అది ఫిబ్రవరి 27, 2002. గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌వూపెస్ ఎస్-6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మతకల్లోలాలు దావానలంలా వ్యాపించాయి. రాష్ట్రంలో 25 జిల్లాలు ఉండగా.. 16 జిల్లాలు అల్లర్లతో అతలాకుతలమయ్యాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారాలు, దహనాలు, లూఠీలు, హత్యలు, మానభంగాలు, సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. వెయ్యి మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలయింది.
అనేక వేల మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసబట్టారు. స్వాతంవూత్యానంతరం మతకలహాల ముసుగులో ఈ స్థాయిలో గుజరాత్‌లో కొనసాగిన విధ్వంసంపై జాతి యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన మహాత్మాగాంధీ పుట్టిన నేలపై రక్తం ఏరులై పారడంతో ప్రపంచమూ నివ్వెరపోయింది.
అల్లర్ల వెనుక..!
ప్రతి ఒక్కరూ మొదటగా వేలెత్తి చూపేది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీనే. ఆయన మంత్రివర్గ సహచరులనే. అల్లర్లు దావానలంలా వ్యాపిస్తున్నా వాటిని అడ్డుకునేందుకు ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రధాన అభియోగం. పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని మతోన్మాద శక్తులకు వెన్నుదన్నుగా నిలిచారని, ఆయన అండదండలతోనే అల్లరి మూకలు చెలరేగిపోయాయని, అల్లర్లను నిలువరించకూడదని పోలీసులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని బాధితులు, సామాజికవేత్తలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివిధ సందర్భాల్లో మీడియాతో మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే.. చట్టబద్ధంగా చూస్తే మోడీ నిర్దోషే! అల్లర్లలో తన భర్తను కోల్పోయిన బ్రిటన్‌కు చెందిన ముస్లిం వితంతువు, కుటుంబసభ్యులు మోడీపై వేసిన సివిల్ కేసు ఒక్కటే ఉంది! ఇప్పటి వరకూ ఆయనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. కానీ.. అల్లర్లలో హతమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రమే మోడీకి ఎదురుదెబ్బ తగిలింది. మోడీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నత్తనడకన విచారణ...
గోద్రా రైలు దుర్ఘటనపై గుజరాత్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నానావతి, జస్టిస్ అక్షయ్ మెహతాలతో కూడిన విచారణ కమిషన్ గోద్రా దుర్ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని తొలి దఫా నివేదికలో పేర్కొంది. గోద్రా ఘటనతో ఉద్వేగానికిలోనైన హిందూ, ముస్లింలు అల్లర్లుకు పాల్పడ్డారని అభివూపాయపడింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నియమించిన రాఘవన్ (సీబీఐ మాజీ డైరెక్టర్) కమిటీ అల్లర్లపై విచారణ 600 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కమిటీ మోడీని దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో మోడీని రాఘవన్ కమిటీ తీవ్రంగా అభిశంసించిందనే అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి మోడీ పక్షపాతంగా వ్యవహరించారని, ముస్లింలపై దాడులు జరుగుతున్నా వారిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముస్లింలపై దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు యత్నించారని, నమ్మకస్తులైన ఇద్దరు మంత్రుల ద్వారా వ్యవహారం నడిపించారని నివేదికలో పేర్కొన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నివేదికపై మార్చి 3న సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ నానావతి, జస్టిస్ అక్షయ్ మెహతా కమిటీ కూడా మార్చి 31న తుది నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి.
ఇంకా కోలుకోని బాధితులు..!
అల్లర్ల కారణంగా తమ స్వస్థలాలను వదిలి వెళ్లిన కుటుంబాలు ఆ ఉదంతం జరిగిపోయి పదేళ్లు గడిచినా సొంతగూటికి రాకపోవడం చూస్తుంటే.. వారెంతగా భీతిల్లిపోయారోననడానికి నిదర్శనంగా నిలుస్తోంది. పెద్దలను కోల్పోయిన అనేక కుటుంబాల జీవనం చిన్నాభిన్నమైంది. అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైన యువతులు, మహిళలు ఇంకా కౌన్సెలింగ్ తీసుకుంటూనే ఉంటున్నారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు భయాందోళనల మధ్య జీవనం గడుపుతూనే ఉన్నాయి. అయినా.. ఇప్పటికీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన నష్టపరిహారం అందలేదనే ఆరోపణలు ఉన్నాయి.
న్యాయం జరిగేనా?
జస్టిస్ నానావతి కమిషన్ ఇంకా తుదినివేదిక సమర్పించాల్సి ఉంది. పది కేసులు.. ముఖ్యంగా బెస్టబేకరీ, గుల్బర్గ్ సొసైటీ, సర్దార్‌పురా హత్యాకాండలపై రాఘవన్ కమిటీ సమర్పించిన నివేదికపై సుప్రీం విచారిస్తోంది. కానీ.. ఈ అల్లర్ల కేసుల్లో ప్రధాన నిందితులైన బీజేపీ ఎమ్మెల్యే మాయా కొడ్నాని, హిందూ మతతత్వ సంస్థకు చెందిన కార్యకర్తలు డాక్టర్ జైదీప్ పటేల్, బాబు బజ్‌రంగ్ తదితరులు బెయిల్‌పై విడుదలై దర్జాగా తిరుగుతుండటమే బాధితులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
(Article taken from : http://www.namasthetelangaana.com
No comments:
Post a Comment