కర్నాటక ఎన్నికలలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డిన కాంగ్రెస్ ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ ఆ విజయం వెనుక చాలానే వ్యూహాలు పన్నినట్లు అక్కడి మీడియా చెపుతోంది. దక్షిణ భారత దేశంలో తొలిసారి కర్నాటకలో పాగా వేసిన బీజేపీని యడ్యూరప్పతో కొత్త పార్టీ పెట్టించి, ఆ పార్టీని దెబ్బతీసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప పార్టీతో బీజేపీ మునిగిపోయిన విషయం తెలిసిందే.
కర్నాటక ఎన్నికలలో మొత్తం 3,12,16,708 ఓట్లు పోలయితే.. అందులో కాంగ్రెస్‌కు 1,14,10,737; బీజేపీకి 63, 32,595; యడ్యూరప్ప నేతృత్వంలో కేజీపీకి 30, 68348 ఓట్లు పోలయ్యాయి. అంటే యడ్యూరప్ప పార్టీని వీడి సొంత పార్టీ పెట్టకపోతే 94 లక్షల ఓట్లు బీజేపీకే వచ్చేవి. అప్పుడు శ్రీరాములు బీఎస్సార్‌పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతు కీలమయ్యేవి. అంటే అప్పుడు కాంగ్రెస్-బీజేపీ అధికారపీఠానికి దగ్గరగా వచ్చేవి. దీన్ని బట్టి కర్నాటకలో యడ్యూరప్ప పార్టీ బీజేపీ కొంపముంచిందని, ఆ పార్టీ చీల్చిన ఓట్లే కాంగ్రెస్‌ను గెలిపించాయని స్పష్టమవుతోంది. చాలాకాలం పాటు బీజేపీలో ఉన్న శ్రీరాములు కూడా పార్టీ పెట్టడం బీజేపీకి నష్టం కలిగించిందని ఫలితాలు స్పష్టం చేశాయి.
ఇదే వ్యూహాన్ని మన రాష్ట్రంలో " కోదండరాం" తో కూడా అమలుచేసే అవకాశాలు ఉన్నట్లు కొన్ని తెలుగు పత్రికలూ చెపుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతోందో?

No comments:
Post a Comment