ఓబుళాపురం గనులు, జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ దృష్టంతా ఐఏఎస్‌లపైనా, ప్రైవేటు సంస్థలపైనా ఉండగా అందరి వేళ్లూ మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులవైపు చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన వారేకాకుండా అధికార పక్షానికి చెందిన వారూ వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన వారిని విచారించాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు బహిరంగంగా మంత్రులపైనే వ్యాఖ్యలు చేయడంతో వారు మరింత ఇబ్బందిలో పడ్డారు. విచిత్రం ఏమంటే ఈ కుంభకోణాలకు బాధ్యత తమదికాదు మంత్రులదేనని ఐఎఎస్‌లు అంటుంటే, మంత్రులేమో తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకున్న నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌దేనంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే తాము పని చేస్తామని, వారు తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఐఏఎస్‌లు అంటున్నారు. అక్రమాలుగా భావిస్తున్న నిర్ణయాలకు బాధ్యులైన మంత్రులపై చర్య తీసుకోవాలి తప్ప మంత్రుల నిర్ణయాలను అమలు చేసే ఐఏఎస్ అధికారులపై కాదని అంటూనే ‘పెద్ద చేపల్ని వదలి పెట్టి చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు’ అని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. వారి ఉద్దేశంలో పెద్ద చేపలంటే మంత్రులు, చిన్న చేపలంటే ఐఏఎస్ అధికారులన్నది స్పష్టమవుతోంది. వంద కోట్ల రూపాయలను వదలి పెట్టి కోటి రూపాయలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారని కూడా వారు వ్యాఖ్యానించారు. మంత్రులపై రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలకన్నా ఐఏఎస్ అధికారులు చేసే వ్యాఖ్యలకు, విమర్శలకు ప్రాధాన్యం ఉంటుంది.
సిబిఐ దర్యాప్తు జరుపుతున్న మూడు ప్రధాన కుంభకోణాల్లో 30మంది ఐఎఎస్‌లకు నోటీసులు ఇచ్చారు. కుంభకోణాలు, అక్రమాలు జరిగాయని భావిస్తున్న సమయంలో ఆయా శాఖల్లో పని చేసిన అధికారులు అందరికీ సిబిఐ నోటీసులు ఇచ్చింది. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి బాధ్యులైన మంత్రులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు సిబిఐ మీద వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మంత్రుల్ని మాత్రమే సిబిఐ విచారించింది. అది కూడా రెండోకంటికి తెలియకుండా వారి నివాసానికి వెళ్ళి విచారణ జరిపింది.
మంత్రులు తప్పు చేసినా వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులదే అన్నది సిబిఐ వాదన. మంత్రులు తమకున్న అధికారాలతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యత అన్నది ఐఏఎస్‌ల వాదన. అవకతవకల నిర్ణయాలకు బాధ్యత తమది ఏమాత్రం కాదని, మంత్రులదేనని ఐఏఎస్ అధికారులు అంటున్నారు. మంత్రులేమో దీన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌పైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు తెలియకుండా ముఖ్యమంత్రి సొంతంగా తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యులం కాదని వైఎస్ మంత్రివర్గంలో పని చేసి ఇప్పుడు కూడా మంత్రి పదవుల్లో ఉన్న కొందరు బహిరంగంగానే పలుమార్లు చెప్పారు. అయితే కొన్ని నిర్ణయాలను మంత్రివర్గంలోనే తీసుకున్నారు. వాటికైనా మంత్రివర్గం బాధ్యత వహించాలన్నది కొందరి వాదన. కోట్లాది రూపాయల కుంభకోణాలకు ప్రధాన బాధ్యులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులదే అంటూ పలువురి వాదనలు మంత్రుల చుట్టూ తిరుగుతుండగా సిబిఐ అధికారులు దర్యాప్తు మాత్రం ఐఏఎస్‌ల చుట్టూనే సాగుతోంది. మూడు ప్రధాన కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సిబిఐ అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు దారి తీస్తోంది.
మంత్రులు తప్పు చేసినా వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులదే అన్నది సిబిఐ వాదన.
ReplyDelete--------------------
అల్లా అయితే పనులవటానికి సంవత్సరాలు పడుతుంది. మంత్రులు చెయ్యబోయే పనులన్నిటికీ ముందర ఐఏఎస్ అధికారుల అప్రూవల్ కావాల్సోస్తుంది. ఒక పని మంచిదో కాదో తెలియటానికి ఎన్నేళ్ళు పట్టింది ఇప్పుడు?
నాకు తెలిసి ఈ రాజకీయ నాయకుడు వచ్చిన పోయిన ఒకసారి స్టార్ట్ చేసిన పనిని కొనసాగించాలి..రాజకీయనాయకుల వేలుపెట్టకుంట ఉండాలి.. ఒకతను ఒకటి స్టార్ట్ చేసి ఇన్కొఅతను వచ్చి ఇంకోటి స్టార్ట్ చేసి ఇలా ఏది పూర్తి కాకుంట ఉంట్టుంది ప్రజలకు ఏది మంచిది ఏది కాదో డిసైడ్ చేశే బాధ్యత కూడా ఐఏఎస్ లేకే ఇవ్వాలి రాజకీయనాయకుల అభిప్రాయాన్ని ఆలోచించాలి మంచి అభిప్రాయం అయితే ప్రోత్సహించాలి కాని నాయకులు ఏది చెప్పిన డుడు బసవన్నలా ఉండ్డవద్దు..అప్పుడు అవినీతి ఏది జరిగిన ఐఏఎస్ లే బాధ్యత వహించాలి.. రాజకీయ తొత్తులుగా మారి రాష్టాన్ని నాశనం చేస్తున్నారు.. ఒక ఐఏఎస్ ముందు రాజకీయ నాయకుడు ఎంత చెప్పండి?
ReplyDeleteఐఏఎస్ అధికారులకు చట్టం పట్ల అవగాహన అమలు పట్ల నిబధ్ధత ఉండాలి. రాజకీయ వ్యవస్థ పొరబాటు నిర్ణయాలు చేస్తే వాటిని యెత్తిచూపే బాధ్యతకూడా అధికారులదే. మంత్రిమండలికి ముఖ్యమంత్రి నాయకుడు. ముఖ్యమంత్రి ఒకరి నిర్ణయమే అయినా లేదా ఒక మంత్రి నిర్ణయమే అయినా ప్రభుత్వనిర్ణయమే కాబట్టి మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించ వలసినదే. బాధ్యత నిర్వహించనందుకు అధికారి, మంత్రి, ముఖ్యమంత్రి యెవరైనా సంజాయిషీ ఇచ్చుకోవలసిందే చట్టానికీ ప్రజలకూ.
ReplyDelete