Saturday, December 19, 2015

ఇకపై ఈనాడు నుంచీ కాపీ చేయోచ్చటకొన్ని రోజుల క్రితం నుంచీ ఈనాడు పత్రిక కూడా కాపీరాయుళ్ళకు ఊతమిచ్చేలా తన ఫాంటును యూనికోడ్ లోకి మార్చింది . ఈనాడు తన ఫాంటును మార్చడానికి కారణం కాపీరాయుళ్లకోసం కాదులెండి . ఎందుకంటే 
క్రొత్తగా కాపీరైట్ వాక్యాన్ని పెద్దగా చేర్చారు.  
సెర్చ్ లో తన స్థానాన్ని పొందేందుకు అలా చేస్తున్నదట . వివరాలు ఇక్కడ చూడండి 


Sunday, October 11, 2015

భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు


భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు
లండన్: భూమికి ఇప్పుడప్పుడే అంతం లేదని.. ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకువస్తున్నదని.. దీని వేగం.. సాంద్రతను అంచనా వేసినప్పుడు..ఒకవేళ అది భూమిని ఢీకొంటే విశ్వ వినాశనం తప్పదన్న వార్తలను నాసా కొట్టిపారేసింది.

ఆస్టరాయిడ్86666 అనే పేరు గల ఈ గ్రహశకలం శనివారం భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని ముందుగానే నాసా శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. అది భూమిని ఢీకొంటుందని.. దానివల్ల ప్రపంచం క్షణాల్లో నాశనమవుతుందని గత నెలరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. దీని ప్రయాణం గురించి నాసా శనివారం తెలిపింది. ‘ఆస్టరాయిడ్ 86666 అక్టోబర్ 10న భూమిని 15 మిలియన్ మైళ్ల దూరం నుంచి సురక్షితంగా దాటుతుంది.’’ అని పేర్కొంది.  రానున్న వందేళ్లలో గ్రహశకలాల వల్ల భూమికి ప్రమాదం 0.01శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

Wednesday, September 23, 2015

ఇదసలు టీడీపీయేనా ?

కాంగ్రెస్ వస్తే కష్టం ఉంటుంది. బాబు ఉంటే సిష్టం ఉంటుందనేది ఎవరు ఔనన్నా కాదన్నా జనం బిలీఫ్. అభిమానంతో కాదు మరో గత్యంతరం లేక ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది. ఇలాంటి నమ్మకం, టాక్ ప్రతి మూలా ఏపీలో వినిపిస్తుంటాయ్. కుంభకోణాలతో రాష్ట్రం కుదేలైపోయాక, జైల్ పొలిటిక్స్ పెచ్చుమీరిపోయాక అయితే ఇలాంటి సౌండ్ మళ్లీ సాలిడ్ గా వినిపించింది. పదేళ్ల కిందట అయితే పరిస్థితి ఇలాఉందా ? చంద్రబాబు ఎక్కడికక్కడ పరుగులు తీయించాడు… అధికారులని నాయకుల్ని మునివేళ్ల మీద నిలబెట్టాడు. ఆ ఊపేవేరు అంటూ చెప్పుకున్నారు. తెచ్చుకున్నారు మళ్లీ ! అదంతా పాజిటివ్. బ్రాండ్ బాబు. సరే. మరి అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతోంది ? రాజధాని, ప్రయాస, పెట్టుబడులు, సీఎం టూర్లు ప్రయత్నాలు అన్నీ సరే ! గ్రౌండ్ రియాలిటీ ఏంటి ? అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వంలో సీన్ ఏంటి ?
వీళ్లా నాయకులు… ?
చదువుకున్నోళ్లంతా గుమస్తాలైపోయారు. చదువురాని వాళ్లు స్కూళ్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారన్నట్టు…సీనియర్లు, హ్యాండిల్ చేసేవాళ్లంతా సైడ్ అయిపోయారు. కుమ్మేయాలనుకుంటున్న వాళ్లు… ఆత్రం తప్ప ఆలోచన లేనివాళ్లూ ఇపుడు స్టీరింగ్ దగ్గరున్నారు. అందుకే చంద్రబాబుకి ఎంత వినబడుతోందో తెలియదు కానీ… గ్రౌండ్లో మాత్రం గగ్గోలు రీసౌండ్ వచ్చేస్తోంది. కొత్త వర్సెస్ పాత కుమ్ములాటలు.. ఆధిపత్య రాజకీయాలు,పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నామనే డైలాగులు ఇలా ఎవరికి తోచింది వాళ్లు చేసేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంగతే చూద్దాం. భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం చేస్తున్న సేకరణలో భూ కుమ్ములాట చంద్రబాబుకే చికాకు తెచ్చింది. ఓ మంత్రి రిసార్ట్ కి ఎర్త్ పెట్టేందుకు మరో మంత్రి స్కెచ్చేసేసరికి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారని చెబుతున్నారు. అంటే పాత వాళ్లకి విలువ లేదు. కొత్తగా వచ్చిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతం వెళ్లినట్టేగా కేడర్ లోకి !
ఇదంటే పార్టీ అంతర్గత విషయం అనుకుందాం. మరి మిగతా చోట్ల జరుగుతున్న అడ్డగోలు వ్యాపారాలు వ్యవహారాలు చాలానే ఉన్నాయ్. ఇసుక రీచ్లు, జిల్లాల్లో మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేలకి నిర్బంధ వాటాలు, కేబుల్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ పెత్తందారీతనం ఇవన్నీ చూస్తుంటే
ఏం చేస్తున్నాడు చంద్రబాబు అనిపిస్తోంది. గదమాయించడానికి జంకుతున్నాడా ? కంట్రోల్ చేసే పరిస్థితిలో లేడా ? తీరిక లేదా ఆయనకి ? అనే సందేహాలు సగటుమనిషిలో వస్తున్నాయ్. ఆయనకి తెలిసి ఇలాంటివి జరుగుతాయని మేం అనుకోం..ఆయన మూడోకన్ను తెరవాలంటూ
అనంతలో ఓ కార్యకర్త స్వయంగా ఆయన సమక్షంలో అనడమే దీనికి సంకేతం. ఒకప్పుడంటే … ఆరోపణ వచ్చినా… డిసిప్లీన్ తప్పినా ఠకీమని చర్యతీసుకునేవాడు చంద్రబాబు. కోటిరూపాయల కుంభకోణం జరిగితే మంత్రి పదవి పోయినోళ్లున్నారు. శాంతిభద్రతలకి విఘాతంకల్గించారని కేబినెట్ లో చోటు దగ్గక అల్లాడిపోయిన ప్రముఖులు కూడా కనిపించారు ఆ తొమ్మిదేళ్లలో !
ఇప్పుడు మాత్రం అలా లేనట్టుంది. సొంతవ్యాపారాల కోసం అధికారాన్ని వాడుకోవాలనే తాపత్రయంలో మంత్రులు..పరిస్థితి చేయిదాటిపోయినా చలించే చేవ లేని కేబినెట్… జనంతో, రాజకీయంతో సంబంధం లేనివాళ్లు నడిపిసే కూటములు… ఎవరెవరికో రికమండేషన్లు… పార్టీ కోసం సర్వం వదులుకున్నవాళ్లని కాదని… ఎక్కడి నుంచి అమాంతం ఊడిపడిపోయే రౌడీషీట్ ఎమ్మెల్సీలు ఇలా వెతికినకొద్దీ మంచం నిండా కంతలే ! ఇబ్బందులుండచ్చు… రాజకీయంగానూ కొన్ని లిమిటేషన్లు కనిపించొచ్చు. కానీ ప్రతిసారి ఇలాంటి సీనే కనిపిస్తే అసలైన కార్యకర్తల సహనం చచ్చిపోతుంది. జనంలో ఆక్రోశం పెచ్చరిల్లిపోతుంది. ఆపై పరిస్థితి అదుపుతప్పుతుంది. అన్నిటికీ ఆ ఒక్కడే… ఆ చంద్రబాబే పూనుకోవాలంటే అయ్యే పనికాదు. అందుకే కొరడా ఝుళిపిస్తే… తడాఖా మళ్లీ చూపిస్తేనే ఇటు యంత్రాంగం అయినా అటు పార్టీ అయినా మళ్లీ గాడిన పడేది.
ఆనాటి వెలుగులు ఏవి చంద్రమా…
ఇలా అనుకోవాలా ? అడగాలా ? పాత కొత్త గ్రూపులు… అడ్డదారులు తొక్కుతున్న ఆత్రం… నువ్ పడ్తున్న ప్రయాసని మట్టిలో కలిపేస్తాయ్. ఏపీని ఎక్కడికో తీసుకెళ్తా అంటూ సుదూర తీరాలు చేరేందుకు ఆహోరాత్రం కష్టపడినా ఇలాంటి వాళ్లుండగా ఆ ప్రయత్నాలు అంత తేలిక కాదు. ఆఖరికి రాష్ట్ర రాజధానొచ్చిన గుంటూరు జిల్లాలోనే… ఓ అసెంబ్లీ నియోజక వర్గంలో తన ఆఫీసు తెరిచేందుకు ఎంపీ సాహసించ లేని పరిస్థితి దాపురిస్తే ఇక ఏెం మాట్లాడతాం ? ఇవన్నీ క్రమంగా సర్దుకునే విషయాలు కాదు కళ్లు మూసుకోడానికి. చిన్నాచితకా సంగతులు కాదు చూసీ చూడనట్టు మూసిఉంచడానికి ! బహుళా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్న అత్యుత్సాహమో… లేదంటే వైఎస్ హయాంను చూసి రాజకీయం అంటే ఇలాగే చేయాలన్న తప్పుడు అభిప్రాయానికి వచ్చారోగానీ తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు చంద్రం… కళ్లు తెరువ్ !
Real source: http://www.kostalife.com/telugu/%E0%B0%87%E0%B0%A6%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9F%E0%B1%80%E0%B0%A1%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%AF%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE-0124/

Thursday, September 10, 2015

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్

కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అరెస్ట్బదులు డిపాజిట్ చెల్లిస్తే వాటిని విద్యార్థి చదువు అయిపోయిన తర్వాత వడ్డీతో సహా ఇస్తానని వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేశవరెడ్డిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల పేరిట అనేక విద్యా‌సంస్థ‌ల‌ను ప్రారంభించి ప్రముఖ విద్యావేత్తగా ఎదిగిన కేశవరెడ్డిని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.800 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి, విద్యార్థుల చదువు అయిపోయి గడువు తీరినా డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇవ్వలేకపోయారు. దీనిపై బాధితులు సదరు విద్యాసంస్థల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజుకు
ఇదిలావుండగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించడంలోనూ కేశవరెడ్డి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆయన విద్యా సంస్థలకు చెందిన ఆస్తులను ఆయా బ్యాంకులు వేలానికి పెట్టాయని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మీదటే కేశవరెడ్డి వద్ద డిపాజిట్లు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలకు దిగిన‌ట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన కేశవరెడ్డి తన సొంతూరులో చిన్న బ‌డి పెట్టు‌కొని అంచెలంచెలుగా ఎదిగారు. ఫిర్యాదుల నేపథ్యంలో కేశవరెడ్దిని నేటి ఉదయం అదుపులోకి తీసుకున్న కర్నూలు పోలీసులు మరికాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్ అనంతరం వారం రోజులపాటు కేశవరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు తెలిసింది.
కాగా కేశవరెడ్డి తమ సంస్థలను విద్యార్థులతోపాటు నారాయణ, చైతన్య (చైనా గ్రూపు) సంస్థలకు విక్రయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందం ఖరారైతే తమకు వచ్చే మొత్తం నుంచి బాకీలు తీర్చవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు డిపాజిటర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని, వచ్చే యేడాది అందరి సొమ్ములు తిరిగి ఇచ్చేస్తానని ఆయన ధీమాగా చెబుతున్నారు.

Wednesday, June 17, 2015

రాజధాని నిర్మాణంపై "ఓటుకు నోటు" ప్రభావం ?

       "ఓటుకు నోటు" స్కామ్  వ్యవహారంపై ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశమంతటా చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో తొందరపడి జోక్యం చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకుంది . కాకపొతే ఈ అంశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు . దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నట్లు తెలుస్తుంది . ఎట్టకేలకు రాజధాని నిర్మాణం మొదలవబోతున్నదన్న ఆ రాష్ట్ర ప్రజల ఆనందం ఎంతోకాలం నిలవలేదు . ఈ లోపే ఈ స్కాం  లో సాక్షాత్తూ సీయం చిక్కుకోవడం  వెనుక కారణాలపై ప్రజలు చర్చించు కుంటున్నారు . తెలంగాణా ప్రభుత్వం కక్షతోనే చంద్రబాబును ఇరికిన్చిందని ఎక్కువమంది నమ్ముతున్నారు . తమ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని కేసీయార్ ఈ పని చేయించి ఉంటారని వారి నిమ్మకం .
 ఇక జగన్ కూడా ఈ విషయంలో తొందరపడి రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడితే బాగుండేదని కొందరి అభిప్రాయం . ఈ పరిస్థితిలో తానూ ఎలాగూ ముఖ్యమంత్రి కాలేదు కనుక రెండు అంశాలపై యుద్ధం చేసి న్యూట్రల్ గా ఉన్న అభిప్రాయం కలిగించాల్సిందని చెపుతున్నారు .
విదేశాలు ముఖ్యంగా సింగపూర్ , జపాన్ కూడా పరిణామాలను గమనిస్తున్నాయని విశ్లేషకుల అంచనా . చంద్రబాబు అరెష్ట్ అయి వేరే సీయం వస్తే రాజధాని నిర్మాణంపై తాము ముందు ఉన్నంత చొరవ చూపలేమని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు వారంటున్నారు . ఇలాంటి  విషయమే  ఓ  కాంగ్రెస్ నాయకుడు రామచంద్రయ్య కూడా ప్రకటించారు .

Sunday, June 14, 2015

గవర్నర్ కులాన్ని రాజకీయం చేస్తున్న ABN ఆంధ్రజ్యోతి

గవర్నర్ నరసింహన్ పై సెంటిమెంటు ద్వారా కేసీయార్ మంచిపేరు తెచ్చుకుంటున్నారని ఆయన బ్రాహ్మహుడు కావడం వల్ల  తరచూ ఆయనను దైవ సంబంధ కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆయన కాళ్ళకు నమస్కరించడం చేస్తున్నారని ఆయన దృష్టిలో మంచి మార్కులు కొట్టేసారని ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి రామకృష్ణ తన టీవీలో తెలిపారు .
కులం సెంటిమెంటుపై ఇంతలా గగ్గోలు పెట్టె ఆంధ్రజ్యోతి చంద్రబాబుని కూడా కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటె బాగుండేది .
తానూ పట్టు పడే వరకూ తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు రక్షణ బాగానే ఉందా ?
ఫోన్ ట్యాపింగ్  విషయం తానూ పట్టు పడే వరకూ తెలీనే లేదా ?
సెక్షన్ 8 ఇంతకాలం గుర్తు రాలేదా ?


తెలంగాణా పౌరుడు తప్పుచేస్తే శిక్షించే అధికారం ఆ ప్రభుత్వానికి లేదా ?

చంద్రబాబు తెలంగాణా పౌరుడే . అక్కడే వోటు హక్కు ఉంది . అక్కడే ఆధార తదితర నమోదులు ఉన్నాయి . మరి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి , అక్కడి పోలీసులకు ఆయన్ని శిక్షించే అధికారం లేదా ?

Sunday, June 7, 2015

ఇకనుండి ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి కామన్

 ట్విట్టర్ లో బాబుపై వస్తున్న వ్యాఖ్యలు ...
దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక CM అవినీతి నేరుగా బట్టబయలు.
.ఒక ముఖ్యమంత్రే అవినీతి, లంచగొండి అయితే ఇక అధికారులు ఎవరికీ భయపడాలి ? చంద్రబాబు ఖచ్చితంగా దోషే నిప్పులా చెప్పుకునే. ఆయన తన పరువు పోగొట్టుకున్నాడు.
దమ్మున్న చానల్ చూస్తుంటే అసహ్యం కలుగుతుంది
బిజెపి తన మద్దతు ఉపసంహరించు కోవాలి. 

Monday, June 1, 2015

రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్న "అంధ జ్యోతి"

నిన్నటి రాజకీయపరిణామాల్లో అన్ని టీవీ చానల్స్ ఒకలా వ్యవహరిస్తుంటే మనమే డిసైడ్ చేసేలా రిపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి మాత్రం పూర్తి  భిన్నంగా తెలుగుదేశం కొమ్ముకాస్తూ వ్యవహరించడం గమనించండి .కేసీయార్ కుట్ర చేసి ఇరికించారని , రేవంత్  తప్పే లేదన్నట్లు ప్రసారం చేస్తున్న అంధ జ్యోతిని బేన్ చేసి మంచి పని చేసారు ...
టీవీ 9 ఈ వ్యవహారంలో ఆచి తూచి నిశ్పక్షపాతంగానే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు .