Friday, June 17, 2016

తెలుగుదేశం రాజకీయ విశ్లేషకులు నరసింహారావు

బయట తిరిగే మూర్ఖుల కన్నా ముసుగేసుకుని మాట్లాడే మేధావులే సమాజానికి ప్రమాదకరం. సాధారణ రాజకీయనాయకులు చెప్పే మాటలను ప్రజలు కొద్దిమేర మాత్రమే విశ్వసిస్తుంటారు. కానీ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు చెబితే చాలా మంది జనం నిజమే కాబోలు అని నమ్మేస్తుంటారు. అందుకే చంద్రబాబు కొందరు మేధావులకు, కొందరు సీనియర్ జర్నలిస్టులకు ముసుగేసి సమాజం మీదకు వదులుతుంటారు. అలాంటి వారెవరన్నది జనం కూడా ఈ మధ్య బాగానే గుర్తిస్తున్నారు.
గౌరవనీయులైన రాజకీయ విశ్లేషకులు నరసింహారావు టీవీ చర్చాకార్యక్రమాల్లో చేస్తున్న వాదన చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. టీడీపీ నాయకుల కంటే ధీటుగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ, చంద్రబాబును ఆయన వెనకేసుకొస్తున్న తీరు చాలా దూకుడుగా ఉంటోంది. బుధవారం ఒక టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. రుణమాఫీ విషయంలో వైసీపీ నేతలు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ అదే చర్చలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కంటే ఎక్కువగా వాదించారు. చంద్రబాబు లక్షా 45 వేల కోట్ల అవినీతి చేశారంటూ ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన కథనాలు కూడా అవాస్తవాలని ఆరోపించారు.
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశం చాలా దారుణంగా జరిగిందని, నిరాశపరిచిందని తేల్చేశారు. ప్రతిపక్షం గొంతును చంద్రబాబు నొక్కడం లేదని జగనే తన పార్టీలోని ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని అచ్చం టీడీపీ నాయకుల తరహాలోనే మాట్లాడారు. జగన్‌ కూడా సీపీఐ నారాయణ లాగా ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని చెప్పారు. ఒక దశలో చర్చలో పాల్గొన్న ఇతర పార్టీల నాయకులు నరసింహారావు తీరును తప్పుపట్టారు. ఒక విశ్లేషకుడిగా మాట్లాడితే బాగుంటుందని, టీడీపీకి వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఇలా వన్‌సైడ్ మాట్లాడడం మానుకోవాలని నరసింహారావుకు వైసీపీ నేత ధర్మశ్రీ సూచించారు.
సాధారణంగా జర్నలిస్టులు, విశ్లేషకులు, మేధావులు ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపుతుంటారు. అలా కాకుండా నరసింహారావు చంద్రబాబును ఆకాశానికెత్తి ప్రతిపక్షాలను విమర్శించడం చూస్తుంటే ఈయన పచ్చ కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలిందన్న భావన వ్యక్తమవుతోంది.. నరసింహారావు ఇప్పుడే కాదు.. 2014 ఎన్నికల సమయంలో మనోవిశ్లేషకుడినంటూ టీడీపీ అనుకూల పత్రికలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ ఉన్మాది, జగన్ సైకో అంటూ ఎడిటోరియల్స్ కూడా రాశారు. ఇలాంటి వారి వల్లే ఏపీలో రాజకీయ విశ్లేషకులపై జనంలో నమ్మకం తగ్గుతోందన్న భావన వ్యక్తమవుతోంది.
 

Tuesday, June 7, 2016

జగన్ "చెప్పుల" కామెంట్ చెయ్యడానికి స్ఫూర్తి ఇదేనా?

అనంతపురం జిల్లాలో జగన్ ఇప్పటికే నాలుగు విడతల్లో రైతు భరోసా యాత్ర చేశారు. కానీ ఆ నాలుగు విడతలు సాదాసీదాగానే సాగాయి. రైతులను పరామర్శించడం, అక్కడక్కడరోడ్‌ షోలు చేయడంతో నాలుగు విడతలు సాగిపోయాయి. కానీ ఐదో విడత అనంత రైతు భరోసా యాత్ర అందుకు పూర్తి భిన్నంగానే సాగింది. నాలుగు విడతల్లో కంటే ఎక్కువగానే స్పందన వచ్చింది. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తుండడం, అందులోనూ కేవలం ఓకే ఎమ్మెల్యే మిగిలిన జిల్లాలో జగన్‌ యాత్రకు ఈస్థాయి స్పందన రావడాన్ని లోతుగా పరిశీలించాల్సిందేన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే ఫిరాయించిన కదిరిలో జరిగిన సభకు జనం పోటెత్తడం చూసి వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. అదే సమయంలో పట్టణప్రాంతాల్లో వైసీపీ బలహీనంగా ఉందన్న భావన కూడా ఉండేది. కానీ ఎస్పీ కార్యాలయం ముందు జగన్‌ నిర్వహించిన ధర్నాకు వేలాదిగా తరలిరావడం గమనించిదగ్గ పరిణామలే. జగన్ రావడానికి గంట ముందు అడ్డుకుంటామంటూ టీడీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. కానీ జగన్ వచ్చే సమయానికి ఒక్కసారిగా వేలాది జనం, వైసీపీకార్యకర్తలు రోడ్ల మీదకు రావడంతో అధికార పార్టీ శ్రేణులు ఆ ప్రాంతంలో కనిపించలేదు. అయితే గత నాలుగు విడతలతో పోలిస్తే ఐదో విడతలో స్పందన అధికమవడానికి ప్రధానంగా రెండుకారణాలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లు పూర్తయినా అనుకున్నస్థాయిలో రాజధాని నిర్మాణం గానీ, ఇతర అభివృద్ది కార్యక్రమాలుగానీ ముందుకు సాగకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయా అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రెండవది జగన్‌ చెప్పుల కామెంట్స్‌ను టీడీపీ బాగా ఎక్కువ చేసి చూపడం కూడా వైసీపీకి కలిసొచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై వ్యాఖ్యలకు నిరసనగా జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో జనంలో రైతు భరోసా యాత్రపై ఒక విధమైన ఆసక్తి పెరిగింది. మీడియాలోనూ నెగిటివ్‌గానైనా జగన్‌ యాత్రకు కవరేజ్ బాగా పెరిగింది. యాత్రను అడ్డుకుంటామన్న టీడీపీ పిలుపుతో వైసీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు కూడా పోటాపోటీగా యాత్రకు తరలివచ్చారు. ఒక విధంగా చెప్పుల వ్యాఖ్యలపై టీడీపీ అతిస్పందన వల్ల అప్పటి వరకు పాసివ్ మోడ్‌లో ఉన్న వైసీపీ శ్రేణులు కూడా కదిలివచ్చేలా చేసిందంటున్నారు. ఒకవేళ జగన్ చెప్పుల వ్యాఖ్యలకు చంద్రబాబు నుంచి చోటా లీడర్ వరకు ఈ రేంజ్‌లో అతిగా స్పందించి ఉండకపోతే జగన్ యాత్రపై ఇంతస్థాయిలో చర్చ కూడా జరిగేది కాదంటున్నారు. మొత్తం మీద వైసీపీ బలహీనంగా ఉందనుకున్న జిల్లాలో జనం ఈ స్థాయిలో కదలిరావడం ఆ పార్టీకి బూస్ట్‌లాంటిదే.
Click here to Read:http://teluguglobal.com/jagan-anantapur-meeting-success/

సత్యానాదెండ్లకు చంద్రబాబే స్పూర్తి అట !

చంద్రబాబు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని ఇజాలకన్నా టూరిజమే గొప్పదని, చరిత్ర చదువుకోవడం వృధా అని చెప్పినపుడు కొందరు ఆశ్చర్యపోయారు… మరికొందరు నవ్వుకున్నారు. కానీ ఆయన చెప్పింది నిజమే. చరిత్ర తెలియడంవల్ల చాలా కష్ట, నష్టాలుంటాయని ఆయన భావించింది నిజమే.
ఉదాహరణకు నావల్లే సత్యానాదెండ్ల మైక్రోసాఫ్ట్‌ సీఇఓ అయ్యాడు. నా ఇన్‌స్పిరేషన్‌తోనే ఐటీ రంగంలో నేను సాధిస్తున్న విజయాల స్ఫూర్తితోనే ఆయన ఐటీవైపు వెళ్లాడు అని ఈమధ్య చంద్రబాబు ఊదరగొడుతున్నాడు.
చరిత్రలోకి వెళితే ఈయన ముఖ్యమంత్రి కాకముందే సత్యానాదెండ్ల మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగి. 1995 ఆగష్టులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1992లో మైక్రోసాఫ్ట్‌లో జాయిన్‌ అయిన సత్యానాదెండ్లకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాడో తలగింజుకున్నా అర్ధంకాదు. చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాధించిన అద్భుతాలను చూసి సత్యానాదెండ్ల సివిల్ సర్వీస్‌వైపు కాకుండా ఇంజనీరింగ్‌ మీద దృష్టిపెట్టి 1988లోనే ఎలా ఇంజనీరింగ్‌వైపు వెళ్లాడో, 1990లోనే అమెరికావెళ్లి ఎలా ఎంఎస్‌ చేసాడో తల బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు. అందుకే చంద్రబాబుకు గతం అన్నా, చరిత్ర అన్నా ఇష్టం లేదు.
నావల్లే హైదరాబాద్‌ ప్రపంచ పటంలో గుర్తింపుపొందిందని, ఐటీ కంపెనీలు తనను చూసే హైదరాబాద్‌కు వురుకులు పరుగులు పెట్టాయని అప్పుడూ..ఇప్పుడూ.. ఎప్పుడూ చెప్పే చంద్రబాబు ఈ రెండేళ్లనుంచి ఆంధ్రాకు ఒక కంపెనీకూడా ఎందుకు రాలేదో చెప్పడు. అదేమంటే భజన బృందాలు ఐటీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ఫెయిల్యూర్‌గా చిత్రీకరిస్తాయి. ఇది నిజంగా ఐటీ మంత్రి ఫెయిల్యూరే అయితే గతంలో హైదరాబాద్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వచ్చిన ఐటీ సక్సెస్‌కూడా అప్పటి ఐటీ మంత్రికి చెందాలికదా..! ఏదైనా సక్సెస్‌ అయితే తన ఖాతాలోకి, ఫెయిల్యూర్‌ అయితే ఇతరుల ఖాతాలోకి. అంతేనా?
Source: http://teluguglobal.com/chandrababu-comments-on-satya-nadella/