప్రముఖులు తమ బిర్యానీని ఆప్యాయంగా ఆరగించినట్లు ఖజీం హిమ్మతీ చెప్పారు.

ప్రస్తుతం సికింద్రాబాదు ప్యారడైజ్ తో పాటు హైదరాబాదులో ఆరు ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటెక్ సిటీ, మాసబ్ ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్స్, కూకట్ పల్లి, బేగంపేటల్లో ఇవి రుచికరమైన బిర్యానీని నగర వాసులకు అందిస్తున్నారు. త్వరలో దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో హోటళ్లు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

Saturday, February 8, 2014

ఒక్క జీమెయిల్ ఐడి తో ఎన్నో చేయోచ్చు ... ఇలా!

నెట్టింట్లో ఏది చేయాలన్నా... గూగుల్‌ గుమ్మం దాటాల్సిందే. అందుకు జీమెయిల్‌ ఎకౌంట్‌ గేట్‌పాస్‌. మెయిళ్లు పంపుతాం. గూగుల్‌ ప్లస్‌కి అనుసంధానం అవుతాం. యూట్యూబ్‌లోకి వెళతాం. ఇంకా చెప్పాలంటే.. గూగుల్‌ డ్రైవ్‌ని వాడుకుంటాం. ఇదంతా తెలిసిందే. జీమెయిల్‌ ఐడీతో ఇంకా చాలానే చేయవచ్చు. డ్రైవ్‌లో బ్యాక్‌అప్‌ చేసుకున్న మ్యూజిక్‌ ట్రాక్స్‌ని అక్కడే వినొచ్చు. మీ ప్రింటర్‌కి అనుసంధానమై ఎక్కడి నుంచైనా ప్రింట్‌లు ఇవ్వొచ్చు. యూట్యూబ్‌ ఛానల్‌ని నిర్వహించొచ్చు. ఇంకా చాలానే చేవయచ్చు. అవేంటో వివరంగా తెలుసుకుందాం!
అక్కడే వినొచ్చు
గూగుల్‌ డ్రైవ్‌ అంటే క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసని... దాంట్లో అందిస్తున్న ఉచిత స్పేస్‌లో డాక్యుమెంట్‌లు, ప్రజంటేషన్స్‌, స్ప్రెడ్‌షీట్‌లు, ఫొటోలు... భద్రం చేసుకోవచ్చనీ.. వాటిని గూగుల్‌ డాక్స్‌తో ఎప్పుడైనా ఎడిట్‌ చేసుకోవచ్చనీ తెలుసా? అలాగే దాంట్లోకి మీకు ఇష్టమైన పాటల్ని అప్‌లోడ్‌ చేసుకుని వినొచ్చని తెలుసా? అందుకో థర్డ్‌పార్టీ సర్వీసు ఉంది. అయితే, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో www.drivetunes.orgసైట్‌ని ఓపెన్‌ చేయండి. జీమెయిల్‌తో లాగిన్‌ అయ్యి Acceptచేయాలి. దీంతో గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసిన అన్ని పాటలు జాబితాగా కనిపిస్తాయి. ఎప్పుడైనా... ఎక్కడైనా మీ మ్యూజిక్‌ లైబ్రరీని వినొచ్చు. ఎంపీ3, ఎంపీ4 ఫైల్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఏ సిస్టంలోనైనా ట్రాక్స్‌ని వినొచ్చు. ఒకవేళ మొబైల్‌లో వినాలనుకుంటే? అందుకు తగిన ఆప్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే CloudAround Lite Music Playerఆప్‌ని వాడొచ్చు. గూగుల్‌ డ్రైవ్‌తో పాటు డ్రాప్‌బాక్స్‌, బాక్స్‌, షుగర్‌సింక్‌, స్కైడ్రైవ్‌, అమెజాన్‌ ఎస్‌3... క్లౌడ్‌స్టోరేజ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే ఆయా క్లౌడ్‌స్టోరేజ్‌ల్లో భద్రం చేసుకున్న మ్యూజిక్‌ ట్రాక్స్‌ని వినొచ్చన్నమాట. http://goo.gl/XcSefO
* యాపిల్‌ యూజర్లు CloudBeats Liteఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/swqm3b
ప్రింట్‌ తీసుకోండి
మీకు తెలుసా? ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంట్లోని ప్రింటర్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడాలి. జీమెయిల్‌తో లాగిన్‌ అయ్యి ఇంట్లోని ప్రింటర్‌కి ప్రింట్‌ ఇవ్వొచ్చు. ముందుగా ఇంట్లోని ప్రింటర్‌, పీసీ ఆన్‌లో ఉండాలి. ఇప్పుడు బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసి 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లాలి. వచ్చిన ట్యాబ్‌ విండోలోని Show Advanced Settings మెనూలోని Google Cloud Printఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. 'మేనేజ్‌'పైన క్లిక్‌ చేసి 'యాడ్‌ ప్రింటర్‌'తో వాడుతున్న ప్రింటర్‌ని జత చేయాలి. ఇక ఎక్కడినుంచైనా ప్రింట్‌ ఇవ్వాలనుకుంటే క్రోమ్‌ బ్రౌజర్‌లోని 'ప్రింట్‌'పై క్లిక్‌ చేసి Destination->Change ద్వారా రిమోట్‌ ప్రింటర్‌ని సెలెక్ట్‌ చేసుకుని ప్రింట్‌ ఇవ్వాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... బ్రౌజర్‌లోని కంటెంట్‌ని మాత్రమే ఇలా ప్రింట్‌ తీసుకోగలరు. సిస్టం సాఫ్ట్‌వేర్‌ల నుంచి ప్రింట్‌ ఇవ్వలేరు. ఒకవేళ వర్డ్‌ డాక్యుమెంట్స్‌ని ప్రింట్‌ తీసుకోవాల్సివస్తే 'గూగుల్‌ డాక్స్‌'లోకి అప్‌లోడ్‌ చేసుకుని 'ఆఫీస్‌' ఫైల్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు.
* ఇదే సౌకర్యాన్ని మొబైల్‌ నుంచి కూడా వాడుకోవచ్చు. అందుకు తగిన ఆప్‌ Cloud Print. కావాలంటే http://goo.gl/zTXCCrలింక్‌లోకి వెళ్లండి.
* ఐఫోన్‌ యూజర్లకు PrintCentral Proప్రత్యేకం. http://goo.gl/1klH2D
కాంటాక్ట్‌లు కావాలా?
మొబైల్‌లో ఎన్నో కాంటాక్ట్‌లను సేవ్‌ చేస్తుంటాం. అనుకోకుండా మొబైల్‌ పోయినా... కొత్త మొబైల్‌కి అప్‌డేట్‌ అవ్వాల్సివచ్చినా... కాంటాక్ట్‌లను మేనేజ్‌ చేసుకోవడం కొంచెం క్లిష్టమైన ప్రక్రియే. కానీ, జీమెయిల్‌లోని 'కాంటాక్ట్‌'లతో చిటికెలో మొబైల్‌లోకి సింక్‌ చేయవచ్చు. అందుకు జీమెయిల్‌ హోం పేజీలోని ఎడమవైపు కనిపించే Gmail పక్కన బాణం గుర్తుపై క్లిక్‌ చేసి 'కాంటాక్ట్‌'ను ఎంపిక చేసుకోవాలి. ఇక మొబైల్‌లోని అన్ని కాంటాక్ట్‌లను మాన్యువల్‌గా అడ్రస్‌బుక్‌లో యాడ్‌ చేయవచ్చు. ఒకవేళ CSV, vCardఫైల్‌ ఉన్నట్లయితే కాంటాక్ట్‌ ట్యాబ్‌లోని 'మోర్‌'పైన క్లిక్‌ చేసి ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. మొత్తం కాంటాక్ట్‌లను అడ్రస్‌బుక్‌లో పొందుపరిచాక 'మోర్‌'లోని Exportపై క్లిక్‌ చేసి CSV, vCardఫార్మెట్‌ల్లో సేవ్‌ సేవ్‌ చేయవచ్చు. ఇక ఎప్పుడైనా మొబైల్‌లోకి కాంటాక్ట్‌లను సింక్‌ చేసుకోవాలంటే గూగుల్‌ ఎకౌంట్‌తో మొబైల్‌లోకి లాగిన్‌ అవ్వగానే మొత్తం కాంటాక్ట్‌లు సింక్‌ అవుతాయి. ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్‌, విండోస్‌ ఫోన్‌... వాడేది ఏ ఫ్లాట్‌ఫాం అయినా కాంటాక్ట్‌లను సింక్‌ చేయవచ్చు.
మీదే ఛానల్‌
మీకున్న క్రియేటివ్‌ స్కీల్స్‌తో యూట్యూబ్‌లో ఓ ఛానల్‌ ఓపెన్‌ చేయవచ్చు. అందుకో వెబ్‌ కెమెరా, మైక్రోఫోన్‌ ఉంటే చాలు. జీమెయిల్‌ ఐడీనే గేట్‌పాస్‌గా చేసుకుని ఛానల్‌ని ప్రారంభించొచ్చు. యూట్యూబ్‌ హోం పేజీలోని 'మై ఛానల్స్‌'లోకి వెళ్లి ఛానల్‌ పేరు ఎంటర్‌ చేయాలి. 'అప్‌లోడ్‌'పై క్లిక్‌ చేసి రికార్డ్‌ చేసిన వీడియోలు అప్‌లోడ్‌ చేసి షేర్‌ చేయవచ్చు. ఒకవేళ వెబ్‌ కెమెరాతో రికార్డ్‌ చేయాలనుకుంటే Webcam Capture లోని 'రికార్డ్‌'పై క్లిక్‌ చేయాలి. రికార్డింగ్‌ పూర్తయ్యాక ప్రివ్యూ చూసి పబ్లిష్‌ చేయాలి. 'వీడియో మేనేజర్‌' విభాగంలోకి వెళ్లి వీడియోల సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఇతరుల కంట పడకూడదు అనుకుంటే 'ప్రైవేట్‌'గా సెట్‌ చేయాలి. 'వీడియో ఎడిటర్‌' ద్వారా యూట్యూబ్‌లోనే వీడియోలను ఎడిట్‌ చేసుకునే వీలుంది. ఇక సిస్టంలోని వీడియో ఫైల్స్‌ని పబ్లిష్‌ చేయాలంటే డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో అప్‌లోడ్‌ చేయవచ్చు.
దేనికి ఎంత?
వాడుతున్న జీమెయిల్‌లో ఎంత స్పేస్‌ని అందిస్తున్నారో ఎప్పుడైనా విశ్లేషించారా? జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ప్లస్‌ సర్వీసులు ఎంతెంత మెమొరీ తీసుకున్నాయో చెక్‌ చేశారా? అదేమంత క్లిష్టమైన ప్రక్రియేం కాదు. మొత్తం 15 జీబీ ఉచితంగా అందిస్తున్నారు. వాడకం ఎలా ఉందో చూడాలంటే జీమెయిల్‌ పేజీ కిందిభాగంలో ఎడమవైపు పరిశీలిస్తే కనిపిస్తుంది. ఉదాహరణకు 2.21 GB (14%) of 15 GB used అని కనిపిస్తూ కిందే Manageఆప్షన్‌ ఉంటుంది. మరింత వివరంగా ఏయే సర్వీసు ఎంతెంత మెమొరీ ఖర్చు అయ్యిందో తెలుసుకోవాలంటే 'మేనేజ్‌'పై క్లిక్‌ చేయండి. ఛార్ట్‌ ద్వారా మెమొరీ వాడకాన్ని చూడొచ్చు. మరింత స్పేస్‌ కావాలనుకుంటే ప్రీమియం ఎకౌంట్‌ని కొనుగోలు చేయవచ్చు.
ఆప్‌తో బ్యాక్‌అప్‌
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే Google + ఆప్‌తో ఫొటోలు, వీడియోలను బ్యాక్‌అప్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి Auto Backup ఆప్షన్ని ఎనేబుల్‌ చేయాలి. http://goo.gl/Fzd76T
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందండి. http://goo.gl/3qu9l4
మరికొన్ని...
* జీమెయిల్‌లోని సెర్చ్‌ ద్వారా కావాల్సిన మెయిల్స్‌ని వెతకడం తెలిసిందే. మరింత నిశితంగా మెయిల్స్‌ ద్వారా వచ్చిన ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ని వెతకొచ్చని తెలుసా? అందుకు సెర్చ్‌ కీవర్డ్స్‌ ఉన్నాయి. ఉదాహరణకు మెయిల్‌ ఎటాచ్‌మెంట్స్‌లో 10ఎంబీ కంటే ఎక్కువ మెమొరీ తీసుకున్న మెయిల్స్‌ని వెతకాలంటే? సెర్చ్‌బాక్స్‌లో size:10m అని టైప్‌ చేసి ఎంటర్‌ చేస్తే చాలు. ఇదే 10 ఎంబీ సైజు ఉన్న ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ 6 నెలల ముందువి కావాలంటే? older_thanకీవర్డ్‌ వాడొచ్చు. ఉదాహరణకు ఇలా... size:10m older_than:6m
* సాఫ్ట్‌వేర్‌ల్లో మాదిరిగానే జీమెయిల్‌లోనూ షార్ట్‌కట్‌ మీటలు వాడుతున్నారా? అదెలా? అనేది మీ సమాధానం అయితే... మెయిల్‌లో వాడుకునేందుకు బోల్డన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. ఉదాహరణకు మెయిల్‌కి రిప్త్లె ఇవ్వాలంటే కీబోర్డ్‌లోని Rనొక్కితే సరి. మెయిల్‌లో ఏదైనా లింక్‌ని ఇన్‌సర్ట్‌ చేయాలంటే? సింపుల్‌గా Ctrl+Kనొక్కితే సరి. ఇలా జీమెయిల్‌లో వాడుకోదగిన షార్ట్‌కట్‌ మీటల్ని తెలుసుకునేందుకు Shift+?నొక్కండి. మొత్తం జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా జీమెయిల్‌లోని పనుల్ని చిటికెలో చక్కబెట్టేయవచ్చు.
* ఇన్‌బాక్స్‌లోనే సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని మరింత స్మార్ట్‌ చూసేందుకు క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి PowerInboxఆప్‌ని వాడొచ్చు. క్రోమ్‌కి జత చేయగానే ఆప్‌లాంచర్‌లో కనిపిస్తుంది. రన్‌ చేసి ప్రత్యేక మెనూ, టూల్‌బార్‌తో సోషల్‌లైఫ్‌ని మరింత సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. ఆప్‌ కోసం http://goo.gl/SMZ1hdలింక్‌లోకి వెళ్లండి.
ఆఫ్‌లైన్‌లోనూ...
విమానంలో వెళ్తున్నప్పుడో... రైలు ప్రయాణంలోనో కొన్నిసార్లు ఎలాంటి నెట్‌వర్క్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ని యాక్సెస్‌ చేసి పని చేయవచ్చు. అందుకో చిట్కా ఉంది. మీరు క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌' నుంచి Gmail Offline ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సిస్టంలో అనుకునేరు. క్రోమ్‌ బ్రౌజర్‌లోనే! అందుకు http://goo.gl/xn0fhy లింక్‌లోకి వెళ్లండి. 'యాడ్‌'పైన క్లిక్‌ చేసి ఆప్‌ని క్రోమ్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి. యాప్‌లాంచర్‌లో వచ్చిన లోగోపై క్లిక్‌ చేసి Allow offline mail ఆప్షన్ని చెక్‌ చేసి Continue క్లిక్‌ చేయాలి. ఇక నెట్‌ కనెక్షన్‌ లేకున్నా మెయిల్స్‌ని యాక్సెస్‌ చేయవచ్చు.

Thursday, January 30, 2014

మహాత్మా! నీవు మరోసారి జన్మించవూ

బుద్దుడు, ఏసుక్రీస్తు లాగా మహాత్మాగాంధీ కూడా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోతారని భారతదేశ ఆఖరి బ్రిటిషు వైస్రాయి లూయీస్ మౌంట్ బాటన్ అన్నారు. ఈ యుగంలో జన్మించిన మహాత్ములలో ప్రప్రధమంగా పేర్కొనవలసిన మహనీయుడు గాంధీజీ. నేడు ఆయన బోధనలు కేవలం మనదేశంలోనే గాక ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గాంధీజీ గురించి ఇలా అన్నారు. "రక్త మాంసాలతో నిండివున్న ఇలాంటి వ్యక్తి ఒకప్పుడు భూమి మీద నడిచారు అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని."
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో జన్మించారు. గాంధీజీ చిన్నతనం నుండి అధ్యాత్మిక చింతన గలిగిన నాయకుడయ్యారు. చిన్నతనంలో తనకు ఆటలాడుకోవటం కన్నా ఒంటరిగా చాలా దూరం నడవటం అంటే ఇష్టంగా ఇండేదని చెప్పేవారు. గాంధీజీ 13 సం|| ల వయస్సు లో కస్తూరిబాతో వివాహం జరిగింది. 1888 లో న్యాయశాస్త్రం అభ్యసించడానికిగాను లండన్ వెళ్ళారు. విద్యార్ధిగా ఉన్న రెండున్నర సంవత్సరాలలో ఫ్రెంచి, లాటిన్, రోమన్ భాషలను భౌతిక శాస్త్రాలను ఆయన పూర్తి చేశారు.
భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా తొలిసారిగా ముంబాయి కోర్టులో తన వృత్తిని చేపట్టారు. ఆ తరువాత కొద్దికానానికి ఒక ధనవంతుడైన వ్యాపారస్తుని కేసు వాదించడంకోసం దక్షిణాఫ్రికా వెళ్ళి 21సం|| అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండగా ఆయన జీవితంలో చేదు అనుభవాలు ఎదురై సమస్త చరిత్రనే మార్చివేయడానికి పుట్టిన మహామనిషిగా మార్చివేశాయి. భారతీయుల ఆత్మగౌరవం కాపాడే విధంగా దక్షిణాఫ్రికాలో చేపట్టిన శాసనోల్లంఘణోద్యమం విజయం సాధించింది. 40 సం|| వయస్సులో భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ సమస్యలు పూర్తిగా తెలుసుకున్నారు. దానిలో నిజాయితీ,సత్యం, బ్రహ్మచర్య, పేదరికం ఇతరులకు సేవచేయటం అనే లక్ష్యాలతో అహ్మాదాబాదు సమీపంలో సభర్మతి దగ్గర ఆశ్రమం స్థాపించారు.
1919లో బ్రిటీషు సైనిక అధికారి జనరల్ డైయర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపడం జలియన్ వాలా బాగ్ మారణ కాండ గాంధీజీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కారణ భూతులయ్యాయి. బ్రిటీషు వారు భారత దేశం వదలి వెళ్ళేదాకా తన ఉద్యమం కొనసాగించారు. సహాయ నిరాకరణ వల్లే మనకు స్వాతంత్ర్యం సిద్దిస్తుందని ప్రచారం చేశారు. పలు బహిరంగ సభల్లో బ్రిటిషు వారి వస్త్రాలను బహిష్కరించమని పిలుపు నిచ్చారు. దండి ఉప్పు సత్యాగ్రహం చేపట్టి శాసనోల్లంఘనోద్యమం లేవనెత్తి ఆయన కూడా 60 వేల మందితో పాటు అరెస్టయ్యారు. భారత దేశం భిన్నమతాలకు, కులాలకు, సంస్కృతులకు ఆలవాలమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి గాంధీజీ ఎన్నో ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యరు. 1947 ఆగస్టు 15వ దేదీన భారతదేశానికి స్వాతంత్రయం సిద్దింపచేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం కైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమీషన్ రాకను బహిష్కరించడం, ఉప్పుసత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం, లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం ఆయన అవిశ్రాంత పోరాటానికి నిదర్శనాలు. ఆయన చరిత్రలో మరుపురాని సంఘటనలు.
స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత హిందూ-ముస్లింల మధ్యన చెలరేగిన హింసాకాండను ఆపి శాంతిని నెలకొల్పడానికై కలకత్తాలో నిరాహారదీక్షను సాగించారు. అదే విధంగా ఉత్తర పంజాబు, బెంగాల్ లలో జరుగుతున్న హింసాత్మక చర్యలు ఆపుచేయడానికి ఆమరణనిరాహార దీక్ష చేపట్టారు. 1948 జనవరి 30 వ తేదీన ఒక మతోన్మాది కాల్పులకు ఆయన జీవితాన్ని అర్పించారు.
గాంధీజీ ఒక సత్యానికి ప్రతినిధి అని నెహ్రు అన్నారు. అంతే కాకుండా మన జీవితాల నుండి వెలుగు వెళ్ళిపోయింది. ఎటు చూసినా అంధకారం అలుముకుంది. మన ప్రియతమ నాయకుడు బాపు మనదేశానికి తండ్రి అని చెప్పుకున్న గాంధీజీ మనకు ఇక లేరు, అని దుఃఖించారు. ఆయన జీవితం ఒక సత్య - ప్రేమ సందేశం వంటిది. అటువంటి మహనీయుడు కొన్ని శతాబ్దాలవరకు జన్మించడేమో అని అంటే అతిశయోక్తి కాదు. గాంధీజీ జీవితం ఆయన బోధనలు అనోన్యమైన ఆయన నాయకత్వం ఆయన మరణం యావత్ జాతిపై చెరగని ముద్రవేసింది. ఈ సందర్భంలో ప్రతి రోజు ఆయన చేసే ప్రార్దనా గీతంతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం.
రఘుపతి రాఘవ రాజారం - పతితపావన సీతారం
ఈశ్వర అల్లా తేరేనాం - సబ్ కో సన్మతిదే భగవాన్
ఆయన పేరిట నిర్మించిన రాజ్ ఘాట్ లోని సమాధిని ఎంతో మంది విదేశీ ప్రముఖులు సందర్శించి, శ్రద్దాంజలి ఘటిస్తున్నరు. భారతీయులకు స్మారక చిహ్నంగా పర్యాటక కేంద్రంగా నిలిచిపోయింది.
లండన్ లో చదివేరోజుల్లో గాంధీజీ తొలిసారిగా భగవద్గీతను చదివారు. గీతా సందేశం ఆయన మనస్సులో అతుక్కుపోయింది. క్రమ శిక్షణతో నిరాడంబరంగా జీవించడం అలవాటు చేసుకున్నారు. గాంధీజీ జాతీయోద్యమంతో పాటు సాంఘిక సమస్యల పట్ల కూడా తన కృషిని కేంద్రీకరించారు. దేశం లోని లక్షలాది చేనేత పనివారి జీవితాలు ఆర్ధికంగా స్వయం సమృద్ది సాధించడానికి కృషి చేశారు. గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించేవారు. భారతదేశం లోని గ్రామాలు స్వయం పోషకత్వం చెందినప్పుడే దేశం ఆర్ధికంగా పరిపుష్టి చెందగలదని గాంధీజీ అనేవారు. దేశానికి గ్రామాలు ఆయువు పట్టు అని గాంధీజీ విశ్వాసం.
‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ మాలడై తిరుగుతేనేమి?’ అని ప్రజలు గాంధీజీ గురించి పాటలు పాడుకున్నారు. గాంధీజీ పట్ల కోట్లాది భారతీయులకు పూజ్య భావం ఏర్పడినందువల్ల ఆయన ‘జాతి పితగా’ బాపూజీ ప్రజలచే పిలువబడినారు.

గాంధీజీ సూక్తులు:

 1. చదవడం వలన ప్రయోజనమేమంటే నలుమూలల నుంచి వచ్చే విఙ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి గుణ పాఠాలు తీసుకోవడం.
 2. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించుకుంటూ వుంటే హక్కులను పొందుటకు అర్హులవుతారు.
 3. నియమ బద్ద జీవితానికి కోర్కెలను జయించటం మొదటి మెట్టు అవుతుంది.
 4. ఆచరించటం కష్టమని మూలసూత్రాలను విడిచి పెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.
 5. తనకు తాను తృప్తి పడే మానవుడు ఇక ఎదగడు
 6. దుర్బల బాధల అనుభవం నిజాయితీకి ఒరిపిడిరాయి.
 7. భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది
 8. లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది.
 9. స్వార్ధ త్యాగం, కృతనిశ్చయం, వినయ విశ్వాసాల వల్ల ఆత్మబలం చేకూరగలదు.
 10. మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహన శక్తి అవసరం.
ఈ వ్యాసం నిజ ప్రచురణ : APallround.com

Sunday, January 26, 2014

స్థంబించిన జీమెయిల్ - ఫన్నీ ట్వీట్ చేసిన యాహూ

నిన్న ఒక్కసారిగా జీమెయిల్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంబించాయి. ఒక్కసారిగా జీమెయిల్ సేవలు ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాని యూజర్లు ఉలిక్కిపడ్డారు.
పిల్లికి చెలగాటం- ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు యాహు తన ట్విట్టర్ లో జీమెయిల్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది.
ఇలా చేసిన షేర్ ట్విట్టర్ వీక్షకులకు సరదాని పంచింది. దాని ట్వీట్ట్ ను దాదాపు 15oo మంది ah, snap అంటూ ఫన్నీగా షేర్ చేసుకున్నారు. ఇకపోతే క్రితనెలలో యాహు మెయిల్ కూడా స్థంబించడం దానికి అది క్షమాపణ చెప్పడం తెలిసిందే !

Friday, January 24, 2014

మాయంకానున్న ఫేస్ బుక్ ??

వాషింగ్టన్: నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కనుమరుగుకానుందా? మరెంతోకాలం మనుగడ సాగించలేదా? అంటే అమెరికాలో ఓ సర్వే అవుననే చెబుతోంది.

2015-2017 నాటికి ఫేస్ బుక్ 80 శాతం మంది తన ఖాతాదారుల్ని కోల్పోతుందని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ విద్యార్థుల జరిపిన సర్వేలో  వెల్లడైంది.  పేస్ బుక్ వాడకం దారుల సంఖ్య రానురాను అదే రీతిలో పతనమవుతుందని ఆ సర్వే పేర్కింది. ఫేస్ బుక్ మరెంతో కాలం మనుగడ సాగించలేదని, క్రమేణా వాడకం దారులు పూర్తిగా తగ్గి కనుమరుగవుతుందని వెల్లడించింది. దీనికి పలు ఉదాహరణలను, కారణాలను తెలియజేసింది. ఫేస్ బుక్ లో ప్రస్తుతం 119 కోట్లమంది ఖాతాదారులున్నారు.
Source: Sakshi.com

Wednesday, January 1, 2014

రిజిస్టేషన్ లేకుండానే ఉచితంగా నెట్ ద్వారా ప్రపంచమంతా SMSలు పంపండి ఇలా ...

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 క్రీంది వెబ్సైట్ ద్వారా మీరు ప్రపంచమంతా లు పంపవచ్చు. ఏ విధమైన రిజిస్టేషన్ చేసుకోనవసరం లేదు.

లింక్ : http://uthsms.net//index.php?on=null