18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి మేలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్టప్రతి ఎన్నిక జరిగే నాటికి వీలైనంత వరకూ విధాన సభల్లో ఖాళీలు లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషి వెల్లడించారు. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ రెండోవారంలో విడుదలవుతుంది. జూలై 24నాటికి కొత్త రాష్టప్రతి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది.కాబట్టి మే నెలాఖరుకల్లా ఉప ఎన్నికల తతంగం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంట్టున్నట్టు ఖురేషి తనను కలిసిన విలేఖరులతో చెప్పారు. ఎన్నికలలో ధన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనేకాక దేశవ్యాప్తంగా ఉందని ఆయన చెప్పారు. ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఖురేషి వెల్లడించారు.
No comments:
Post a Comment