Tuesday, January 31, 2012

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టీమ్ చేతిలో వైట్‌వాష్ అయ్యింది. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే, ఆసిస్ గతంలో భారత జట్టును వైట్‌వాష్ చేసిన ఏడాదే నేను జన్మించాను. నా బర్త్ డే ఇప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం బాధే కదా! -రాహుల్ బోస్

ఇరాక్‌లో ఏ అమెరికన్ సైనికుడూ లేడు. బిన్‌లాడెన్ ప్రమాదం లేదు, గడాఫీ కూడా అంతమయ్యాడు. ఎన్నో ‘చాలెంజ్’లను అధిగమించిన తర్వాత మా విదేశాంగ విధానాన్ని ‘చేంజ్’ చేసుకొంటున్నాం.
-కండోలిజా రైస్

వదిలించుకోటానికి అత్యంత కష్టమైన వ్యసనం- ప్రేమ. అలా వది లించుకోవటం మరికొన్ని వ్యసనాలకు దారితీయటమే కాదు, కొన్ని హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవ్వచ్చు...
-మహేశ్ భట్

నిజంగానే మీకు మతంపై నమ్మ కం ఉంటే ఎవరినైనా క్షమించగలరు. ఉదారవాదులైతే ఎదుటి వారి విశ్వాసాలను గౌరవించగలరు. అయితే జైపూర్ సమ్మేళనం విషయంలో రెండూ జరగలేదు. ఇందులో అసమర్థ ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది.
-చేతన్ భగత్

పిల్లలను పక్కన పడుకోపెట్టుకోవడం భారతీయ రీతి పెంపకంలో సర్వసాధారణం. అమ్మానాన్నల స్పర్శలోనే చిన్నారికి ప్రేమ రుచి తెలుస్తుంది. ఒక అభివృద్ధి చెందిన దేశం దీన్ని తప్పుగా పేర్కొనటం దురదృష్టకరం.
-సుష్మా స్వరాజ్

జావేద్ నాలుగు సంవత్సరాల క్రితం ఈ అవార్డు పొందారు, ఇప్పు డు మేము మిస్టర్ అండ్ మిసెస్ ‘పద్మభూషణ్’లం. వెల్లువలా వస్తున్న శుభాకాంక్షలకు ధన్యవాదాలు...
-షబానా అజ్మీ

కలలు కనడం ఆగినప్పుడు మన జీవితం ఆగిపోతుంది, నమ్మకం నశించినప్పుడు ఆశలు అంతరిస్తా యి, సంరక్షణ తీసుకోవడం ఆపేసినప్పుడు ప్రేమ నశిస్తుంది, పంచుకోవడం ఆపినప్పుడు స్నేహం అంతమవుతుంది... క్యూట్ కదా... -షేన్ వార్న్

నేను నేతాజీ అని మాట్లాడింది ‘సుభాస్‌చంద్రబోస్’ గురించి... ఈ మధ్యనే తనకు తాను నేతాజీ అనే ట్యాగ్ తగిలించుకొన్న ములాయం సింగ్ యాదవ్ గురించి కాదు..
-ప్రీతిశ్ నంది

( From Sakshi)

Sunday, January 29, 2012

ఉత్తరప్రదేశ్‌లో ‘హంగ్’తప్పదా?

ఇసి ఆదేశాల దరిమిలా ఏనుగు బొమ్మలను గులాబీ రంగు షీట్లతో కప్పుతున్నారు. గులాబీ రంగును ఎంపిక చేసుకోవడానికి బహుశా అది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన రంగు కాకపోవడమే కారణ మని చెప్పవచ్చు. అంతేకాక మాయావతికి అత్యంత ఇష్టమైన రంగు కూడా. ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. కానీ విగ్రహాలను కప్పి ఉంచిన సన్నివేశం కార్టూనిస్టులు ఆనందంగా బొమ్మలు గీసుకోవడానికి అనువైనది. డెహ్రాడూన్‌కు చెందిన ఒకాయన రాజాజీ పార్క్ నుంచి ఓ ఏనుగుల గుంపు వస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించాడు? అప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ఆ ఏనుగులను గులాబీ రంగు బెడ్‌షీట్లు తీసుకుని తరుముతారా? మాయావతి విగ్రహాలను, ఏనుగు బొమ్మలను మూసి ఉంచడానికి రాష్ట్ర ఖజానా నుంచి కోటి రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చిందట. ఇప్పుడు బాగానే ఉంది కానీ మున్ముందు లెక్కల తనిఖీ జరిగినప్పుడు ఈ కోటి గురించి భారతీయ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆరా తీసే అవకాశం లేకపోలేదు.
భవిష్యత్ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను గురించి రోజురోజుకు, గంట గంటకూ జనం ఆసక్తి పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘విగ్రహాల వ్యవహారాన్ని’ గురించి మాయావతి ప్రస్తావించడమే కాక దాన్నుంచి గరిష్టస్థాయలో రాజకీయ ప్రయోజనాన్ని పొందడానికి చూస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ వ్యవహారం బహుజన సమాజ్‌కు మేలు చేస్తుందా? చేస్తే ఎంతవరకు చేస్తుంది? ఒకవేళ కీడే జరిగితే ఏస్థాయలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఒకవేళ మాయావతి ఎన్నికల్లో పరాజయం పాలైతే ఈ విగ్రహాల గతి ఏమవుతుందనేది సమాధానం లేని ప్రశే్న! సాధారణగా ఎన్నికల్లో పాలకపక్షం ఎదుర్కొనే ప్రజా వ్యతిరేకతనే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభుత్వం ఎదుర్కొం టున్నది. ఇది బిఎస్‌పిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య. ఈ కారణంగా బిఎస్పీ తీవ్రమైన వత్తిడికి గురవుతోంది. అవినీతి ఆరోపణలు వచ్చిందే తడవుగా మంత్రులను ఆఖరి నిముషంలో బర్తరఫ్ చేస్తూ పోవడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
మాయావతి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో నాల్గవ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొందరు మంత్రులతో సహా వందమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ టికెట్లు దొరకలేదు. బహుజన సమాజ్ పార్టీ జాబితాలో 88 మంది షెడ్యూలు కులాల అభ్యర్థులు, 113 మంది వెనుకబడిన తరగతులకు చెందినవారు, ముస్లింలతో సహా 85 మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు, 74 మంది బ్రాహ్మణులతో సహా 115 మంది అగ్రవర్ణాలవారు ఉన్నారు. అయితే మాయావతి ఇంకా ప్రచారం మొదలెట్టలేదు. ఇప్పటికే పక్కా ప్రణాళికతో తమ పార్టీ క్యాడర్‌ను ఉరుకులు పెట్టిస్తున్న మాయావతి సుడిగాలి పర్యటనలతో కూడిన ప్రచార కార్య్రకమాన్ని ఇప్పటికే రూపొందించారు. ఇక ఆమె రంగంలోకి దిగితే ప్రచారం మంచి రసపట్టులో పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పకడ్బందీగా వ్యవహరించే మాయావతి ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం బహుజనసమాజ్ పార్టీకి 110సీట్లు రాగలవని ఒక అంచనా! అయతే అధినేత్రి రంగంలోకి దిగి, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధానంగా మనం చెప్పుకోవలసింది ఇద్దరు యువకుల గురించి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్‌లు ప్రచారంలో ముందున్నారు. ఇద్దరు యువనాయకులూ ఎన్నికల క్షేత్రంలో తమ శక్తివంచన లేకుండా తలపడేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరు రాజకీయాల్లో ఆరితేరిన మాయావతిని ఎదుర్కొని విజయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రచారంలో రాహుల్‌గాంధీ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. గడచిన రెండు దశాబ్దాలలో పోయిన కాంగ్రెస్ ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఆయన వ్యవహారశైలిని చూసినవారిలో కొందరికి మున్ముందు రాహుల్ మరింత పెద్ద బాధ్యతలను ఎంతమేరకు చేపడతాడనే సందేహాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైపోయాయ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని 403 సీట్లలో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలకు కలపి 80-90 సీట్లు లభించే అవకాశముంది. మైనారిటీ ఓట్లకోసం కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య తీవ్రస్థాయలో పోరు జరుగుతోంది. మైనారిటీ ఓట్లను ఆకర్షించడంలో విజయం సాధించడంపై ఈ రెండు పార్టీల బలాలు పెరగడం లేదా తరగడం ఆధారపడివుం ది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ అందరికంటే ముందంజలో ఉన్నదని విశే్లషకుల అభిప్రాయం. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆచి తూచి అడుగు ముందుకేస్తారని ప్రతీతి. ఆయన తీసుకున్న జాగ్రత్తలే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ మంచి దూకుడుమీద ఉండటానికి కారణం. పార్టీ నుంచి అమర్‌సింగ్ వెళ్లిపోవడంతో రెండు అధికార కేంద్రాల వల్ల ఏర్పడిన అయోమయం తొలగిపోయింది. పార్టీపై ములాయంకు పూర్తి నియంత్రణ వచ్చింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడం, పార్టీలో క్రమశిక్షణను అమలుచేయడం, ప్రతి అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క ములాయం సింగ్ యాదవ్‌కు మాత్రమే ఉంది. పార్టీ నాయకులకు, ఓటర్లకు ఆయన మరింత చేరువయ్యారు. అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అఖిలేష్ కూడా పార్టీ దిగువశ్రేణి నాయకులకు చేరువయ్యారు. పలువురు నాయకులు అఖిలేష్‌ను సంప్రదించి పనులు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం సమాజ్‌వాది పార్టీకి 140 సీట్లు రాగలవని ఒక అంచనా. ఇదే ఒరవడి కొనసాగి ఓటర్ల నిర్ణయం మరింత బలపడితే అది సమాజ్‌వాది పార్టీకి అనుకూలంగా మారవచ్చు.
పై కారణాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే 403 సీట్లున్న సభలో అధికారానికి అవసరమైన 202 సీట్లు ఏ పార్టీకి కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. అప్పుడు కాంగ్రెస్, ఎప్పీ కలిస్తేనే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదు. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించవచ్చు. రెండు రాష్ట్రాలలో కూడా అవినీతే ప్రధాన అంశం. రెండుచోట్లా భారతీయ జనతా పార్టీయే దోషి. పంజాబ్ సభలోని 117 సీట్లలో అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 60-65 సీట్లు గెలవవచ్చు. అకాలీదళ్ తన బలాన్ని కాపాడుకుని 40-45 సీట్లను గెలిచే అవకాశాలున్నాయి. ఎక్కువగా నష్టపోయేది బిజెపియే. బిజెపి బలం 19 నుంచి నాలుగు సీట్లకు తగ్గవచ్చు. ఎక్కువలో ఎక్కువ ఆరు చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా అదే పరిస్థితి. ఎన్నికల క్షేత్రంలో బిజెపి తరపున అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్ రాజకీయ ప్రచారం చేస్తున్నారు. బిజెపి అధిష్ఠానం ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఉంటే ఒక్కమాట మీద నిలవడం లేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి దారి వారిదే. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి మచ్చపడి మాయావతి బర్తరఫ్ చేసిన మంత్రిని బిజెపిలో చేర్చుకున్నారు. ఆ తరువాత తిరస్కరించారు. ప్రతి స్థాయిలో ప్రతిభావంతులున్న జాతీయ పార్టీలో ఇంతటి ఉదాసీన పరిస్థితులు నెలకొనడం దారుణం.
రాజకీయ వర్గాలకు 2012 సంవత్సరం బాగానే మొదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలలో నిరసనలు, మూకుమ్మడి అరెస్టులకు వెళ్లాలని సంకల్పించిన అన్నా హజారే ప్రతిపాదనకు జనం నుంచి తగిన స్పందన రాలేదు. పౌర సమాజం కార్యకర్తలు ప్రజా తనిఖీకి అతీతం కాదనే విషయం స్పష్టమైంది. రెండవ ఇన్నింగ్స్‌లోని ప్రథమార్థంలో యుపిఎ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ప్రతిష్ట దెబ్బతిన్నది. నాయకులు, కార్యకర్తల్లో ఉదాసీనత నెలకొంది. అధిష్ఠానం వ్యాకులతకు లోనైంది. వచ్చే రెండేళ్లు 2012-14 మధ్య యుపిఎలో మునుపటి కన్నా సుస్థిరత నెలకొనవచ్చు. యుపిఎ నాయకుల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు వచ్చే మార్చి ఆరవ తేదీన వెల్లడవుతాయి. ప్రతి చోటా విజేతలు, పరాజితులు ఉంటారు. భవిష్యత్తులో బిజెపి దెబ్బతిని కాంగ్రెస్‌కు మేలు జరగవచ్చు. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీలు తమ తమ బలాలను నిలబెట్టుకుంటాయి. ఈ ఏడాది చివర్లో అన్నిటికన్నా కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి దేశంలో ఇప్పటికన్నా మెరుగైన రీతిలో శాంతియుత వాతావరణం నెలకొనవచ్చు.

-అరుణ్ నెహ్రూ(ఆంధ్రభూమి నుండి)

ప్రతిపక్ష నేతగానూ నాదే రికార్డు:చంద్రబాబు


ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్ష నేతగానూ నాదే రికార్డు అని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు సగర్వంగా ప్రకటించుకున్నారు. తన రికార్డును చేరుకోవాలంటే 20 ఏళ్లు పడుతుందని అన్నారు. టిడిపి సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు తన రికార్డును వివరించారు. చంద్రబాబు నాయుడు దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతకు ముందు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును బాబు బ్రేక్ చేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత దాదాపు ఎనిమిదేళ్ల నుంచి చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరో ఐదేళ్ల పాటు మాత్రమే ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. బాబు ఈ రికార్డును కూడా బద్దలు కొట్టి రెండవ సారి కూడా ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఎన్నికలు జరిగితే అప్పటికి ఆయన పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుని బాధ్యతలు నిర్వహించినట్టు అవుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఈ పాలనను చూస్తుంటే ఆవేశం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చి వౌనంగా ఉండాల్సి వస్తోందని తెలిపారు. టిడిపి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని, విదేశీ పెట్టుబడుల కోసం కాళ్లు అరిగేలా తిరిగానని అన్నారు. తాను సాధించిన అభివృద్ధిని వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని, రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టివేశారని విమర్శించారు. వ్యవసాయం లాభసాటి చేయడమే ఇప్పుడు తన ముందున్న ప్రధాన ధ్యేయమని తెలిపారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా సాంకేతిక నిపుణలు తమ ఆలోచనలు పంచుకోవాలని కోరారు. అందరి సలహాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 50శాతం యువత ఉందని, వారికి సరైన విద్యను అందిస్తే అద్భుతాలు చేస్తారని అన్నారు. తెలుగు వాణిజ్యవేత్తలు యూదుల వంటి వారని, అద్భుతంగా వ్యాపారాన్ని చేస్తారని అన్నారు. గుజరాతీలు సైతం మనతో పోటీకి రారని, వారు పైసా పైసా కూడబెడతారు కానీ మన వారు పెట్టుబడిని ఎన్నో రేట్లు పెంచుతారు అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి లేదని తనకు వ్యక్తిగతంగా ఆవేదన లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాననే ఆవేదన చెందుతున్నానని అన్నారు
(ఆంధ్రభూమి నుండి)

Friday, January 20, 2012

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా అన్నా, రాందేవ్ ప్రచారం

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురీదుతున్న బిజెపికి పౌరసమాజం నాయకుడు అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్ మద్దతు లభించింది. పటిష్టమైన లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్‌లోని బిజెపి ప్రభుత్వానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. ఆయనతోపాటు తానూ బిజెపికి అనుకూలంగా ప్రచారం చేస్తానని బాబా రాందేవ్ ప్రకటించారు. అవినీతి ఆరోపణలతో రమేష్ పోక్రియాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవటం బిజెపికి తలకు మించిన పనిగా మారింది. నిజాయితీ పరుడిగా పేరున్న బిసి ఖండూరిని మళ్లీ ముఖ్యమంత్రిగా నియమించినా బిజెపికి ప్రజల నుండి ఆశించిన మద్దతు లభించటం లేదు. అవినీతికితోడు పార్టీలో చోటుచేసుకున్న అసమ్మతి బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులు, సైనిక, మాజీ సైనిక కుటుంబాలకు చెందిన వారు బిజెపి పేరు చెబితేనే మండిపడుతున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో పార్టీ ఓడిపోవటానికి అప్పటి ముఖ్యమంత్రి ఖండూరి బాధ్యుడంటూ ఆయనను అవమానకర రీతిలో పదవినుంచి తప్పించారు. సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఖండూరి ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తి చేయకముందే తొలగించి ఆయన స్థానంలో రమేష్ పోక్రియాల్‌ను నియమించటాన్ని బ్రాహ్మణులు, సైనిక, మాజీ సైనిక కుటుంబాలు ఎంతమాత్రం హర్షించలేదు. బిజెపి అధినాయకత్వం ఇప్పుడు ఖండూరిని అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రిగా నియమించినా ఫలితం లేకపోయింది.
కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తరాఖండ్‌లో రెండు రోజులు పర్యటించి బిజెపి ప్రభుత్వం అవినీతిని ఎండగట్టారు. అవినీతితో కూడుకున్న బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. సోనియా ఆరోపణలను రాష్ట్ర బిజెపి సమర్థవంతంగా ఖండించలేకపోయింది. అందుకే బిజెపి అధినాయకత్వం తాజాగా పౌరసమాజం నాయకుడు అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్‌ను ఎన్నికల ప్రచార బరిలోకి దించుతోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోక్రియాల్ అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఖండూరి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే లోకాయుక్తను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించారు. హజారే తయారు చేసిన లోకపాల్ బిల్లును యథాతథంగా తీసుకుని రాష్ట్ర లోకాయుక్త చట్టాన్ని తయారు చేసి శాసనసభలో ఆమోదించారు. తమ బిల్లును చట్టం చేసిన ఖండూరి పట్ల అన్నా హజారేకు ఎంతో సానుభూతి ఏర్పడింది. జన లోకపాల్ బిల్లును ఆమోదించాలన్న తన డిమాండ్‌ను బుట్టదాఖల చేసిన కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న హజారే ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబా రాందేవ్ కూడా కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. రాంలీలా మైదానంలో రాందేవ్ చేపట్టిన నిరాహార దీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబా రాందేవ్ ఇప్పుడు అన్నా హజారేతో చేతులు కలిపి ఉత్తరాఖండ్‌లో బిజెపికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
( From Andhrabhoomi Daily )

ప్లానింగ్ ఉంటేనే చక్కని చదువులు

ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేనివారి సంగతి అలా ఉంచితే.. మధ్యతరగతి వారూ.. పేదవారూ ఎదిగిన పిల్లల భారం.. పెరిగిన చదువుల భారం భరించి తగిన విధంగా సర్దుబాటు చెయ్యాలంటే బ్రహ్మప్రళయంగా ఉంటుంది.
రేపటి భవిష్యత్తు అంతా తగిన విద్యార్హతలతోనే ముడిపడి ఉంది. మంచి క్వాలిఫికేషన్స్ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా ఈ పోటీ ప్రపంచం పిలిచి ఉద్యోగాలిచ్చే ప్రసక్తే లేదు.
పేరున్న కార్పొరేట్ కళాశాల్లో పిల్లల్ని చదివించాలంటే బస్తాలకొద్దీ డబ్బుకావాల్సిందే. పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి మంచి భవిష్యత్‌ను అందించాలని పేరెంట్సూ ఆరాటపడతారు. పిల్లల లక్ష్యం, పెద్దల కలలు ఏమైనా వాటికి ఆర్థిక భారం రాను రానూ పెరిగిపోతున్నది. ఐదేళ్ళ వయసున్న పిల్లలే ఉన్నారనుకోండి. వారికి పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి ఏ ఇంజనీరింగ్ దశకో వస్తారు.
సుమారుగా ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య ఖర్చు నాలుగు సంవత్సరాలకూ వెరసి ఏడెనిమిది లక్షలు అనుకుంటే సంవత్సరానికి పది శాతం చొప్పున మీ పిల్లలకి పద్దెనిమిదేళ్ళు వయసు వచ్చేసరికి అంటే మరో పదమూడేళ్ళకి 30 లక్షలపైమాటే కానీ తక్కువ ఏ మాత్రం ఉండదు.
ఒక మధ్యతరగతి పేరెంట్స్ ఇంత డబ్బును రెడీ చేసుకోవాలంటే దుర్లభం. ఆ సమయానికి అప్పుల కోసం ప్రయత్నించడం తప్పదు. అటు క్యాపిటలిజం ఇటు సోషలిజం మిళితమై ఉన్న ఈ దేశంలో అటు హైక్లాస్ వాళ్ళకు ఇటు లోక్లాసు వాళ్ళకూ ఉన్న సదుపాయాలు, సౌకర్యాలు మిడిల్ క్లాస్‌కు ఏ మాత్రం లేకపోవడం విచారించతగ్గ విషయం.
మరి ప్రతి ఏడూ పెరిగిపోతూన్న నిత్యావసరాల ధరలు.. ఇంకా అనేక ఖర్చులను తట్టుకుంటూ కార్పొరేట్ కాలేజీ చదువులు రాబోయే రోజుల్లో చెప్పించగల స్థోమత మధ్యతరగతి వాళ్ళకు ఉండటం చాలా కష్టం.
అందుకే పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పటినుంచే పొదుపు చర్యలు పాటించి భవిష్యత్‌లో వాళ్ళు చదువులకు అవసరమయ్యే విధంగా తగిన ప్లానింగ్ ఉండటం తప్పనిసరి.
ముందుగా తమ పిల్లల్ని ఏ చదువు చెప్పించాలనుకుంటున్నారో ఆ చదువుకు అయ్యే ఖర్చును అంచనా వేసుకోవాలి. అంచనా అనేది తప్పనిసరి. ఎందుకంటే మీరనుకునేదానికి చాలా ఎక్కువ రెట్లు డబ్బు అవసరం అయిందనుకోండి. అపుడు పూర్తిగా డిజప్పాయింట్ కావలసిందే.
అందుకే నెలవారీ ఖర్చులు పోను మిగిలిన డబ్బును అంచనాల ప్రకారం దేనిలో పెట్టుబడులు పెడితే అవసరానికి సరిపోయినంత డబ్బు సమకూరుతుందో... అందులో పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మీరు పెట్టుబడి పెడుతున్న డబ్బుకు తగిన గ్యారంటీ ఉండే దానిలోనే పెట్టాలి.
పిల్లల తాలూకు సేవింగ్స్ ఎకౌంట్స్‌లో ఎలాంటి రాజీ పడకుండా ప్రతినెలా కొంత డబ్బు జమ చేస్తుండాలి. రిస్క్ లేని ఆస్తుల కొనుగోళ్లయితే భద్రతతోపాటు చాలా రెట్లు విలువ పెరిగే అవకాశాలుంటాయి. అంటే ఇపుడు మన దగ్గరున్న ఓ ఐదు లక్షలతో ఏదైనా కొద్దిగా స్థలం కొని సుమారు పది సంవత్సరాల తర్వాత అమ్మితే 15 నుంచి 30 లక్షల దాకా కూడా రావచ్చు. ఇది చాలా లోతుగా ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవలసిన నిర్ణయం
ఇక పోస్టల్ రికరింగ్ డిపాజిట్లు.. నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్స్ బ్యాంకులో డిపాజిట్స్.. మ్యూచువల్ ఫండ్స్ లాంటివి బంగారం.. వెండి లాంటివి ఉండనే ఉన్నాయి. ఇవన్నీ ఎంతో కొంత సంవత్సరం గడిచేకొద్దీ పెరిగేవి లాభాలు వచ్చేవే. అయితే ప్రైవేట్ స్కీమ్స్‌లో మాత్రం ఏ మాత్రం ఇనె్వస్ట్ చేయవద్దు. ఏ సంస్థ ఎపుడు బోర్డు తిప్పేస్తుందో కూడా తెలియని రోజులు.
పిల్లల కోసం కష్టపడి పైచదువులకోసం దాచుకునే డబ్బు తగినంత భద్రత.. పెరుగుదల చూసి ఇనె్వస్ట్ చేయడం తప్పనిసరి. లక్షలతోకానీ పూర్తికాని పిల్లల పైచదువుల గురించి ప్రతి తల్లిదండ్రులూ తప్పనిసరిగా మంచి ప్లానింగును కలిగి ఉండటం అనేది తప్పనిసరి.. లోన్లు.. అప్పులు.. ఆస్తులు అమ్మటాలు చాలావరకూ తగ్గించవచ్చు. అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివించవచ్చు

(-రమణ, From Andhrabhoomi)

Monday, January 16, 2012

Ek 3D Movie First look Wallpapers

రుద్రారపు శంకర్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న "ఏక్" 3D సినిమా వాల్ పేపర్స్ మొట్టమొదటి లుక్ చూడండి

ఎర్రజెండా ఎటుపోతోంది ?ఉనికిని కాపాడుకునే ప్ర యత్నంలో వామపక్షాలు తలమునకలవుతున్నాయి. గతం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ‘వామపక్షాలు కలిసి ఉద్యమిద్దాం’ అని అనేక పర్యాయాలు కోరినా తిప్పికొట్టిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ మధ్య ఉమ్మడి ఉద్యమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కాగా ఆరేళ్లుగా సీపీఐ, సీపీఎంలు గతంలో మాదిరి ఉద్యమాలను నిర్మించలేక పో తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి చేసిన విద్యుత్‌ ఉద్యమం చంద్రబాబు అధికార పీఠాన్ని కుదిపేశాయి. అదేవిధంగా తరువాత చేపట్టిన ముదిగొండ, గంగవరం ఉద్యమాలు కూడా అధికార పక్షాన్ని ముచ్చెమటలు పట్టించాయి. అ యితే వామపక్షాలలో ఇప్పుడా స్పీడు కనిపించడం లేదు. ఇందుకు ప్రజలు సహకరించడం లేదా? లేక వామపక్షాల లో ఉద్యమ స్ఫూర్తి కొరవడిందా? అనే అనుమానాలు సర్వ త్రా వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 2 నుండి ఖమ్మంలో జ రుగనున్న సీపీఎం రాష్ట్ర మహాసభలో ఇటువంటి అనేక అంశాలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. 1997 నుండి సుదీర్ఘ కాలంగా పార్టీ రాష్ర్ట కార్యదర్శిగా కొనసాగుతున్న బీవీ రాఘవులు వచ్చే నెలలో జరగనున్న మహాసభలకు కొనసాగుతారా? లేదా తేలనున్నది. రాఘ వులు సీపీఎం రాష్టక్రార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన నాటి నుం డి పార్టీని దూకుడు మీద నడిపించారు. నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా అనే క ఉద్యమాలకు నాయకత్వం వహించారు. గ్లోబలైజేషన్‌, లిబరలైజేషన్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టారు. అంతే కాకుండా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్‌సన్‌, అమెరికా అధ్యక్షుడు బిల్‌.క్లింటన్‌ తదితర ప్రపంచ ప్రఖ్యా తి గాంచిన నేతలు రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పటుచోట్ల వారిని ఘెరావ్‌ల తో నిరసనసెగలు తగిలేలా చేశారు. ఇక చంద్రబాబు నా యుడు వృత్తిదారులను ఆదుకుంటామంటూ ‘ఆదరణ’ ప థకం ద్వారా పరికరాలను అందించిన సందర్భంలోనూ వి నూత్న రీతిలో నిరసనలు తెలిపారు. పనికిరాని పనిము ట్లను చంద్రబాబు అందజేశారని జిల్లా స్థాయి లో ఎగ్జిబిష న్‌లు ఏర్పాటు చేసి బాబు బండారాన్ని బట్టబయలు చేశా రు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా బడుగు, బలీహ నవర్గాలకు చెందిన ముగ్గురు కార్యకర్తలను కూడా సీపీఎం కోల్పోయింది.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనకు వ్యతిరేకం గా ‘బాబు జమానా.. అవినీతి ఖజానా’ పుస్తకం వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని కూడా సీపీఎం వదిలి పెట్టలేదు. ఎన్నికలలో కాం గ్రెస్‌తో పొత్తుపెట్టుకుని 9మంది ఎమ్మెల్యేలను గెలిపించు కున్నప్పటికీ నాడు అవినీతిపై రాజీపడలేదు. ముదిగొండ, గంగవరం ఘటనలలో పోలీసులు జరిపిన పాశవిక కాల్పులలో సీపీఎం కార్యకర్తలు ప్రాణాల ర్పించారు. ఇప్పు డు అటువంటి పోరాటాలు మచ్చుకైనా కనిపించట్లేదు.

తోక పార్టీల ముద్ర చెరిగేనా?
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వ్యతిరే కంగా ప్రతిపక్ష పార్టీతో కలిసి వామపక్షాలు ఉద్యమిస్తాయ నే విమర్శ ఉంది. అంతేకాదు, మొక్కుబడి విన్యాసాలే తప్ప దీటైైన ఉద్యమాలు నిర్మించుకోపోవడం వామపక్ష పార్టీల్లో ప్రధాన లోపమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు తోపార్టీలు అంటూ ఇతర రాజకీయ పార్టీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోక పార్టీలన్న ముద్రను చెరిపేసుకునేందుకైనా సొంత ఉద్యమాలకు శ్రీకారం చుట్ట పోవడం వామపక్ష పార్టీల్లో ప్రధాన లోపంగా చెబుతు న్నారు. ప్రభుత్వ విధానాలపై నిస్పక్షపాతంగా రాజీలేని పోరాటాలు చేసిన సీపీఎం నేడు ఎందుకు చప్పబడింది?

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టి న నిరసన కార్యక్రమాలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, విద్యు త్‌ చార్జీల పెంపుపైనా నామమాత్రంగా సీపీఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నాలుగు రోడ్ల కూడళ్లలో ఎర్ర జెండాలు పట్టుకుని కార్యకర్తలతో ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టి నినాదాలతో సరిపుచ్చింది. గతంలో మాదిరి జన సమీకరణ చేయడంలో పూర్తిగా విఫలమైందంటు న్నారు. ఆనాటి మిలిటెంట్‌ పోరాటాలు నేడు ఎక్కడా కనిపించడం లేదనే చెప్పవచ్చు. గతంతో పోల్చుకుంటే పార్టీ అనుబంధంగా ఉన్న ప్రజా సంఘాల కార్యకర్తల సం ఖ్య కూడా తగ్గినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సీపీఎం, సీపీఐలు పాలు నీళ్లగా కలిసి పోతాయని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ‘ప్రజా సమస్య లపై ఐక్య ఉద్యమాలు చేస్తాం.. కలిసి వచ్చే లౌకిక ప్రజా తంత్ర శక్తులన్నింటితో కలిసి సమరశీల పోరాటాలు చే స్తాం.. ఉభయ వామపక్ష పార్టీలుగా ీసీపీఐ, సీపీఎం పార్టీ లు సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉద్యమాలను చేయడం ద్వా రా చివరకు ఈ రెండు పార్టీలు విలీనానికి దారితీసా ్తయి’ అని సీపీఐ అగ్రనేత ఎబీ. బర్ధన్‌ ఈ మధ్య పార్టీ జాతీయ సమితి సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ అంశంపై సీపీఐ, సీపీఎంలు చెరో దారి పట్టా యి. సీపీఐ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తూ.. టీఆర్‌ ఎస్‌కు కొమ్ముకాస్తోంది. ఇక సీపీఎం ఆది నుండి చెబుతు న్న విధంగానే సమైక్యాంధ్రకు కట్టుబడి నిలబడింది. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలు భిన్న ధృవాలుగా ఉంటే .. ఏ విధంగా కలిసి పనిచేస్తారనేది ప్రజల్లో సందేహాలు నెల కొంటున్నాయి.

పార్టీ పగ్గాలు మళ్లీ అగ్రవర్ణాలకేనా?
రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి లాంటి కీలక బాధ్యత లను వరుసగా మూడు పర్యాయాల కంటే ఎక్కువగా ఒకే వ్యక్తికి కట్టబెట్టకూడదన్నది సీపీఎం జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయంగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ సారి కూడా మళ్లీ బీవీ రాఘవులుకే సారథ్య బాధ్యతలు అ ప్పగిస్తామని ఖమ్మం జిల్లాలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానిం చినట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేత ఈ సారి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపడతారనే భావన ఉండేది. తమ్మినేని వీరభద్రం ప్రకటనతో దానికి తెరపడినట్లయింది. ఈ విధంగా పార్టీలో ఎంత కాలం ‘కమ్మ’దనాన్ని కొనసాగిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీలో ఒక్క సారైనా బడుగు నేతకు స్థానం కల్పించరా? అనే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.
Courtesy: Suyaa

Sunday, January 15, 2012

శబరిమలై మకరజ్యోతి దర్శనం లైవ్ వీడియో : స్పెషల్

ఇండియా విజన్ టీవీ ద్వారా చూడండి
Sankranthi SMS greatings- కొన్నిSMS గ్రీటింగులుకొన్ని గ్రీటింగులు

Flame Your Past in "BHOGI".
Invite New Hopes & Pleasures with "SANKRANTHI".
Enjoy "KANUMA" wth all tastes.
"HAPPY SANKRANTHI"

May This Sankranti bring flight in your life like a kite & bring happiness like this HAPPY SANKRANTHI.
HAPPY PONGAL 2 U & UR FAMILY MEMBERS

^\|/^ ,;:;, ^\|/^
// ,~~, \\
// (----) \\
'"""
I Wish U & Ur Family "Happy Sankranthi"


Wishing you n your family a very Happy
Pongal.May the almighty bless you all with the
best of health, wealth n prosperity.


With the Spring knocking on the Door
Let's celebrate
Makar Sakranti
Magh Bihu
Lohri
Pongal
Let Spring fill our life with all it's colours!!!

Wish this Sankranthi brings in good luck, joy, love and prosperity. May all your wishes be fulfilled on this special day happy pongal.

WORD OF GOD-Weeping may remain for a night,but rejoicing comes in the morning.Psalms30:5-WISH U,UR FAMILY HAPPY PONGAL

++WISH++
++YOU++
++HAPPY++
++PONGAL++
my Best Wishes To all ...

Saturday, January 14, 2012

21 సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్, ఫేస్ బుక్ సహా మొత్తం 21 సామాజిక నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమయింది. దేశంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించడం, దేశ సమగ్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలకు పాల్పడినందుకు యాహూ, మైక్రోసాఫ్ట్‌తో పాటుగా 21 సోషల్ నెట్‌వర్కింగ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది. అనుమతులు మంజూరు చేసే అథారిటీ తనముందుంచిన మొత్తం రికార్డులను, సమాచారాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం నిందితులపై ఐపిసి 153ఎ, 153 బి, 295 ఎ సెక్షన్ల కింద విచారణ జరపడానికి తగిన సాక్ష్యాధారాలున్నాయనే నిర్ధారణకు వచ్చినట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుదర్శన్ కుమార్ ముందు సమర్పించిన నివేదికలో కేంద్రం తెలిపింది. విదేశాల్లోని పది నెట్‌వర్కింగ్ కంపెనీలకు సమన్లు జారీ చేయడంపై తన వైఖరిని తెలియజేయాలని కోర్టు విదేశాంగ మంత్రిత్వ శాఖను కోర్టు ఆదేశించడంతో ఈ రెండు పేజిల నివేదికను కేంద్రం కోర్టుకు సమర్పించింది. గత డిసెంబర్ 23న కోర్టు 21 సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీలకు సమన్లు జారీ చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జిల్లా మేజిస్ట్రేట్‌నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాటిని అమలు చేయడానికి వీలు లేకపోవడంతో విదేశాలకు చెందిన పది కంపెనీలకు మాత్రం వాటిని సర్వ్ చేయలేదు.
కాగా, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నందుకు, దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నందుకు 21 సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన నివేదికలో కోర్టుకు తెలియజేసింది.

Wednesday, January 11, 2012

జీవితంలో పోటీ అవసరమే...కానీ

అన్ని విషయాల్లో అందరూ పోటీపడే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇందులో ఎన్నో భేదాలుంటాయి. ‘‘మా కోడలికి నాతో అన్నిట్లో పోటీయే...’’ అని వాపోతుంది ఓ అత్తగారు. ఇదెలా సాధ్యం? ఇద్దరూ ఆడవాళ్ళేనన్న సారూప్యం, ఇద్దరూ ఒకింటివారేనన్న సామీప్యం తప్ప... మిగతా అన్నిట్లోనూ వైరుధ్యమే కనిపిస్తుంది. వయసు రీత్యా అత్తగారికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అయితే, ప్రస్తుత ప్రపంచపు పోకడలు గుర్తించలేని ఆవిడకు కోడలి మాటలు, చేష్టలు అన్నీ విచిత్రంగానూ, విడ్డూరంగానూ కనిపిస్తాయ. ఏదో చిన్నమాటతో పోటీ ప్రారంభమవుతుంది.
జీవితంలో పోటీ అవసరమే. పోటీలేకుండా థ్రిల్ ఉండదు. పోటీవల్ల ఉత్సాహం పెరుగుతుంది. సమర్థత పెరుగుతుంది. అయితే ఇది వస్తువుల ఉత్పత్తి విషయంలో ఫర్వాలేదు కానీ మనుషుల మధ్య కొంత అగాధాన్ని సృష్టించవచ్చు. వ్యక్తుల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండటం లేదు. అత్తా కోడళ్ళ మధ్య పోటీ, భార్యాభర్తల మధ్య పోటీ, ఆడబిడ్డా వదినెల మధ్య పోటీ ఆఖరికి అక్కా చెల్లెళ్ళమధ్య కూడా పోటీ వాతావరణం ఉంటున్న పరిస్థితులు నేడు మనం చూస్తున్నాం.
పోటీ ఉండటంలో తప్పు లేదు.. కానీ పోటీపడే పరిస్థితుల్లో గెలుపనేది ఎవరో ఒకరికే దక్కుతుందన్న విషయాన్ని ముందుగా దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే కోపాలు, తాపాలు, అలగటాలు, ఆఖరికి ఒకరంటే ఒకరికి ఈర్ష్యాద్వేషాలు కలిగించే ప్రమాదకర అంశాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు.
ప్రతి ఓటమినీ స్పోర్టివ్‌గా తీసుకునే మనస్తత్వాలు తగ్గిపోతున్నాయి. పండక్కి తోడికోడలికన్నా ఖరీదైన చీర కొని కట్టుకోవాలని ఉంటుంది. తీరా చూస్తే తమ ఆర్థిక పరిస్థితి అందుకు అంగీకరించదు. తోడికోడలే ఖరీదైన చీరలో మెరిసిపోతూ దర్శనమిచ్చేసరికి ఉక్రోషం, బాధ, అసూయ, ఓర్చుకోలేనితనం కక్షగా మారిపోతుంది. ఎప్పటికేది ప్రస్తుతమో ఆ పరిస్థితులనుబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవారికి తిరుగేలేదు. ఉన్నంతలోనే సంతృప్తి పడి తాము ఎవరికీ పోటీ కాదు. తాము ఎవరితోనూ పోటీపడం... అనుకునేవారు జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ పడరు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం, ఉద్యోగ విజయాలు ఇవన్నీ ఎంతో కొంత పోటీ పడి పాల్గొనవలసిన అంశాలే. ఎపుడూ విజయాలే వరించవు. ఓటములు కూడా విశ్వవిజేతలైనవారి జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. అయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలగడంలోనే ఉంది వారి సక్సెస్ రహస్యం.
కథల పోటీకి ఇద్దరు రచయిత్రులు పోటీపడి కథలు రాసి పంపారు. ఒకామె కథ పెద్ద బహుమతి గెల్చుకుంది. మరొకావిడ కథ సాధారణ ప్రచురణకు ఎన్నికయింది. ఇద్దరూ స్నేహితురాళ్లు కావడంతో వారిలో వారు అంతర్గతంగా పోటీపడ్డారు. ఎవరికి వాళ్లు తెలిసినవాళ్ళు కాకపోయి వుంటే పోటీ మామూలుగా ఉండేది. బహుమతి పొందిన రచయిత్రిపైన సాధారణ ప్రచురణకు ఎన్నికైన కధారచయిత్రి అగ్గిబుగ్గయిపోయింది. కథల ఫలితాల్లో ‘మ్యాచ్ ఫిక్సింగులు’ జరిగాయని వాపోయింది. తన కథే అత్యుత్తమయినదని మరీ బాధపడింది. ఇలా బాధపడటం లాంటి లక్షణాలు అసూయవల్లనే జరుగుతాయి. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని తన కథను విశే్లషించుకుని ఆ రచయిత్రి కథను పరిశీలించాలి. చాలావరకూ కథల ఫలితాలు సంపాదకులు నిర్ణయించిన న్యాయనిర్ణేతల ఎంపికపై ఆధారపడి ఉంటాయన్న సూక్ష్మాన్ని మరువకూడదు.
పోటీ పడడం వరకే మనకున్న అర్హత... ఫలితాలు మన చేతుల్లో ఉండవు. గెలుపు అయనా, ఓటమి అయినా ఒకేలా స్వీకరించగలిగే మనస్తత్వాన్ని అలవరచుకుంటేనే పోటీపడడం మంచిది. అలా కాకుండా ఆశించింది అందుకోలేకపోయామని ఎదుటివారిపైన నిందలు వేయడం మంచి లక్షణం కాదు. అందుకే పోటీపడండి.. కానీ.. ఎలాంటి ఫలితాలకైనా సంసిద్ధులు కండి.
(-హిమజా రమణ, In Andhrabhoomi )

Tuesday, January 10, 2012

ఉసిరి ఉపయోగాలెన్నో?

అన్ని కాలాల్లోనూ ఉసిరికాయలు లభించవు. ఉగాది
వెళ్లిపోయిన తర్వాతనే వేసవి వచ్చే ముందు ఉసిరికాయలు
విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని
అమృతతుల్యమైనదిగా భావిస్తారు. దీనిని విశిష్టమైన జీవ
రసాయనాల గుణ సమ్మేళనంగా చెప్పుకోవచ్చు.
ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పేరొందిన చరకుడు ఉసిరి
రసాయన సేవనంతో వంద సంవత్సరాలపాటు ఎలాంటి బాధా
లేకుండా జీవించవచ్చని పేర్కొన్నాడు.
వ్యాధి నిరోధకశక్తిని ఎక్కువగా పెంచే సహజ ఫలం ఉసిరి. దీనిలో
విటమిన్-సి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఆకలి లేకపోవడం,
కడుపులో మంట, మలబద్ధకం, కడుపునొప్పి, పైల్స్, నోట్లోంచి
రక్తం రావడం, స్ర్తిలలో అధిక రక్తస్రావం, పంటి చిగుళ్ళనుండి రక్తం
రావడం, రక్తహీనత, దగ్గు, ఆస్త్మా, ఎముకలు బలహీనపడటం,
చూపు తగ్గడం, నరాల బలహీనత, మానసిక బలహీనతల వంటి
లోపాలను ఉసిరితో నివారించవచ్చు.
సబత్తాయికన్నా ఎక్కువ రెట్లు విటమిన్ సి ఉసిరిలో అధికం.
మన శరీరంలో ఉన్న ఎముకలు, లివర్, పళ్ళు, గుండె వీటికి
ఉసిరి మంచిది. మనం తినే ఆహారం జీర్ణమై బాగా
వంటబట్టడానికి ఉసిరి చాలా అవసరం. ఇప్పటికీ పాత
అలవాట్లున్నవారు భోజనంలో మొదటి ముద్దగా ఉసిరి పచ్చడి
కలుపుకొని భుజిస్తుంటారు.
సకప్పు ఉసిరికాయ రసంలో పది చుక్కలు తేనెకలిపి ఉదయం,
సాయంత్రం పిల్లలకు ఇస్తే వారిలో ఆకలి పెరుగుతుంది,
మలబద్ధకం వదిలిపోతుంది. కంటిచూపు మందగించినవారు
కంటిచూపుచక్కగా ఉండటానికి ఉసిరి వాడటం చాలా మంచిది.
సఉసిరి అద్భుతమైన కేశ సౌందర్య సాధనం. జుట్టు
యుక్తవయసులోనే తెల్లబడటం నివారిస్తుంది. అంతేకాకుండా
జుట్టు కుదుళ్లను గట్టిపరిచి జుట్టు వత్తుగా పెరగటానికి
దోహదపడుతుంది. ఉసిరి ముక్కలు వేసి కాచి వడపోసిన
కొబ్బరినూనె శిరోజాల సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.
సషుగర్ నియంత్రణలో కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఏదో
ఒక రూపంలో ఉసిరిని కలిపి తీసుకోవడంవలన మానసికమైన
ఒత్తిడులు తగ్గిపోయి నిద్రలేమి ఉన్నవారు చక్కగా
నిద్రపోగలుగుతారు. ఎన్నో ఉపయోగాలున్న ఉసిరి వాడటాన్ని
తప్పనిసరి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

( Courtesy: Andhrabhoomi )

Body Guard Telugu Movie Review,Story,Talk

Banner : Sai Ganesh Productions
Music : Thaman S
Cinematography : Arthur Wilson
Producer : Bellamkonda Suresh
Director : Gopichand Malineni
Starcast: Venkatesh, Trisha, Saloni Prakash Raj, Brahmanandam, Ali, Venu Madhav,Chandra Mohan, Tanikella Bharani, Subba Raju ect…


Victory Venkatesh’s upcoming entertainer ‘Bodyguard’ has received a clean U from the censor board. The movie is all set to hit the screens on January 14th for Sankranthi.
Gopichand Malineni is the director of this film and Bellamkonda Suresh is the producer. Thaman has scored the music for this film. Trisha is the heroine opposite Venkatesh. The film is a remake of the Malayalam hit with the same name.

ఆర్టీసీలో ఉద్యోగాల నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

http://upload.wikimedia.org/wikipedia/en/5/5b/Sidefr1.gifరాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఆర్టీసీలో 3,689 ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వం అనుమతించింది. 968 డ్రైవర్లు, 1,866 కండక్టర్లు, 95 టైపిస్టులు, 331 మెకానిక్స్‌, 335 చేతి వృత్తుల వారు, 29 కానిస్టేబుల్స్‌, 14 మంది పారామెడికల్‌ సిబ్బంది, 48 మంది ట్రాఫిక్‌ సూపర్‌వైజర్ల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రాహుల్ ఎన్నటికీ ప్రధాని కాలేడు:శివసేన చీఫ్ బాల్‌ఠాక్రే

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీపై.. శివసేనాధిపేతి బాల్‌ఠాక్రే మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు రాహుల్‌కు లేవని, అది ఎప్పటికీ జరగదని పార్టీ పత్రిక ‘సామ్నా’ ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. పై విధంగా స్పందించారు. కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ, గోవింద్‌వల్లభ్ పంత్ వంటి మహామహుల శకం ముగిసిందని, ప్రస్తుత నేతల్లో అసలు నాయకత్వ లక్షణాలే లేవని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 4.5 శాతం ఉప కోటా ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయంపై ఠాక్రే మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేలే పూర్తి బాధ్యుడని విమర్శించారు.

Monday, January 9, 2012

పిల్లల ఆరోగ్యం ముఖ్యంఒంట్లో నలతగా ఉందంటే అడుగు ముందుకెయ్యటానికి ఆలోచిస్తారు. ఆ పూటకి చెయ్యాల్సిన పనులను వాయిదా వేస్తారు. పెద్దల తీరే ఇలావుంటే ఇక పిల్లల విషయం? హోమ్‌వర్క్ చెయ్యలేదంటే స్టిక్ దెబ్బలు తప్పవంటుంది స్కూల్ టీచర్. పోనీ వర్క్ చేద్దామంటే కడుపునొప్పో, తల నొప్పో అసహనాన్ని తెప్పిస్తుంటుంది. బలవంతాన కళ్లు, కలం కదిలినా ఎక్కడో ఒక చోట పొరపాటు,్ల తప్పిదాలు. పిల్లల్ని ఇటువంటి సంకట స్థితినుంచి బయటపడేయాలంటే పెద్దలే చొరవ తీసుకోవాలి. అనారోగ్య హేతువులైన ఫుడ్ విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా చెరుపు చేసే పదార్థాలే ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి కనుక మంచి, చెడుల వ్యత్యాసం గుర్తించేలా ఇంటి దగ్గరే పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. స్నాక్స్ ఇష్టపడే పిల్లలకి వాటితోపాటు ఆరోగ్యకరమైన ఐటెమ్ మరొకటి జత అయ్యేలాచూడాలి. క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ విషయంలో అనర్థాలు తెలియజెప్పి మితం పాటించమని చెప్పాలి. మార్కెట్ కెళ్లినపుడు పిల్లలు కావాలన్నవి వెంటనే కొనేయకుండా ఆరోగ్యకరమైన పదార్థాలవైపువారి దృష్టి మళ్లేలా చెయ్యాలి.
‘ఏ ఫర్ యాపిల్, ‘బి’ ఫర్ బనానా.. అంటూ తాజాపండ్లు తినిపిస్తూ పాఠాల్ని గుర్తు చేస్తే పిల్లల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. అన్ని రకాల ఆహారాన్ని రుచి చూపుతూనే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందేలా వారిని ముందుకు నడిపించాలి. పిల్లల బరువుని, వయసుని బట్టి ఎన్ని కేలరీలు అవసరమో ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదించి అనారోగ్యాలకి చోటులేకుండా చూడాలి. పోషక విలువలు కలిగిన పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్స్, మినరల్స్ సరైన మోతాదులో అందితే ఆరోగ్యం చక్కబడి కొత్తవిషయాలు తెలుసుకోవడంలో, పాఠాలు ఔపోసన పట్టడంలో పిల్లలు శ్రద్ధ వహిస్తారు. జీడిపప్పు, బాదం, ఖర్జూరం, వాల్‌నట్స్ వంటివి అలవాటుచేస్తే ఇష్టంగా తింటారు. అధిక కేలరీలు వుండే చిప్స్ వంటివాటి జోలికి అంతగా వెళ్లరు.

Saturday, January 7, 2012

బాలీవుడ్‌ బంధాలు రక్తసంబంధాలు

కరిష్మా కపూర్‌, రీనా కపూర్‌
Kareena,-Karishma90 దశకంలో కరిష్మా తన కరిష్మాను కొససాగించా, నేడు కరినా తన చెరిష్మాను కొనసాగిస్తున్నారు. అనారి, జిగర్‌, రాజాబాబు, అందాస్‌ వంటి హిట్‌ చిత్రాలలో నటించి అనేక జాతీయ అవార్డులను అందుకుండి కరిష్మా. ‘రెఫ్యూజీ’ చిత్రంలో బాలీవుడ్‌లో ప్రవేశించి నేడు రూ. వందకోట్లు కలెక్ట చేసే హీరోయిన్‌గా అవతరించింది కరీనా. మార్లిన్‌ మాన్రో జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘హీరోయిన్‌’ వంటి చిత్రాలలో బిజీగా ఉంది కరీనా.

కాజోల్‌ - నిషా
kajol,-tanishaబాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ కథానాయికలతో ఒకరు కాజోల్‌. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్‌కుచ్‌హోతాహే, ప్యార్‌ కియాతో డర్నా క్యా, మైనేమ్‌ ఈజ్‌ ఖాన్‌ వంటి హిట్‌ చిత్రాలలో నటించారు. నిషా విషయానికి వస్తే బాలీవుడ్‌లో అన్‌ సక్సెస్‌ఫుల్‌ అయిన కథానాయికలలో నిషా ఒకరు. హిందీ చిత్రాలలో మంచి గుర్తింపు రాకపోవడంలో కాజోల్‌ చెల్లెలు నిషా తెలుగు చిత్రం ‘నీవల్లే నీవల్లే’ వంటి చిత్రాలలో కనిపించింది. ఒకరు హిట్టూ ఒకరు ఫట్టూ అనమాట.

శిల్పాశెట్టీ - షమితా శెట్టీ
shilpa,-shamita‘ధడ్‌కన్‌, బాజీగర్‌, రిష్తే, ఫిర్‌ మిలేంగే వంటి హిట్‌ చిత్రాలలో నటించి ఉత్తమ కథానాయికగా అవార్డు సాధించారు ‘శిల్పా శెట్టీ’. బిగ్‌ బాస్‌ రియాల్టీ కార్య క్రమంలో పాల్గొనటం, రిచర్డ్‌ గేర్‌ వ్యవహారం వంటి విషయాలతో అంతర్జాతీయంగా పాపులర్‌ అయ్యారు. యోగా సీడీలను కూడా రిలీజ్‌ చేసి సంచలనం కలిగించారు శిల్పా. రాజ్‌ కుంద్రాను వివాహం చేసు కున్న శిల్పా త్వరలోనే అమ్మతనంలోని అప్యాయతను రుచిచూడబోతోంది. ఇక షమితా విషయానికి వస్తే జహర్‌, క్యాష్‌, హేబేబి వంటి చిత్రాలలో నటించి మంచి కథానాయికగా గుర్తింపు సాధించారు.

అనా - ఇషా
esha,-ahanaహేమా మాలిని ముద్దులు కూతుళ్లది ఒకే దారి కానీ, గమ్యం మాత్రం వేరు. తల్లిదండ్రులు చిత్రసీమలో తారా స్థాయిలో ఉన్నా అనా డియోల్‌ మాత్రం కేవలం తన శాస్ర్తీయ నృత్యప్రదర్శనలకే పరిమితం అయ్యింది. ఇషా డియోల్‌ విషయానికి వస్తే ‘ధూమ్‌’, దస్‌ వంటి చిత్రాలలో నటించి మంచి కథానాయికగా గుర్తింపు సాధించింది. తల్లి హేమా మాలినితో కలిసి అనా, ఇషాలు తరచుగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను ఇస్తారు. ఇషా చిత్రాలకు, అనా ప్రకటనలకు పరిమితం అయ్యారు.
శృతి హాసన్‌ - అక్షర హాసన్‌
shruti,-aksharaకమల్‌ హాసన్‌ ముద్దులు కూతురు శృతి హసన్‌ అటు సింగర్‌గా, ఇటు కథానాయిగా బిజీగా ఉంది. సూర్యతో ‘సెవెన్త్‌ సెన్స్‌’లో నటి తొలి హిట్‌తో నటిగా మంచి గుర్తింపు సాధించింది. హిందీలో ‘లక్‌, దిల్‌ తో బచ్చా హేజీ వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో అనగనగా ఓ ధీరుడు, ఓ మైఫ్రెండ్‌ వంటి తెలుగు చిత్రాలలో నటించిన శృతి పవన్‌ కల్యాణ్‌తో గబ్బర్‌ సింగ్‌ చిత్రంలో నటిస్తోంది. అక్షర హాసన్‌ కూడా త్వరలోనే చిత్రసీమలో అడుగుపెట్టనుందని సమాచారం.

సైఫ్‌ అలీఖాన్‌ - సోహా అలీఖాన్‌
saif,-sohaబాలీవుడ్‌ చోటే నవాబ్‌ ‘సైఫ్‌ అలీ ఖాన్‌’ జీవితంలో కరీనా వచ్చాక, చిత్ర సీమలో సెకెండ్‌ ఇన్నింగ్‌ బాగా నడిచింది. ‘రేస్‌’, ‘ఆరక్షణ్‌’, ‘కుర్బాన్‌’ వంటి హిట్‌ చిత్రాలతో మంచి ఊపుడులో ఉన్నాడు. 2012లో కరీనాతో వివాహం జరగనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక సోహ అలి ఖాన్‌ విషయానికి వస్తే ‘రంగ్‌ దే బసంతి’ వంటి హిట్‌ చిత్రాలలో నటించిన సోహ తరువాత తన జాదూను కోనసాగించలేక పోయింది.ఇమ్రాన్‌ హష్మీతో ‘తుమ్‌మిలే’ చిత్రం తరవాత ఆ స్థాయి చిత్రాలలో కనిపించలేదు.సైఫ్‌-సోహాలు కొన్ని ప్రకటనలో కలిసి నటించారు.

సన్ని డియోల్‌- బాబీ డియోల్‌
sunny,-bobbyబేతాబ్‌,అర్జుమ్‌, త్రిదేవ్‌, ఘాయల్‌,డర్‌, జీత్‌, ఘాతక్‌, గదర్‌ వంటి హిట్‌ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సాధించిన నటుడు సన్నీ డియోల్‌. సన్నీ ‘ఏ ఢాయ్‌ కిలోకా హాత్‌ జబ్‌ ఉడ్తా హేనా, ఇన్సాన్‌ ఉటతా నహీ ఉట్‌జాతాహే’ ( నా చెయ్యి పడితే పడితే మనిషి లేవడు ..లేచి పోతాడు) డైలాగ్‌ చాలా పాపులర్‌ అయ్యింది. బాబీ డియోల్‌ ‘సోల్జర్‌, బిచ్చూ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీని సంపాదించాడు. బాబీ చిత్రం ‘ప్లేయర్స్‌’ నేడు విడుదల కానుంది.

సల్మాన్‌-అర్బాస్‌-సోహైల్‌
arbaaz_katrinaబాలీవుడ్‌లో సల్మాన్‌-అర్బాస్‌-సోహైల్‌ సోదరుల హవా కొనసాగుతోంది. ఈ ఖాన్‌ సోదరులలో ముందుగా చిత్రసీమలో ప్రవేశించింది కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. వీరి ముగ్గురిలో సల్మాన్‌ ఖాన్‌ పెద్దవాడు, తరువాత అర్బాస్‌ ఖాన్‌, అందరికన్నా చిన్న వాడు సోహైల్‌ ఖాన్‌. సల్మాన్‌ అర్బాస్‌లు కలిసి హలో బ్రదర్‌, ప్యార్‌ కియాతో డర్నాక్యా చిత్రాలు చేశారు. ఇటీవలే రూ.వంద కోట్ల కలెక్షన్‌ను కొల్లగొట్టిన సల్మాన్‌ చిత్రం ‘దబంగ్‌’ను అర్బాస్‌ ఖాన్‌నిర్మించాడు. త్వరలో ‘దబంగ్‌-2’ కూడా రాబోతుంది. మరి సల్మాన్‌-సోహైల్‌లు కలిసి ‘మైనే ప్యార్‌ క్యూకియా’ వంటి చిత్రాలలో కలిసి నటించారు.

మలైకా అరోరా - అమృతా అరోరా
riya,-raima‘దిల్సే’ చిత్రంలో ‘ఛయ్య ఛయ్య’ పాట నుంచి ‘దబంగ్‌’ చిత్రంలో ‘మున్నీ బద్నామ్‌’ వరకు పాపులర్‌ ఐటం సాంగ్‌లలో మంచి గుర్తింపు సాధించింది మలైకా అరోరా. బాలీవుడ్‌ కథానాయకుడు, నిర్మాత అర్బాస్‌ ఖాన్‌ను అమె 1998లో వివాహం చేసుకున్నారు. తెలుగులో ప్రిన్స్‌ మహేష్‌బాబు ‘అతిధి’లో ‘రాత్రైన నాకు ఓకే’ లో ఐటం సాంగ్‌లో ఇరగదీసింది. అమృతా విషయానికి వస్తే ‘స్పీడ్‌, అవారా పాగల్‌ దీవానే వంటి చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు సాధించింది. అయితే చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం లేవు.

రియా - సోనమ్‌
sonam,-rheaసావరియా చిత్రంతో బాలీవుడ్‌ వెండి తెరకు పరిచయమైన ‘మిస్టర్‌ లఖన్‌’ అనిల్‌ కపూర్‌ కూతురు ‘సోనమ్‌ కపూర్‌’ ‘ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌’ వంటి చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకుంది. సోనమ్‌ నటించిన ప్లేయర్స్‌ చిత్రం నేడు విడుదల కానుంది.ఇక సోనమ్‌ చెల్లెలు రియా విషయానికి వస్తే అమె న్యూయార్క్‌లో చదువుకుంది. సిని రంగానికి దూరంగా ఉంది.

Friday, January 6, 2012

ఆఫీసు మర్యాదలు ముఖ్యం

బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇతర పనులపై కానీ ఆఫీసు సమయాల్లో కలవడం మామూలే. అయితే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సమయంలో కలవాలనుకుంటే ముందుగా ఫోన్ చేయడం, అపాయింట్‌మెంట్ తీసుకోవడం లాంటి కనీస బాధ్యతలు నిర్వహించడం అవసరం. ఇలా చేయడంవలన పనులకు అవాంతరాలు ఏర్పడకుండా సకాలంలో సవ్యంగా జరుగుతాయి.
ఎవరినైనా కలవడానికి వాళ్ళ ఆఫీసుకు వెళ్ళడానికి ముందు ఫోన్ చేసి, వారు పనితో బిజీగా ఉన్నదీ, లేనిదీ తెలుసుకుని వెళ్ళడం మంచిది. లేదంటే అక్కడ వెయిట్ చేయడంవల్ల సమయం వృధా అవుతుంది.
కలవడానికి వస్తానని అపాయింట్‌మెంట్ తీసుకున్నపుడు వస్తానన్న టైముకు సరిగ్గా వెళ్లాలి. ఇచ్చిన టైమ్‌కు వారిని కలవకపోతే సదభిప్రాయం ఏర్పడదు.
ఇతరులను కలవడానికి వెళ్లినపుడు వారు విధి నిర్వహణలో ఉంటే వారి పనికి అంతరాయం కలిగించకుండా కొంచెం సమయం ఉండటానికి సిద్ధపడి వెళ్ళాలి. వేరే పనులు ఉన్నాయి, వేరే వ్యక్తులను కలవాలని మీరు తొందరపడి, ఎదుటివారిని తొందరపెట్టకూడదు.
పనిమీద వెళ్లినపుడు ఎంతవరకు అవసరమో, అంతవరకే మాట్లాడాలి. మీరు ఖాళీగానే ఉన్నారు కదా! అని ఎదుటివ్యక్తుల సమయాన్ని వృధా చేయకూడదు.
పనిమీద బయటకు వెళ్ళినపుడు బ్యాగులో ఎప్పుడూ పెన్ కానీ, పెన్సిల్ కానీ ఉండాలి. ఇతరుల ఆఫీసులకు, పోస్ట్ఫాసులకు, బ్యాంకులకు వెళ్ళేటప్పుడు పెన్ను తీసుకెళ్ళడం మర్చిపోకూడదు. నిత్యం పెన్, రఫ్‌పాడ్ దగ్గర ఉంచుకోవడం అవసరం.
ఏదైనా సమాచారం రాసుకున్నపుడు తప్పుగా రాసుకున్న పేర్లను చింపి కార్పెట్‌పై పడేయకూడదు. దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్‌లో వేస్తే మీ మీద సదభిప్రాయం ఏర్పడుతుంది.
పనిమీద వేరేవారిని కలవడానికి వెళ్ళినపుడు పాన్‌లు తినడం, సిగరెట్ కాల్చడం చేయకూడదు. కాఫీ, టీలాంటివి తాగినపుడు కప్పులను డస్ట్‌బిన్‌లో వేయండి. ఎక్కడ తాగితే అక్కడే వదలకూడదు.
( ఆంధ్రభూమి నుండి)

ఇంటి ఓనర్లకో నమస్కారం!

ఇంటివాళ్లతో నీళ్ళ తంటాలు తప్పవు. అద్దె ఇల్లు అనగానే ఎన్నో రకాల సమస్యలు. ముఖ్యంగా కరెంట్, నీటి దగ్గర ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ మధ్య ఇండివిడ్యువల్ హౌస్‌లకి ఎవరూ అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఎందువల్లనంటే ఆ ఇంటి ఓనర్ కుటుంబంలో వారికి విచిత్రస్వభావాలుంటాయి. కొందరు ఇంటి ఓనర్లు హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మనం కట్టే కర్టెన్స్ దగ్గరినుంచి అంతా వాళ్ళ ఇష్టమే. ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుని చూపిస్తే ఇంటి అద్దె పెంచేసేవారు. చీర కొనుక్కుంటే విచిత్రం, అంత సంపాదిస్తారు... ఇంత సంపాదిస్తారు.. అని అంటారు. వండుకుంటే ఏం వండుకుంటున్నారు? పచ్చడా? కూర, పులుసుతో సరిపెట్టుకుంటున్నారా? పప్పులో ఏం కూర వేసారని కొందరు అడుగుతూ ఉంటారు.
అద్దె ఇల్లు సుఖంగా ఉంటే చాలనుకునేవారు ఎక్కువ. కొందరు ఇంటి ఓనర్ల కుటుంబ సభ్యులు చటుక్కున పైకి వచ్చి డైనింగ్ టేబుల్‌మీద నుంచి ఏదైనా సర్దుకు వెళ్లిపోతారు. అలా వద్దంటే గొడవే! పండగలు, పబ్బాలు వస్తే ఇంటి ఆవిడకు పేరంటాలు మాదిరిగా చీర పెట్టాలి. పండగకి బంధువులతోపాటు భోజనం, చీర పెట్టాలి. నేను ఇక్కడ తింటాను. మరి అంకుల్‌కి ఎలా?-అని క్యారేజీలోనో, బాక్సులోనో ఓనరమ్మ సర్దుకువెళ్ళిపోతుంది. మళ్ళీ మన అవసరానికి ఏదైనా అడిగితే అంతే సంగతులు. ఏమిటో సరోజా ఇవ్వాళ కడుపునొప్పిగా వుంది. ఎవరైనా, ఏదైనా ఇస్తే బాగుండును-అనిపిస్తోంది అంటుంది.. ఇంటి ఓనరూ విజరుూభవ!
వాటర్ బిల్లు కడుతున్నా సరే నీళ్ళు ఇవ్వడానికి కొందరు నానాతిప్పలు పెడతారు. ఈ బాధలు పడలేకే నీళ్లు నింపడానికి కొన్ని చోట్ల డబ్బాలు కొనుక్కుంటున్నారు. అలాగే, అద్దె ఇళ్లలో ఎప్పటికప్పుడు ట్యాప్‌లు రిపేరుకు వస్తాయి. వాటిని రిపేర్ చేయిస్తే మూడు వందల చొప్పున ఖర్చు అయ్యింది. పది ట్యాప్‌లకి మూడు వేలు ఖర్చు అయింది. అయినా వాషర్ పోయింది, స్పిండిల్ పోయిందంటూ రకరకాలుగా ప్లంబర్స్ చేత డబ్బు ఖర్చుపెట్టించేవారు. కొన్నిచోట్ల వంటింట్లో సింక్ లేకపోవడమేమిటనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న ఎవరికైనా విసుగే. 5 అడుగుల పొడుగు 3 అడుగుల వెడల్పు వంటిల్లు .అందులో గ్యాస్ గట్టు లేదంటూ మనం వాపోవాల్సిందే.
కిటికీలు ఉంటాయి కానీ వాటికి సరైన తలుపులు ఉండవు. ఆ ఇంట్లోకి ఎవరు వస్తే వారు టెంపరరీగా ప్లాస్టిక్‌వి పెట్టుకుంటారు. అదొక గొప్ప పాలసీ అని చెప్పాలి. ఇంక కరెంటు విషయానికి వస్తే ఎక్కడికక్కడ వైర్లు వేలాడుతూ ఉంటాయి. టెంపరరీ ఫిట్టింగ్స్. ఏది ఏమైనా ఆ నలుగురూ తెలుసున్న వాళ్ళు ఉన్నారు, అందుకని ఇక్కడ ఉన్నామని చెప్పాలి. తుమ్మినా, దగ్గినా అయినవాళ్ళు వస్తూ ఉంటారు. చక్కగా వండిన వంటకాలు రుచి చూపించవచ్చును.
ఇక కారు విషయానికి వస్తే, ఇంటి ఓనరుకు బ్రిటీష్ కాలపు కారు ఉంటుంది. ఆ కారు ఎప్పుడూ బయటకి తియ్యరు. కేవలం స్టేటస్ సింబల్ మాత్రమే. మాకూ కారు ఉంది. నాల్గు స్కూటర్లు తాళాలు వేసి ఉంటాయి... ఇది రిచ్ సింబల్ మాత్రమే.
ఇంక ఇంట్లో ఎంతమంది ఉంటారు? వారి అలవాట్లు ఏమిటి? పిల్లలెంతమంది? పెద్దలెంత ఈ లెక్క ఇంటివాళ్ళకి, వంటవాళ్ళకి, పనివాళ్ళకి అందరికీ అవసరమే. ఇంటి కోడలు వస్తేనే ఇంటి అద్దె పెంచమనే ఇంటి వారు జీతం పెంచమనే వంట మనిషి, బట్టలు పెరిగాయి గనుక బిల్లు పెంచమనే చాకలి, పనిమనిషి వీరంతా కూడా కోడల్ని లెక్క కడతారు. ఏంటో ఈ విచిత్ర జీవితాలు. గతంలో పెళ్ళికి పట్టు చీర ఇచ్చి ఒకామె పీట పట్టుకు తిరిగిందట. ఆ విధంగా ఇల్లు అద్దెకిచ్చి ఉదయం, సాయంత్రం పైకి వచ్చి సతాయిస్తారు.
అంట్లు తోమేచోట జిగురు ఉంది. అంట్లు అలా పరిచేస్తావేమిటి? పళ్ళాల్లో మెతుకులు ఉన్నాయి. అవి డస్ట్‌బిన్‌లో పోసి తొలిచి పళ్ళాలు పెట్టాలి. సింక్ దగ్గర అద్దం ఉంటే నిద్ర లేచి బ్రష్ చేసి చేసిన వెంటనే ముఖం చూసుకోవటానికి ఉంటుంది. ఇలాంటివి మినిమమ్ ఫెసిలిటీస్ అని చెప్పాలి. అయినా అద్దె ఇళ్ళల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు, కనీస అవసరాలు ఉండవు. ఏదో నాలుగు గోడలు , కిటికీలు పెడతారు. వారి గుమ్మాలు అంతంత మాత్రమే. మేకు కొడితే కింద పడిపోతాయి అన్నట్లు ఉంటాయి.
ఏంటో అదే అపార్ట్‌మెంట్స్ అయితే అద్దెకి ఇచ్చేవాళ్ళు ఫర్నిష్డ్ చేసి ఇస్తారు. అమ్మా.. అద్దెకు ఉండేవారు ఎంతో హాయిగా ఉండాలి అంటారు. రెంట్ విషయంలో కూడా దేనికదే బిల్లు. ఏ విధమైన ఆంక్షలు ఉండవు. ఒక్కటే మాట ఏది అయినా రిపేర్ వస్తే వాళ్ళిచ్చిన అడ్వాన్స్‌తో ఆ పని చేయించి వెళ్ళమంటారు. అది వాళ్ళ పద్ధతి. అంతేగాని ఇల్లు అద్దెకి ఇచ్చాము కదా, ఇంటిలోకి రోజూ వచ్చి... అలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకున్నారు, మా ఇంటిని శుభ్రంగా ఉంచడంలేదు, బాత్‌రూమ్ సింక్‌ల దగ్గరనుంచి టైల్స్ వరకూ అన్నికూడా ఎంతో క్లీన్‌గా ఉంచాలంటారు. వాళ్ళ ప్రాణాలన్నీ ఆ ఇంటి వాటా మీదనే ఉంటాయి. అలా ఉంది, ఇలా ఉంది అని వంక లేని రోజు ఉండదు. నీళ్ళు వెయ్యాలన్నా ఇంటివాళ్ళు ఎంతో బాధపడిపోతారు. వాళ్ళ బంగారం ఏదో దోచుకుపోతున్నట్లు ఫీల్ అవుతారు. ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు. ఏడవకూడదు. అరవకూడదు. ఇది వారి రూల్సు. మనం ఏదైనా అంటే ఇంతే సంగతులు. అయితే కొందరు ఇంటిమీద డబ్బు పెడితే లక్షల ఖర్చు అనీ, అదే వడ్డీలకు తిప్పితే బంగారం లాంటి ఇల్లు అద్దెకు వస్తుందనే అభిప్రాయంతో కొంతమంది ఇల్లు అద్దెకు ఉండటానికి ఇష్టం చూపిస్తున్నారు. అందుకే అద్దె ఇల్లు ప్రహసనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో నష్టాలు కష్టాలు ఉంటాయి.
( ఆంధ్రభూమి నుండి)

Tuesday, January 3, 2012

నిజాలను ఒప్పుకోవాలి

నిత్య జీవనంలో ఎందరో వ్యక్తులు తారసపడుతూంటారు. వారిలో కొందరి మనస్తత్వాలు, ప్రవర్తనలు చాలా విచిత్రంగా, విలక్షణంగా ఉంటాయి. వారిలో మళ్ళీ కొందరు కొన్ని తప్పుడు పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చుకోవటానికి వారు మాట్లాడే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది.
లంచం తీసుకుంటే తప్ప పని చేయని అధికారి, మరొక వ్యక్తిని కించపరచి పరమ లంచగొండిగా చిత్రీకరిస్తూ మాట్లాడతాడు. వస్తువులను, సరుకులను నల్లబజారులో అమ్మే వ్యాపారి బ్లాక్ మార్కెట్‌ను విమర్శిస్తూ మాట్లాడతాడు. అతని గురించి తెలియనివారికి అతను చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. ఇలా తాము చేసే తప్పుడు పనులను కప్పిపుచ్చుకొని పైకి మరో విధంగా మాట్లాడే పద్ధతిని ‘ప్రొజెక్షన్’ అంటారు. చాలా సందర్భాలలో వారి మాటలు వింటూంటూనే అది ‘ప్రొజెక్షన్’ అని అర్థమవుతుంది.
అసలు ఈ ప్రొజెక్షన్ (ఆక్షేపణ) అనేది రకరకాలుగా వుంటుంది. కొందరికి వివాహమైనా సరే ఇతరుల పట్ల ఆకర్షితులై వారిని ఇష్టపడుతూంటారు. అలాంటివారే ఎదుటివారు అలాంటి పనిచేస్తే వారిని విమర్శిస్తూంటారు. వాళ్ళు నీచులనీ, వారితో స్నేహం చేయటం, మాట్లాడటం పాపమనే ధోరణిలో మాట్లాడతారు. తాము చేస్తున్న తప్పుని కప్పిపుచ్చుకోవటానికే వారు ఎదుటివారిపై బురద జల్లుతూ ..... వేస్తూంటారు.
గుండె జబ్బుతో బాధపడుతూ వున్న మనుషులు ధూమపానం ఎక్కువగా చేస్తుంటారు. దానివల్ల గుండె జబ్బు సమస్య మరింత జటిలంగా మారుతుంది. అతను సిగరెట్లు కాలుస్తున్నాడన్న విషయం, అతగాడి భార్య డాక్టర్‌కు చెబితే, ఆ డాక్టర్ తిరిగి ఆ వ్యక్తిని ‘మీరు సిగరెట్లు కాలుస్తున్నారట కదా! నిజమేనా’’ అని అడుగుతాడు. అప్పుడు అతను తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ‘‘ఎవరు చెప్పారు, అంతా అబద్ధం. నేను సిగరెట్టు అసలు ముట్టుకోలేదు’’ అంటూ నిజం ఒప్పుకోవటానికి నిరాకరిస్తాడు.
ఈవిధంగా నిజాన్ని ఒప్పుకోకపోవడమనేది మద్యపానం చేసే వారిలో, ధూమపానం చేసేవారిలో, మత్తుమందులకు బానిసలైనవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. తమ బలహీనతలను అబద్ధాలు ఎన్నయినా చెప్పి కప్పిపుచ్చుకోవటానికి వీరు ఒకటే తాపత్రయపడతారు. ఆఫీసులో ఓ కింది ఉద్యోగిపై, అతని పైఅధికారి ఏదో పని విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సదరు ఆ కింది ఉద్యోగి తన బాస్‌ను తిరిగి ఏమీ అనలేక నోరు మూసుకుని వూరుకుంటాడు. అంతటితో ఆగక తన కోపాన్ని ఇంటికి రాగానే భార్యా పిల్లలపై ప్రదర్శిస్తాడు. అకారణంగా తనపైన భర్త ఎందుకు కోపం చూస్తున్నాడో ఆ ఇల్లాలికి అర్థం కాదు. ఇలాంటి మనుషులను, వారి వైఖరిని మనం ఎన్నో కుటుంబాలలో చూస్తూంటాం.
తన పైఅధికారికి ఎదురుతిరగలేక, వారిని ఏమీ అనలేక తమలో తాము మానసిక ఆవేదన పడేవారు ఎందరో ఎదురుపడతారు. ఆ కోపాన్ని కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చుని తగ్గించుకుందామని చూడకుండా, అకారణంగా ఇంటి ఇల్లాలిపై చూపిస్తే, ఏ పాపం - తప్పు చేయని ఎరగని ఆమె పరిస్థితి ఏంటనేది ఒక్క క్షం కూడా ఆలోచించరు. అలా ఒక్క క్షణం ఆలోచించగలిగితే అలాంటి మగవారు తమ ప్రవర్తనకు తామే సిగ్గుపడి మరింకెన్నడూ అలాంటి పిచ్చి పని చేయకూడదనుకుంటారు.
ఒకవైపు తాము తప్పు చేస్తూ, తాము నిజాయితీపరులుగా, మంచివారుగా అనిపించుకోవటానికి తాపత్రయపడటం అనేది చాలా హాస్యాస్పదంగా వుంటుంది. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్న ధోరణిలో ఉండకూడదు. తప్పు చేయటం మానవసహజం. చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకోగలిగితేనే మీ ఔన్నత్యం బయటపడుతుంది. అప్పుడు ఎదుటివారి దృష్టిలో మీ విలువ గౌరవం ఇనుమడిస్తాయి.
ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక రూపంలో బాధలు, సమస్యలు వుంటాయి, వస్తాయి. ఎల్లప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చునే కంటే, వాటిని అధిగమించటం ఎలా అన్న దిశలో ఆలోచన సాగిస్తే సమస్యలు మబ్బుల్లా విడిపోతాయి. కానీ మనలో ఎంతమంది ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నిస్తే సమాధానం దాదాపుగా శూన్యమనే చెప్పాలి.
మనిషికి సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎదురైనపుడు ఆప్తులతో, బంధువులతో వాటిని చెప్పి, పంచుకోగలిగితే తప్పక పరిష్కారం దొరుకుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనిషి కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ప్రశాంతత అనేది మనకి మనం సృష్టించుకునేదే తప్ప అదేమీ ఎక్కడినుంచో రాదు. అందుకని మనిషి ఎప్పుడైనా ఒక పొరపాటు చేసినా, అబద్ధం చెప్పినా దాని పర్యవసానం ఏవిధంగా వుంటుందో అర్థంచేసుకుని ఆ తప్పును, నిజాన్ని నిజాయితీగా, నిర్భయంగా ఒప్పుకుంటే జీవితంలో ఏ సమస్య ఉండదు.
అందుకని నిజాలు ఒప్పుకుంటేనే ఏ మనిషికైనా జీవితం హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది.

(ఆంధ్రభూమి నుండి )