Monday, March 18, 2013

2013-14 రాష్ట్ర బడ్జెట్ హైలైట్ల్స్

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో సమర్పిస్తున్న 2013-14 బడ్జెట్‌ వివరాలు:

రాష్ట్ర బడ్జెట్ రూ. 1,61,348 కోట్లు
గతంలో 1,45,854 కోట్లు
ప్రణాళికేతర వ్యవయం రూ.1,01,926 కోట్లు
గతంలో రూ.91,824కోట్లు

ప్రణాళికా వ్యయం రూ. 59,422 కోట్లు
గతంలో రూ.54,030కోట్లు
రెవిన్యూ మిగులు రూ. 1023 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు 6128 కోట్లు
గతేడాది రూ. 2800 కోట్లు

సాంఘిక సంక్షేమ శాఖ కు 4122 కోట్లు
గతేడాది రూ. 17019కోట్లు

గిరిజన సంక్షేమం రూ. 2126 కోట్లు
గతేడాది రూ. 1013కోట్లు

బీసీ సంక్షేమం రూ. 4027 కోట్లు
గతేడాది రూ. 2656 కోట్లు

మైనార్టీ సంక్షేమం రూ. 1027 కోట్లు
గతేడాది రూ. 482 కోట్లు

మహిళా శిశు సంక్షేమం రూ. 2712
గతేడాది రూ. 2282 కోట్లు

వికలాంగుల సంక్షేమం రూ. 73 కోట్లు
యువజన సేవలు రూ.280 కోట్లు
గతేడాది రూ. 343 కోట్లు
పర్యాటక రంగం రూ. 163 కోట్లు

గృహనిర్మాణం రూ. 2326 కోట్లు
గతేడాది రూ. 2300 కోట్లు
పౌరసరఫరాలు రూ. 3231 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ. 11200 కోట్లు
గతేడాది రూ. 5855 కోట్లు

పట్టణాభివృద్ధి రూ. 6770 కోట్లు
వైద్య ఆరోగ్యం రూ. 6481 కోట్లు
ఉన్నత విద్య రూ. 4082 కోట్లు
పాఠశాల విద్య రూ. 16990 కోట్లు
మౌలిక సదుపాయాలకు రూ. 180 కోట్లు
రోడ్లు భవనాలు రూ. 5451 కోట్లు
గతేడాది రూ. 3210 కోట్లు

ఇంధన, విద్యుత్ రంగాలకు రూ. 7117 కోట్లు
నీటిపారుదలకు రూ. 13800 కోట్లు
గతంలో కంటే తగ్గిన జలయజ్ఞం కేటాయింపులు
గతేడాదితో పోలిస్తే రూ. 12017 కోట్లు తగ్గుదల
గతేడాది రూ. 15013 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ. 1120 కోట్లు
ఐటీ రంగానికి రూ. 207 కోట్లు
శాంతి భద్రతలకు రూ. 5386 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ రూ. 100 కోట్లు -

Monday, March 11, 2013

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య


 Delhi Gangrape Case Prime Accused న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన వైద్య విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు అతను తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. రాంసింగ్ ఉరేసుకుని తీహార్ జైలులోని నెంబర్ 3లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దీన్‌దయాళ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపిన బస్సు డ్రైవర్ అతను. బస్సులో అతి దారుణంగా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో రాంసింగ్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో అతని సోదరుడితో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నాడు. మైనర్ బాలుడిని జ్యువైనల్ హోమ్‌కు పంపించగా, మిగతావారిని తీహార్ జైలులో పెట్టారు. తీహార్ జైలులో వారి పట్ల ఇతర ఖైదీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అరెస్టయినవారిలో రాంసింగ్ సోదరుడు కూడా ఉన్నాడు. రాంసింగ్, ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లపై వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో అభియోగాలు మోపారు. 23 ఏళ్ల నిర్భయపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన బస్సులో అతి కిరాతకంగా అత్యాచారం జరిగింది. బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంపై ఢిల్లీ అట్టుడికింది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో మహిళల రక్షణపై చర్చకు ఈ సంఘటన దారి తీసింది. మహిళ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి విధించాల్సిన శిక్షలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరు మీద మహిళల కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది.

Read more at: http://telugu.oneindia.in/news/2013/03/11/india-delhi-gangrape-case-prime-accused-113496.html

Thursday, March 7, 2013

అపోహలు తోడైతే శృంగారం నిస్సారంమంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం లాంటి అంశాలు మనిషిని నిత్యయవ్వనుడిగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇటువంటి వారు ఏళ్లు నిండుతున్నా ఉత్సాహంగా ఉంటూ శృంగార జీవితంలో కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోకుండా గడుపుతూ ఉంటారు. అనుభవం, మంచి ఆలోచనలతో వీరు లైంగిక జీవితంలో నిత్యం స్వర్గసుఖాలు అనుభవిస్తూ వుంటారు. మనిషికి లైంగిక జీవితం ఎంతో ముఖ్యమైనది, కీలకమైనది. జీవితానికి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం.
* సమాజంలో ఎక్కువమంది వయసు మీరకపోయినా అనేకానేక కారణాలతో అనుభవించాల్సిన మధుర శృంగార జీవితానికి దూరమవుతున్నారు.
* సరైన శారీరక పోషణ లేకపోవడం, ప్రకృతికి విరుద్ధంగా జీవనశైలి, మానసిక వత్తిడి, రకరకాల వ్యసనాలకు బానిసలు కావడంవంటి కారణాల వల్ల కొంతమందిలో వృద్ధాప్యం నడివయసులోనే వచ్చేస్తుంది. వీరిలో లైంగికపరమైన కోరికలు అంతగా పురివిప్పవు.
* నడివయసు దాటినవారు కొంతమంది లైంగికపరమైన ఆలోచనలు రావడం చాలా తప్పుగా పరిగణిస్తారు. అదొక పాపకార్యమని, కుర్రచేష్ట అని భావిస్తారు. మనసులో ఏ చిన్న లైంగిక ధోరణి ఏర్పడ్డా దానిని తుంచేస్తారు.
* వయసు కాస్త పైబడిన దంపతులు తగిన శృంగార జీవితాన్ని పొంది ఉండడం వల్ల వారి ఆరోగ్యం బాగుండడమేగాక ముఖవర్చస్సులో యవ్వన ఛాయలు తొంగిచూస్తూ ఉంటాయి.
* పెళ్లి పరమార్థంగా పిల్లల్ని కంటారు. వారికి పెళ్లిళ్లు చేస్తాం. ఇప్పుడు ఈ వయసులో మనసు లో చలించే ఆలోచనలు ఏమిటి? అనుకునేవారు కూడా ఉంటారు. ఇది సరియైన విధానం కాదు. దాంపత్య జీవితానికి ఏ వయసు ముగింపు కానేకాదు.
నిత్య యవ్వనం
* శరీరాకృతి యవ్వన కాంతితో మిలమిలలాడుతూ ఉండాలంటే ఆహార, విహార, వ్యవహారాలలో కొన్ని మెళకువలు పాటించాలి.
* అనుదినం ఒకటిన్నర లీటర్ల నీటిని తాగాలి. మన శరీర చర్మం ముడతలు పడకుండా ఈ నీరు కాపాడుతుంది. చర్మకణాలు నీరసపడి, ముడతలు పడకుండా వాటిని మృదువుగా వుంచే శక్తి నీటికి ఉంది.
* తాజాపళ్లు తినాలి. ముదురు ఆకుపచ్చని కూరలు బాగా తినాలి. వృద్ధాప్య లక్షణాలను సెలీనియా అనే పదార్థం నిరోధిస్తుంది.
* కోడిమాంసం, బాదం పప్పులో సెలీనియా ఉంటుంది.
* చర్మానికి, జుట్టుకి మేలు చేసే విటమిన్లు సి, ఇ-తో పాటు ఇతర పోషకాలు ఉండే ఆపిల్స్, ద్రాక్ష, నిమ్మ, నారింజ, ఆక్రోటు కాయలు తింటూ ఉండాలి.
* చర్మం పొడారిపోకుండా, ముడతలు పడకుండా చేపలు, ఆవనూనెలో ఉండే ఒమేగా-3, 6 కొవ్వు ఆమ్లాలు కాపాడుతాయి. అందుకే వీటిని కూడా తిండిలో భాగంగా చేసుకోవాలి.
* కంటినిండా నిద్ర ఎంతో అవసరం. చర్మం నిగనిగలాడడానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రించే సమయంలోనే మృత చర్మకణాల స్థానాల్లో 80 శాతం కొత్త చర్మ కణాలు తయారవుతాయి.
* అనుదినం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రించడం వాంఛనీయం. అప్పుడు చర్మకాంతి కాపాడబడుతుంది.
శృంగారానికి సంకెళ్లు..!
* శృంగార జీవితం మనిషికి మంచి ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అదొక (గ)మత్తు వ్యాయామం. అనుభూతుల పర్వంలో తరించేందుకు ఈ ఆటలో స్ర్తి, పురుషులు భాగస్వాములే.
* ఆడ,మగ ఇరువురి సరదా కోరికలను తీర్చే ఈ మధుర సన్నివేశంలో ఎక్కువ, తక్కువలకు చోటు ఉండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, అభిమానించుకోవాలి. సుఖసంతోషాలు పంచుకోవాలి.
* భార్యాభర్తల మధ్య ఏకాంతం ఎంతో అవసరం. అది కొరవడితే జీవితంలో మాధుర్యం పూర్తిగా ఆస్వాదించలేరు. జీవితం యాంత్రికంగా తయారవుతుంది.
* చాలామంది దంపతుల్లో పెళ్లయి ఎన్ని సంవత్సరాలు అయినా ఉండాల్సిన సాన్నిహిత్యం ఉండకపోవడం వారి లైంగిక జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. క్రమశిక్షణగా లేని జీవితాలు విలువైన దాంపత్య సుఖాన్ని ఆస్వాదించలేవు.
* ధూమపానం, మద్యపానం, మత్తుమందులు, మధుమేహం వంటివి లైంగిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
* దంపతులు ఆనందమయ శృంగార జీవితం అనుభవించడానికి పరిశుభ్రత తొలి పెట్టుబడి. చాలామందిలో ఇది కొరవడుతూ ఉంటుంది. దుర్వాసనలు దంపతులను ఎడమొగం, పెడమొగంలోకి తీసుకువెడతాయి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి.
* దాంపత్య సుఖాన్ని పొందమని ఆహ్వానించేటట్లు పడక గది ఉండాలి. మధ్యతరగతి కుటుంబాల్లో పడక గది, స్టోర్ రూమ్, ఇంకా ఇతర సామాగ్రి భద్రపరచుకునే గది ఒకటే కావడం వారి లైంగిక జీవితానికి ఒక రకంగా కావలసిన సౌకర్యాలు లేని విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
* చాలామంది దంపతుల్లో లైంగిక విజ్ఞానం ఉండదు. సంసార జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎన్నో అపోహలు, అనుమానాలు వేధిస్తునాన ఎవరినీ అడగలేరు. తాము ఏదో నష్టపోతున్నామని ఆందోళన చెందుతూ ఉంటారు.
* మగవాడిలో లైంగిక వాంఛ దెబ్బతిన్నప్పుడు తన భార్య తనను శక్తిహీనుడిగా గమనిస్తుందని భయపడతాడు. ఆమెతో సాన్నిహిత్యానికి అతడు ఇష్టపడడు. కారణం తెలియని ఆమె అతడిని అనుమానిస్తుంది. ఫలితంగా వారి జీవితాల్లో చీకట్లు అలముకుంటాయి.
* తన సమస్యను భార్యకు నైపుణ్యంగా వివరించుకోవాలి. ఇద్దరూ కలిసి ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ విషయంలో మగవానికి ‘మగ అహం’ ఎప్పుడూ అడ్డుగోడగా నిలుస్తూనే ఉంటుంది.
* ఎంతటి కష్టతరమైన పనినయినా సమయం, సందర్భం చూసుకుని సాధించగల మగవాడు భార్య దగ్గర సమయం, సందర్భం మరచి లైంగిక వాంఛ తీర్చుకోవాలని భావిస్తాడు.
* భార్యాభర్తలిద్దరూ మానసికంగా ఉత్తేజ స్థితికి వచ్చినపుడే శృంగారం పండుతుంది. ఈ విషయం తెలిసినా చాలామంది తమ లైంగిక జీవితాలను యాంత్రికంగానే గడిపేస్తూ ఉంటారు.
* లైంగిక జీవితానికి వయసు పరిమితి లేదు. డెబ్బయి ఏళ్ళు దాటిన వారు కూడా కొత్త దంపతుల్లా సుఖ సంసారం చేసుకుంటున్నారని పరిశోధకులు చెపుతున్నారు.
లైంగిక శక్తిని దెబ్బతీసేవి..
* కొన్ని ఔషధాలు మనిషి లైంగిక వాంఛను తగ్గిస్తాయి. లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి విషయంలో తగిన జాగరూకతతో ఉండాలి.
* ఈ ఔషధాలు దీర్ఘకాలం వాడడం వల్ల సాధారణంగా ఇటువంటి దుష్ఫలితాలు వస్తాయి. తనకు లైంగిక శక్తి తగ్గిందని చెప్పడానికి చాలామంది ఇష్టపడరు. ఫలితంగా సంసార సుఖానికి దూరమై నిస్సారంగా బతికేస్తూ ఉంటారు. వైద్యుడికి సమస్య చెబితే ఏదైనా ప్రత్యామ్నాయం లభించవచ్చు.
* నిద్రమాత్రలు కూడా దాంపత్య జీవితంపై ప్రభావితం చూపుతాయి. తాము వాడే మందులువల్ల ఇబ్బంది కల్గుతోందని గ్రహించగానే వాటికి బదులు ఇతర మందులు వైద్యుడి సలహా మేరకు మార్చుకోవాలి.
* డిప్రెషన్ తగ్గడానికి వాడే ఫ్లోక్సెటిన్ హైడ్రోక్లోరైడ్, ఎమిట్రిటైలిన్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు లైంగిక శక్తిని తగ్గిస్తాయి. ఇలాంటి మందులకు బదులుగా వ్యాయామం, ప్రవర్తనపరమైన చికిత్సలు చేయించుకోవాలి.
* రక్తపోటును అదుపులో ఉంచేందుకు వాడే మందులు అన్ని విధాలా మంచివి కావు. వీటిని వాడేవారు నిశ్శబ్దంగా దుష్ఫలితాలు భరిస్తారు. కారణాలు తెలిస్తే ప్రత్యామ్నాయాలు ప్రయత్నిస్తారు.
* కడుపులో పుళ్లకువాడే మందులు, ఆకలిని మందగింపజేసేందుకు ఉపయోగించే మందులు, పార్శ్వపు తలనొప్పి మందులతోకూడా ఇదే ఇబ్బంది. ప్రత్యామ్నాయాలు అనే్వషించుకోవాలి.
 -సి.వి.సర్వేశ్వర శర్మ( from : andhrabhoomi.net)