Saturday, August 31, 2013

హైదరాబాద్ ఉద్యోగుల్లో విభజన విద్వేషాలు

 తెలంగాణ ప్రకటన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సీమాంధ్ర, తెలంగాణా సంఘాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ విధ్వేషాలు పెంచుకుంటున్నారు. ఇంతకాలం సోదరులుగా కలిసి పనిచేస్తూ ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ మెలిగిన వీరిమధ్య విద్వేషాలు మొదలయ్యాయి. వీటికి కారణం ఖచ్చితంగా రాష్ట్రాన్ని వేరుచేయడం మాత్రం కాదు. ఎందుకంటే ఆనాడు సకలజనులసమ్మె, ఇతర తెలణ్గాణా ఉధ్యమాలలో తెలంగాణా ఉద్యోగులకు జరిగినప్పుడూ సీమాంధ్ర ఉద్యోగులు ఏమాత్రం చలించలేదు. తెలంగాణా ప్రకటనలో అస్పష్టత,వివిధ రాజకీయ నాయకుల అసంబద్ద వ్యాఖ్యలూ ఇరుపక్షాలవారినీ రెచ్చగొడుతున్నాయి. చివరికి ప్రభుత్వం కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడం ,సీయం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసమో తెలీడంలేదు.
తెలణ్గాణా, సీమాంధ్ర ఉద్యోగుల్లో పూర్తి విభేదాలు స్రుష్టించి వారిని కలిసి పనిచేయకుండా చేస్తే తెలంగాణా ఏర్పాటు మరింత సులభమౌతుందని ఇలా కొందరు ప్రవర్తిస్తున్నారని ఓ భావన కూడా ఉంది. ఏది ఏమైనా కేంద్రప్రభుత్వం ఆలశ్యం చేయకుండా తగు చర్యలు తీసుకోకుంటే ఇంకొన్ని కీలక విభాగాల్లోనూ విభజన సెగలు రగిలి రాష్ట్రం రావణకాష్టంగా మారబోతుందనడంలో సందేహం లేదు.

Friday, August 30, 2013

తెలంగాణాపై త్వరలో మరో అఖిలపక్షం?

రాస్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సీయం కూడా తరచూ ప్రతిఘటించడం, జగన్ దీక్ష నేపధ్యంలో కాంగ్రెస్ ఒక మెట్టు దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర కేంద్రమంత్రులూ రాజీనామాలకు సిద్దమవడంతో అటు బీజేపీ వైఖరిలోనూ మార్పు వస్తే తాము అవమాన పడడం ఖాయం అని కాంగ్రెస్ గ్రహించింది. కనుక  తెలంగాణా విభజన ఖాయమన్న తమ అభిప్రాయం ఎలాగూ స్పష్టం చేసాము కనుక ప్రస్తుతం వివిధ పార్టీలు తమ తమ ఎజెండాలౌ, క్రొత్త రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్యాకేజిలు, జలాల పంపిణీ వంటి సమస్యలపై తమ అభిప్రాయాలు,సూచనలతో ముందుకు రావాలని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్న ప్రకటనను కాంగ్రెస్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ద్వారా అటు తెలంగాణా వాదులనూ నొప్పించకుండా, సీమాంధ్ర పార్టీలను డిఫెన్స్ లో పడేయవచ్చన్న ఆలోచనతో  కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
అటు సీయం క్రొత్తపార్టీ పెట్టబోతున్నారన్న పుకార్లూ ఊపందుకోవడం కాంగ్రెస్ ను కలవర పెడుతున్నాయి. సీయంకు లొంగకుండా కనీసం జగన్ కు పేరురావాలని కాంగ్రెస్ ఆశిస్తుందని కొన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర స్థాయిలో జగన్ దీక్ష విరమించాలని , అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని ప్రకటించబోతున్నారని అనుకుంటున్నారు.
మరి ఈ ప్రకటన ఎలా చేస్తారో, దీని పర్యవసానాలు ఏమిటో వేచిచూడాలి!

Wednesday, August 28, 2013

ఇది కేవలం రూపాయి పతనమేనా?

నిజానికి ఇది రూపాయి విలువ తగ్గడం ఒక్కటే కాదు. మనం కొనే, దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలపెరుగుదల! మా చిన్నప్పుడు అర్ధణాకే అవి వచ్చేవి , ఇవి వచ్చేవి అంటూ మన తాతలు చెబుతుంటారు... ఈ రూపాయి విలువవల్లనే అది సాధ్యం. ప్రస్తుతం సామాన్య మానవుడు మరింత బక్కచిక్కే రోజులు ముందున్నాయి.. దిగువ పట్టీలో స్వాతంత్యం నాటినుంచీ నేటివరకూ డాలర్ తో రూపాయి విలువను చూడండి..
నేదు రూపాయి మరింత దిగజారి 68.75 ప్రాంతంలో ఉంది.. రూపాయికి పట్టిన ఈ గతి చూసి ఆర్ధికవేత్తలు బుర్రలు పట్టుకుంటున్నారు.. మరి ఆర్ధిక రంగంలో అనుభవజ్ఞులైన ప్రధాని, ఆర్ధికమంత్రి ఏమి చేస్తున్నారో తెలీడంలేదు...   

Tuesday, August 27, 2013

టిడిపీ ఎంపీలూ! చంద్రబాబుపై తిరుగుబాటు చేయండి లేదా మూసుకు కుర్చోండి!

ఒకవైపు చంద్రబాబు తెలంగాణాకు అనుకూలమేనని స్పష్టంగా చెపుతుంటే, తెలుగుదేశం లు మాత్రం డిల్లీ పార్లమెంటులో ఆందోళనల పేరుతో విలువైన సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఆందోళన చేయదలిస్తే ముందు ఎందుకో చెప్పండి..సమక్యం కోసం అయితే ముందు మీ నాయకుడు చంద్రబాబు ఇంటిముందో, టిడిపి ఆఫీసు ముందో చేసుకోండి కానీ ఇలా దేశప్రజల సం అస్యలతో ఆడుకోవద్దు. ఇదే సామాన్య ప్రజలు ప్రస్తుతం అనుకుంటున్న మాటలు.  

‘సభ’లో టీడీపీ వ్యూహం ఏంటీ?

chandra-babu

ఓ వైపు రాష్ట్ర విభజన ప్రకటన.. మరోవైపు రగులుతున్న సీమాంధ్ర.. ఈ సిచ్యుయేషన్లో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చని టిడిపి అధిష్టానానికి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల రూపంలో మరో చిక్కు వచ్చి పడింది.. తెలంగాణా బిల్ వస్తే..అ నుసరించాల్సిన వైఖరి ఏంటనే ప్రశ్న తలెత్తడంతో.. పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయ్.
రాష్ట్ర విభజన ప్రకటనతో మూడురోజులు మౌనాన్ని ఆశ్రయించినా..సీమాంధ్రలో ప్రత్యర్ధి పార్టీనేతల రాజీనామాలతో టిడిపివారూ అదే బాట పట్టాల్సి వచ్చింది. సీమాంధ్ర హక్కులు, అవసరాలు గమనించకుండా ఏక పక్ష విభజన చేశారంటూ ఆందోళన బాట పట్టారు సీమాంధ్ర టిడిపి నేతలు. సమైక్య ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఐతే ఇదే సమయంలో తెలంగాణా టిడిపి నేతలు కూడా కేంద్రం ప్రత్యేకరాష్ట్రం ప్రకటించడంపై స్పందించారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటవడంతో.. తెలంగాణా బిల్ ఈ సెషన్స్ లోనే ప్రవేశపెట్టాలంటూ టిడిపి పార్లమెంటరీ బోర్డ్ నేత నామా నాగేశ్వర్రావ్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ వైఖరే టిడిపికి కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పాలి. ఇప్పటికే సీమాంధ్ర టిడిపి ఎంపీలు రాజీనామాలు చేయడంతో.. సభలో అనుసరించే వ్యూహంపై ఆందోళన, ఆసక్తి నెలకొన్నాయి. సభలో ఫ్లోర్ లీడర్ తెలంగాణా కోసం డిమాండ్ చేయడం.. సహచర ఎంపీలు సమైక్యనాదం అందుకోవడం పార్టీని చిక్కుల్లోకి నెడుతోంది.. ఓవైపు కేంద్ర హోంమంత్రి షిండే ఈ సమావేశాల్లో తెలంగాణా బిల్ ఉండదని చెప్తున్నా.. ఒకవేళ వస్తే ఎలా వ్యవహరించాలనేది పార్టీ అధిష్టానానికి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తోంది. తెలంగాణా బిల్ కోసం డిమాండ్ చేసినా.. సీమాంధ్ర హక్కులు.. రాజధానికి భారీ నిధులు కేటాయించాలని కోరవచ్చనేది మధ్యేమార్గంగా టిడిపి ఎంచుకోవచ్చని తెలుస్తోంది
అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ మైలేజీ కోసమే రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని టిడిపి సభలో ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.. ఇరు ప్రాంతాల్లో లాభపడేందుకు కాంగ్రెస్ ఉద్యమాలను రెచ్చగొడుతుందని జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయించినట్లు తెలుస్తోంది

Tuesday, August 6, 2013

మెగా హీరోల సినిమాలను ఆపితే సహించేదిలేదు: చిరు యూత్

మెగా హీరోల సినిమాలను ఆపితే చూస్తూ ఊరుకోమని చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామినాయుడు తీవ్రంగా  హెచ్చరించారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యమకారుల పేరిట కొందరు తమ హీరోల కటౌట్లు తగలబెడుతున్నారనీ, దీనిని చూస్తూ ఊరుకోమనీ స్వామినాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇలా స్వామినాయుడు ప్రకటించడం వెనుక మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ హస్తం ఉందని కొందరు అంటున్నారు. మరి, దీని పట్ల సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
కాగా విభజనకు చిరంజీవి అనుకూలమేనని ఆయన నిన్నటి ప్రకటన ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని అలాకని పక్షంలో ఢిల్లీ తరహాలోగానీ ఉంచాలని  చిరంజీవి నిన్న డిల్లీలో పేర్కొన్నారు.  

ధ్యాన నియమాలు


ప్రతిరోజు ౩౦-౪౦ నిమిషముల నేపు ధ్యానం చెయండి. వీలైనంతవరకు రోజుకు రెండి సార్లు ధ్యానం చెయండి. (ప్రోద్దున, సాయంత్రం)
మీ రోజువారి కార్యక్రమములలో ధ్యానం ఒక భాగంగా చేసుకోండి. మీకువీలైనే సమయములలో ధ్యానం చేసుకోండి. ఉదయం నెద్రలేచగానే కండ్లు రుద్దుకోని, పడక మీదగాని, కుర్చిలోగాని కూర్చోని ధ్యానం మొట్టమొదటి పనిగా పూర్తి చేయండి. ఎందువలనంటే ఒకసారి మీరు దైనందిక పనులలో పడితే ధ్యానం చేయటకు సమయము దొరకదు. ప్రతిసారి వాయిదా వేసుకొనుట అలవాటవుతుంది. అంతేకాకుండా ధ్యానం ఒక మానసిక క్రియ అయినందువల్ల మరియు ఆత్మలో పరమాత్మ చింతన చేయుటవల్ల దేనికి మడి, మైల అనే తతంగములు వర్తించవు. ఆది అంతా కేవలం శరీరమునకు మాత్రమే.
తూర్చు, ఉత్తర దిశలకు అభిముఖముగా కూర్చుని ధ్యానం చేయండి.
ప్రత్యకమైన ఆహార నియమములు ఏమిలేవు. ఆహారము తీసుకోనకుండా కాని, తేలికపాటి ఆహారము తీసుకున్నప్పతికి కాని, ధ్యానమునకు ఆవరోధము కాదు.
ధ్యానంలో దేనినైనా ఊహించడంగాని, అశించడంగాని, దేనిగురించి గాని ముందుగా అనుకోవడం గాని మొదలైనవి చేయకండి. ధ్యానం కేవల ధ్యానం కోసం మాత్రమే, రావలసిన ప్రయోజనాలు వాటికవే వస్తాయి.
ఓర్పు, పట్టుదల కలిగి ఉండండి. ఫలితములు రాత్రికి రాత్రే రావికదా! ధ్యానం మీ అంతర్ మనస్సులో పేరుకుపొయిన కర్మల ప్రతి అణువును శుద్ధి వస్తుంది. మరియు మెల్లమెల్లగా భొతిక, మానసిక, ఆధ్యాత్మిక సత్ పరిణామము వైపునకు దారితీస్తుంది.
ధ్యానమును ఎప్పుడూ విడువవద్దు. ఏ కారణము చేతనైన మీరు విడిచినట్లయిత్ మిమ్మల్ని మీరు అభివృద్ది చెసుకునే మంచి అవకాశాన్ని కోల్పోతారు. ధ్యానము కేవలం మానసిక ప్రక్రియ. మీసౌకర్యాన్ని అనుసరించి ఎప్పుడైనా, ఎక్కడెనా చేయవచ్చు.
ధ్యానం ప్రతిరోజు ఒకవిధంగా ఉండుదు. అది ఆరోజున మీ యొక్క శారీరిక మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కావున ప్రతిరోజు ఒక ర్కమైన ధ్యానస్థితిని ఆశించకండి.
మీరు గనుక దీర్ఘ ప్రాణాయమాన్ని 3 నుంవి 5 నెమిషమ్లసేపు ధ్యానం ముందర చేసినట్లయిత్ ధ్యాన ఫలితము చక్కగా ఉంటుంది. ధ్యానము పూర్తి చేసిన తరువాత నెలపై వెల్లకిలా పడుకొని విశ్రాంతిగా శరీరమును, మనస్సును పది నిమిషముల సేపు ఉంచినట్లయిత్ (శవాసనం) ధ్యానములో కరిగిపోయిన కర్మలు అన్ని బయటకు పోయి మీరు హాయిగా ఉంటారు.
మీకు ధ్యాన సమయములో బయటకు వెళ్ళె కర్మల వల్ల తీవ్ర ఆలోచనలు గాని, ఆందోళనలు గాని ఎపుడైన ఏర్పడినట్లయిత్ మీరు విసుగుతో ధ్యానం నుంచి లేవవద్దు. అలాగే కనులు మూసుకొని దీర్ఘ ప్రాణాయామము చెసి తరువాత ధ్యానము చేయండి. అప్పు కూడా ధ్యానము చేయటకు వీలు కానట్లైత్ మౌన ధ్యానమును అవలభించండి. (యూనివర్సల్ మెడిటేషన్ - II)
ధ్యానములో కాని, ధ్యానము పూర్తి అయిన తరువాత కాని ఏవైనా ఆధ్యాత్మిక అనుభవములు కలిగినట్లైత్(ఉదా: దర్శనములు మెదలెనవి). ఆ విషయముల పట్ల తటస్థ వైఖరితో వుండి అవసమైనచో వాటిని సత్సంగములో మాత్రమే చర్చించవలెను. అందరి వ్యక్తుల వద్ద మనకు కలుగు అనుభవములను చర్చించరాదు. కాని ధ్యానము చేయటవలన మీరు పొందిన ప్రయోజనములు మాత్రము అందరికి తెలియ జేసినట్లైతే వారు కూడ ధ్యానము వైపు మళ్ళుటకు సహాయకారి అవుతుంది.
అంకితభావంతో ధ్యానం చేసేవారికి కొంతకాలం తరువాత ప్రారంభపురోజులలో అనుభవించిన మార్పులను ఇప్పుడు అనుభవించలేరు. కారణం ఏమంటే ధ్యానంలో మొదటి స్థితిపూర్తి అయిన తరువాత ధ్యాన ప్రభావము లోపలివైపునకు ప్రయాణింవి అనుభవాలు సూక్ష్మముగా ప్రోగవు తుంటాయి.
ధ్యానం మీ వ్యక్తిగత, సాంఘిక, ఆధ్యాత్మికంగా జీవితంలో అభివృద్ధిని కలుగజేస్తుంది.
ధ్యానం రోజువారి జీవితంలోని ఆందోళనలు, ఒత్తిడులను బయటకు పారద్రోలుటకు సహాయం జేస్తుంది.
ఎటువంటి ప్రతికూల వాతావరణంనైన ధైర్యంగా ఎదుర్కానగలిగే సమర్థతను ధ్యానం కలుగజెస్తుంది.
ఒక సంవత్సరం పాటు ధ్యాన సాధన చేసిన తరువాత మీరు ధ్యాన సమయమును ఒక గంట వరకు పోడిగించకొనవచ్చును.
క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. మీరు ఒప్పుకొన్న లేక అప్పగించబడిన కౌటుంబిక, సామాజిక, వ్యవహారిక బాధ్యతలను (కర్మ యోగము) నిష్ఠతో పూర్తి చేయండి. అప్పుడు మీరు పరిణామాత్మకమైన మార్గముమైపు ప్రయాణిస్తున్నారని స్థిరముగా చెప్పవచ్చును. మరియు కాలాంతర ములో సుఖశాంతులను, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలరు.
ధ్యానం మీకు, మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి శాంతిని కలుగజేస్తుంది. దానితో పాటు మీ ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్య మవుతుంది.
మీరు ధ్యానం చేస్తున్నందువల్ల ఎమైనా సత్ ఫలితములు పొందినట్లయిత్ దాపరికం లేకుండా, ఏమి ఆశించుకుండా ఇతరులకు అందించండి ఎందువల్ల అంటే జ్ఞానము అందరిది.


కృతజ్ఞతలు:  http://universal-meditation.com &http://drsuresh-telugumeditation.blogspot.in 

Sunday, August 4, 2013

తెలంగాణ వస్తే ఆంధ్రాకు,చెన్నైకు లాభం !


తెలంగాణా వస్తే హైదరాబాద్ అభివృద్ది క్షీణించే అవకాశం చాలా ఉంది. ఆంధ్రా ముఖ్యపట్టణంగా నెల్లూరో, లేక ఏదో ఒక తీర ప్రాంతం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.చెన్నై కూడా తీరప్రాంతం కావడం అదీ ఒకే రవాణా లైన్ లో ఉండడంతో చెన్నైతో ఇక్కడి ప్రాంత సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా విధ్యా,వైధ్య రంగం చెన్నైతోనే సంబంధాలు పీట్టుకోవచ్చు.
మరో ఆశక్తి కలిగించే అంశం - ఆంధ్రలో ఉన్న ప్రజలూ,నాయకులూ తెలంగాణా అభివృద్దికి ఆటంకంకలిగించాలనో,పోటీపడదామనో చెన్నై,బెంగళూరులపై దృష్టి పెడతారు. పైగా హైదరాబాద్ కన్నా పారిశ్రామికవేత్తలు రవాణా,వనరుల సౌలభ్యం దృస్ట్యా కోస్తా ప్రాంతం పైనే ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.
ఏమైనా అభివృద్దిలో ఆంధ్రాప్రాంతం మరో గుజరాత్ ని తలపించవచ్చు.