File
FILEనైజీరియాలోని ఓహున్ ప్రొవిన్స్ ప్రభుత్వ ఎయిడ్స్ విభాగ అధికారి జాన్ ఇటాగో దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. నైజీరియాలో పుట్టిన చిన్నారుల్లో 70 వేల మంది చిన్నారులకు హెచ్ఐవీ వ్యాధి సోకినట్టు పేర్కొన్నారు. ఈ చిన్నారులకు వారి తల్లిని నుంచి ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు.
ప్రపంచంలోనే ఎయిడ్స్ రోగులు ఉన్న ఖండంగా ఆఫ్రికా ఉంది. ఈ ఖండంలోని నైజీరియా ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారు. ఓ పూట కడుపు నింపుకునేందుకు నైజీరియన్ మహిళలు పడుపు వృత్తి చేయడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధిని నివారించేందుకు ప్రపంచ బ్యాంకు 225 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా నైజీరియాకు చేసింది.
No comments:
Post a Comment