ఒకప్పుడు పండుగో పబ్బమో వస్తే షాపింగ్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ఏమీ తోచకపోతే షాపింగ్‌కి వెళ్లిపోతున్నారు. 35 ఏళ్లలోపు యువత ఏటా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వస్తువుల మీద పెడుతున్న ఖర్చు లక్షల కోట్లలో ఉంటోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరో నివేదిక ప్రకారం- కేవలం దుస్తులు, యాక్సెసరీస్ మీదే ఏడాదికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవారు అనేక మంది ఉన్నారు మన దేశంలో. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ చెబుతున్న విషయమూ ఆందోళనకరంగానే ఉంది. 5 నుంచి 10శాతం మధ్యతరగతి భారతీయులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారట. వీరిలో 67శాతం వ్యక్తిగత రుణాలు తీసుకుని మరీ ఖర్చు పెట్టుకున్నారట. వడ్డీ ఎక్కువగా ఉండే ఈ రుణాలను ప్రాణాల మీదికి వస్తే తప్ప తీసుకోకూడదంటారు నిపుణులు. కానీ బ్యాంకులు ఫోన్ చేసి మరీ జీరో ప్రాసెసింగ్ ఫీజు అని చెబుతోంటే... తీసుకుని కోరుకున్న వస్తువు కొనేసుకుంటే పోలా... అనుకుంటున్నారు వినియోగదారులు.
కొనేటప్పుడు డోపమైన్ హర్మోన్ ప్రభావం సంతోషాన్నిస్తుంది కానీ బిల్లు కట్టేటప్పుడో? డబ్బులన్నీ అయిపోతే నెల గడిచేదెలా అన్న ఆలోచన ఒత్తిడిని పెంచి కార్టిసోల్ హార్మోన్ విడుదలకు కారణమవుతుంది. పలు అనారోగ్యాలకు అది దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అనవసరమైన ఖర్చులు చేసి చేజేతులా అనారోగ్యాలను ఆహ్వానించడం అన్నమాట. జీతం... జీవితం రెండూ ఒకటే! చేజారిపోయేవరకూ రెండిటి విలువా తెలీదు. అప్పు పేరుతో తప్పు చేయడం మానేద్దాం. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నారు పెద్దలు.
ఆ వినాశకాలాన్ని విలాసాలతో కొని తెచ్చుకోవద్దు.
No comments:
Post a Comment