Showing posts with label World. Show all posts
Showing posts with label World. Show all posts

Friday, April 19, 2013

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంచబ్యాంకు

ప్రపంచంలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ. 65(1.25 అమెరికన్ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2 బిలియన్) మందిని నిరుపేదలుగా ఇది పరిగణనలోకి తీసుకుంది. వారిలో మూడో వంతు అంటే దాదాపు 40 కోట్ల మంది భారతీయులే ఉండటం గమనార్హం. పేదలు, నిరుపేదలు ఎక్కడున్నారనే ప్రాంతాలవారీ గణాంకాల ఆధారంగా రూపొందించిన ప్రపంచ అభివృద్ధి సూచికల ప్రకారం... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుపేదల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.

1981లో ప్రపంచ నిరుపేదల్లో సగం మంది ఇక్కడే ఉండగా, అది 2010 నాటికి 21 శాతానికి తగ్గింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా మాత్రం 59 శాతం పెరిగింది. అయితే గురువారం ప్రపంచబ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం 120 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడో వంతు కన్నా ఎక్కువ మంది ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని ప్రపంచబ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడు, ఆర్థికవేత్త కౌశిక్ బసు వెల్లడించారు. ఆఫ్రికా ఉప సహారా ప్రాంతంలో అత్యంత పేదరికం స్థాయి 1999తో పోలిస్తే 2010 నాటికి పది పాయింట్లు తగ్గి, 48 శాతం ఉంది. ప్రపంచం మొత్తం మీద పేదల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే ఒక్క ఈ ప్రాంతంలో మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. 

సాక్షి దినపత్రిక నుండి 

Monday, June 18, 2012

మహిళా సంక్షేమంలో కెనడా భేష్



విద్య, ఉపాధి రంగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఎంతో ముందుకు దూసుకుపోతున్నారని మన పాలకులు ఎంతగా గొప్పలు చెబుతున్నా- వాస్తవ దృశ్యం ఇందుకు భిన్నంగా ఉంది. బాల్య వివాహాలు, బానిసత్వం, భ్రూణహత్యల వంటి ప్రతికూల అంశాలతో మన దేశం అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన జి-20 దేశాలతో పోల్చిచూస్తే మహిళా సంక్షేమానికి సంబంధించి కెనడా ముందంజలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సమానత్వం, భద్రత వంటి విషయాల్లో తగిన విధాన నిర్ణయాలతో మహిళలకు అండగా నిలవడంలో కెనడా ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తోంది. మహిళల హక్కులను పరిరక్షించడంలో, వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వడంలో ఈ దేశం మెరుగైన విధానాలను అమలు చేస్తోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్రం వంటి విషయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ సదస్సులో కెనడా ప్రతినిధి ఫరా మొహముద్ చెప్పారు. పౌరహక్కులు, గృహహింస చట్టాలు, విద్యకు అవకాశాలు, ఉపాధి కల్పన, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి విషయాల్లో అమెరికా వంటి సంపన్న దేశాలు వెనుకబడే ఉన్నాయ. ఇవే విషయాల్లో భారత్‌తో పాటు చాలా దేశాలు ఎంతో సాధించాల్సి ఉందని సర్వేలో గుర్తించారు.
మహిళా సంక్షేమానికి సంబంధించి కెనడా తర్వాతి స్థానంలో జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ ఉండగా 20వ స్థానంలో ఇండియా నిలిచిందని అధ్యయనం నిర్వహించిన ‘ట్రస్ట్ లా’ సంస్థ ప్రకటించింది. సౌదీ అరేబియాలో మహిళలు విద్యారంగంలో రాణిస్తున్నప్పటికీ వారికి వాహనాలను నడిపేందుకు అనుమతించక పోవడం గమనార్హం. ఈ దేశంలోని మహిళలకు ఈ మధ్యనే ఓటు హక్కు మాత్రం కల్పించారు. ‘సౌదీ అరేబియా సంపన్న దేశం, భారత్ పేదరికంతో సతమతమవుతున్న దేశం.. అయినప్పటికీ ఈ రెండు చోట్లా మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నార’ని సర్వే నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళల హక్కుల కోసం చాలా దేశాల్లో చట్టాలు చేస్తున్నా ఆశించిన మేరకు ఫలితాలు దక్కడం లేదన్నందుకు భారత్ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. బాల్యవివాహాలు, వరకట్నం, భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, గృహహింసను అరికట్టేందుకు భారత్‌లో ఎన్నో చట్టాలు చేస్తున్నారు. పాత చట్టాలను సవరణల పేరిట ఆధునీకరిస్తున్నారు. అయినప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతునే ఉన్నాయి. కట్నం వేధింపులు, మహిళలపై హింస యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జి-20 దేశాల అధిపతుల సమావేశం నేపథ్యంలో వివిధ అంశాలపై అధ్యయనం చేయగా, పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ‘్భరత్‌లో మహిళలు, బాలికలు హింస, బానిసత్వం, వివక్ష కారణంగా సతమతమవుతున్నార’ని బ్రిటన్‌లోని ‘సేవ్ ది చిల్డ్రన్’ సలహాదారు గుల్షన్ రెహమాన్ అంటున్నారు. లింగ వివక్ష వల్ల మహిళలకు భారత్‌లో భద్రత,్భవిత లేకుండా పోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య సంరక్షణ, హింస నుంచి విముక్తి, రాజకీయ ప్రాతినిధ్యం, ఉపాధి అవకాశాలు, విద్య, ఆస్తిహక్కు, స్వేచ్ఛ, సామాజిక భద్రత వంటి కీలక విషయాలకు సంబంధించి ఆరు కేటగిరీలుగా విభజించి జి-20 దేశాల్లో పరిస్థితులను నిపుణులు విశే్లషించారు. 63 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు అధ్యయనంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళలకు సంబంధించి కెనడాలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత వంటి విషయాల్లో మహిళలకు ఎంతో చేయాల్సి ఉందని వారు సూచించారు. కొన్ని దేశాల్లో ప్రమాదకరమైన గర్భస్రావాల కారణంగా మహిళల ఆరోగ్యం ప్రమాదాల బారిన పడుతోందని ఆందోళన చెందారు. లింగ వివక్ష, హింస నివారణకు కెనడా అనుసరిస్తున్న వినూత్న విధానాలు ఇతర దేశాలు ఆదర్శప్రాయమని నిపుణులు సూచిస్తున్నారు.

Source: Andhrabhoomi

Thursday, April 19, 2012

‘టైమ్’ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మమతకు స్థానం



పశ్చిమ బెంగాల్ ముఖ్యమంథ్రి మమతా బెనర్జీ అమెరికాకు చెందిన ‘టైమ్’ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని వందమంది అత్యంత ప్రభావ శీలవ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరయిన ప్రముఖ ఇనె్వస్టర్ వారెన్ బఫెట్, పాకిస్తాన్‌కు తొలి ఆస్కార్ అవార్డును సాధించి పెట్టిన మహిళా దర్శకురాలు షమీమ్ ఒబైద్ చినాయ్, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫేస్‌బుక్ సిఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ లాంటి స్ఫూర్తి ప్రదాతలు, ప్రపంచానే్న మార్చి వేసిన పలు రంగాలకు చెందిన ప్రముఖుల సరసన మమతా బెనర్జీకి స్థానం లభించింది. అభిమానులు ప్రేమగా ‘దీదీ’గా పిలిచే మమతా బెనర్జీని చంచలస్వభావురాలని, స్ట్రీట్‌ఫైటరని విమర్శకులు విమర్శిస్తారు కానీ, తాను పరిపూర్ణమైన రాజకీయవేత్తనని ఆమె నిరూపించుకున్నారని మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. ప్రతి ఎన్నికలోను ఆమె ఓ వైపు తన పలుకుబడిని పెంచుకుంటూ మరో వైపు ప్రత్యర్థులను అడ్డుతొలగించుకుంటూ వచ్చారని పేర్కొంది. రాజకీయ చదరంగంలో ఎంతో తెలివిగా ఒక్కో ఎత్తు వేస్తూ, సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మమత దేశ రాజకీయాల్లో మరింత ప్రధాన భూమికను పోషించనున్నారని కూడా ‘టైమ్’మ్యాగజైన్ ప్రశంసించింది.

Saturday, April 14, 2012

నైజీరియాలో 70 వేల మంది చిన్నారులకు ఎయిడ్స్!


aids
File
FILE
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో 70 వేల మంది చిన్నారులకు ఎయిడ్స్ మహమ్మారి ఉన్నట్టు ఆ దేశ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ డైరక్టర్ తెలిపారు. ఇక్కడ ఎయిడ్స్ రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ ఆరోగ్యం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నైజీరియాలోని ఓహున్ ప్రొవిన్స్‌ ప్రభుత్వ ఎయిడ్స్ విభాగ అధికారి జాన్ ఇటాగో దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. నైజీరియాలో పుట్టిన చిన్నారుల్లో 70 వేల మంది చిన్నారులకు హెచ్ఐవీ వ్యాధి సోకినట్టు పేర్కొన్నారు. ఈ చిన్నారులకు వారి తల్లిని నుంచి ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు.

ప్రపంచంలోనే ఎయిడ్స్ రోగులు ఉన్న ఖండంగా ఆఫ్రికా ఉంది. ఈ ఖండంలోని నైజీరియా ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారు. ఓ పూట కడుపు నింపుకునేందుకు నైజీరియన్ మహిళలు పడుపు వృత్తి చేయడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధిని నివారించేందుకు ప్రపంచ బ్యాంకు 225 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా నైజీరియాకు చేసింది.

Friday, April 6, 2012

ఆందోళన కలిగిస్తున్న మాల్దీవుల పరిణామాలు

హిందూ దూమహాసముద్ర ప్రాంతంపై మనదేశం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో చోటు చేసుకొనే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయడం సహజం. 2012లో మాల్దీవుల్లో అధికార మార్పిడి జరగడం అటువంటి పరిణామాల్లో ఒకటి! దేశంలో కొనసాగిన ప్రజాందోళనలు ఉధృతమై చివరకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పదవీత్యుతికి దారితీసాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవికి ఎన్నికయిన ఆయన ఎట్టకేలకు ప్రభుత్వ బాధ్యతలను ఉపాధ్యక్షుడు మహమ్మద్ వాహీద్ హసన్‌కు అప్పగించి, ఈ ఏడాది ఫిబ్రవరి 7న పదవినుంచి వైదొలగాడు. ఇటు భౌగోళికంగా లేదా జాతి పరంగా మాల్దీవులు అరబ్ ప్రపంచంలో భాగం కాదు. కానీ 2010లో ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, ఈజిప్ట్, యెమెన్, ట్యునీసియా, మొరాకోదేశాల్లో చెలరేగిన ఉద్యమాల మాదిరి ఆందోళనలే ఇక్కడ కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అప్పటి అధ్యక్షుడు నషీద్ పదవినుంచి తప్పుకోవడానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే..అరబ్ దేశాల ఆందోళనల ప్రభావం ఇక్కడ ఉన్నదని ఎవరికైనా అవగతం కాక మానదు. ఉత్తర ఆఫ్రికా దేశాల మాదిరిగానే మాల్దీవుల్లో కూడా కొన్ని దశాబ్దాలుగా పురాతన శైలి నిరంకుశాధికారం కొనసాగింది. అయితే అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం దీవుల్లోని పౌర సమాజాల్లోని ‘ప్రజాబలం’ నిరంకుశ పాలనకు చరమగీతం పలికింది. ముఖ్యంగా రాజకీయ హక్కులు, పౌరులకే అధికారం అప్పగించడం, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అవసరాన్ని ప్రజలు నొక్కి చెబుతూ ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసినమాట వాస్తవం.
అయితే మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలను చాలా జాగ్రత్తగా, నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల్లో అధికార మార్పిడికి కేవలం అరబ్ ఉద్యమాలు హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి చొచ్చుకొని రావడమే కారణమన్న కోణంలో ఈ పరిశీలన కొనసాగాలి. కేవలం మూడు నెలలకు ముందు భారత్‌కు పొరుగు దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద పరిణామం..మనదేశ ప్రజల మనోఫలకాలపై గాఢమైన ముద్రను వేయలేకపోయింది. మరోమాటలో చెప్పాలంటే భారతీయులు ఈ సంఘటనను ఎప్పుడో మరచిపోయారు! దీనికి అంతటి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అందుకు కారణం.
తన పదవీత్యుతి తర్వాత అధ్యక్షుడు నషీద్ విలేకర్లతో మాట్లాడుతూ..పోలీసులు, సైన్యం వత్తిడి వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ పరంగా ఆలోచిస్తే, మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలు కేవలం ఆ దేశ అంతర్గత వ్యవహారం. కానీ బయటి శక్తులు మాల్దీవుల్లో తమ పలుకుబడిని విస్తరించుకోవడానికి, అక్కడ తిష్ఠవేయడానికి చేసే యత్నాల్లో భాగంగానే ఈ మొత్తం నాటకాన్ని రక్తి కట్టించాయా? అనే ప్రశే్న మనకు ఆందోళన కలిగించే అంశం. భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉన్న మాల్దీవులతో సహజంగానే భారత్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. అన్ని సందర్భాల్లో కూడా మనదేశం, మాల్దీవులతో స్నేహం విషయంలో ప్రత్యేకతను కనబరుస్తూనే వచ్చింది. వివిధ దేశాల్లో చోటు చేసుకున్న అరబ్ ఉద్యమాలను భారత్ ఎల్లప్పుడూ, ఆయా దేశాల అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చింది. అయితే అరబ్ ఉద్యమాల పుణ్యమాని ఆయా దేశాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలతో సంబంధాలు నెరపే విషయంలో భారత్ కొరుకుడు పడని సమస్యను ఎదుర్కొంటున్నది. నియంతల కబంధ హస్తాలనుంచి తమ దేశాలకు విముక్తిని కలిగించిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా పార్టీల వారు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, వారిలో సెక్యులర్ భావాలు లేకపోవడం భారత్ ఆందోళనకు కారణం! ముఖ్యంగా అవి ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా..అంటే సలాఫి-వాహబీ ఛాందసవాదం వైపుకు మొగ్గు చూపుతుండటం భారత్‌కు ఇబ్బంది కారకమవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనదేశం వంటి సెక్యులర్ దేశాల్లో, బహుళ సంస్కృతులు పరిఢవిల్లుతున్నాయి. విభిన్న మతాలవారు సహజీవనం కొనసాగిస్తున్న సమాజం మనది. ఈ నేపథ్యంలో, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లోని కొన్ని ఇస్లామిక్ వర్గాలు, జిహాదీ సంస్థలు చేస్తున్న దుష్ప్రచార ప్రభావానికి తేలిగ్గా లోబడే అవకాశాలు మెండు. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లోని కోవర్ట్ ఇంటెలిజెన్స్ సంస్థల సహాయంతో జిహాదీ సంస్థలు చేసే ఆగడాలతో మనదేశం ఎంతో సతమతమవుతున్నది! అందువల్ల ప్రస్తుతం అరబ్ దేశాల్లో చోటు చేసుకున్న ఉద్యమాల అనంతరం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వాతావరణం భారత్‌కు ఏమాత్రం సానుకూలం కాదు! అటువంటి పరిస్థితుల్లో, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ పదవీత్యుతుడు కావడానికి ముందు చోటు చేసుకున్న వివిధ ప్రజాందోళనలను ఎవరు పరీక్షిస్తారు? లేదా పట్టించుకునేదెవరు?
ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో చోటు చేసుకున్న రాజకీయ అస్థిరత, పౌర ఉద్యమాలను..దక్షిణాసియా, హిందూ మహాసముద్రం ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న రాడికల్ ఛాందసవాదం దృక్కోణంలో విస్తృత ప్రాతిపదికన పరిశీలించాల్సి ఉంది. భౌగోళికంగా మాల్దీవులు ఒంటరిగా, వ్యూహాత్మకంగా బాహ్య శక్తులు తేలిగ్గా ప్రవేశించి తిష్ఠవేసేందుకు అనువుగా ఉన్నాయి. దీనికి నిదర్శనంగా 1988లో జరిగిన సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అనే తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు, అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వాన్ని పడగొట్టి, ద్వీపాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. మాల్దీవుల ప్రభుత్వం భారత్ సహాయాన్ని అర్థించింది. తక్షణమే భారత సైన్యానికి చెందిన పారాచూట్ బెటాలియన్‌ను అక్కడికి నాటి కేంద్ర ప్రభుత్వం పంపింది. దీనికి ఆపరేషన్ కాక్టస్‌గా పేరుపెట్టారు.
మరి అటువంటి ప్రయత్నాలు మళ్ళీ జరగకూడదనేంలేదు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వంటి కోవర్ట్ సంస్థల మద్దతుతో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఈ ద్వీపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేం. నేరుగా ప్రభుత్వాన్ని పడగొట్టే చర్యల వల్ల, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, దేశాన్ని ఆందోళనలతో అట్టుడికించడం ద్వారా,పాలక ప్రభుత్వాన్ని అధికారంనుంచి తప్పించవచ్చు. తర్వాత చట్టబద్ధంగా జరిగే ఎన్నికల్లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు అధికారాన్ని హస్తగతం చేసుకొనే విధంగా ప్రణాలిక సిద్ధం చేసి అమలు జరపవచ్చు.
నిజానికి హిందూ మహాసముద్రం, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగపడుతున్నది. అందువల్లనే ఈ మార్గంలో రవాణా నౌకల రద్దీ అధికంగా ఉంటోంది. అంతే కాదు ఈ సముద్ర తీరంలో చాలా చిన్న దేశాలు ఉండటం వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత విస్తృతం చేసింది. ముఖ్యంగా వాటిల్లో అందుబాటులో ఉండే వనరులు, భౌగోళిక కోణంలో కూడా ఆయా దేశాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగివుండటం విశేషం. అరేబియా సముద్రం ఎగువ భాగంలో ముఖ్యంగా హార్న్ ఆఫ్ ఆఫ్రికా చుట్టుపక్కల ప్రాంతాలు, పూర్వకాలపు బార్బరీ తీర ప్రాంతం మాదిరిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించే సోమాలియా సముద్రపు దొంగలకు నిలయంగా మారిపోయింది. ప్రస్తుతం సోమాలియాలో ఏవిధమైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అరాచకం తాండవిస్తోంది. అంతేకాదు అల్ సాహెబ్ జిహాదీ గ్రూపులు ఇక్కడ యదేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
ఇక్కడి సముద్రపు దొంగల స్థావరాలను సమూలంగా నాశనం చేయాలంటే.. పెద్ద ఎత్తున వాయు, భూతల దాడులు జరపాల్సి ఉంటుంది. ఇందుకు ఏ దేశానికి చెందిన ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. సోమాలియాకు చెందిన ఈ మిలిటెంట్ గ్రూపులు అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పటి వరకు కేవలం ఇథియోపియా మాత్రమే ప్రయత్నించింది. ఈ యత్నాలు ఏవీ సఫలీకృతం కాలేదు సరికదా, ఈ సముద్రపు దొంగల సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలో కూడా విఫలమయింది.
ఈ సోమాలీ పైరేట్లు ఇక ముందు..మరింత ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చుకొని, సైనిక శిక్షణ పొందే రోజులు కూడా ఎంతో దూరంలోలేవు! ఇందుకు కోవర్ట్ ఏజెంట్లు లేదా అల్ ఖైదా, తాలిబన్ సంస్థలకు చెందిన జిహాదీలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఫలితంగా అల్ షబాబ్ తూర్పు ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రభుత్వాలకు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇదే సమయంలో హిందూమహాసముద్ర ప్రాంతంలోని ద్వీప సమూహాలు పూర్తి స్థాయిలో ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా మారిపోతాయని కూడా చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో భారత్ తన సమీప ప్రాంతాల విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రస్తుతం మాల్దీవుల్లో చోటు చేసుకున్న మార్పులు, భవిష్యత్ పరిణామాలకు సూచనగా అర్థం చేసుకోవాలి. అందుకు తగినవిధంగా భారత్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వ్యూహాత్మకంగా మెలగగలిగితే హిందూ మహాసముద్రంలో, భారత్ తన ప్రయోజనాలను పరిరక్షించుకోగలుగుతుంది.

  • -శంకర్ రాయ్‌చౌధురి in Andhrabhoomi

Wednesday, February 15, 2012

భారత్‌పై ఆధారపడొద్దు : బరాక్ ఒబామా

అమెరికా కంపెనీలు ఇప్పుడు ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో నిపుణులైన, విద్యావంతులైన కార్మికులకోసం భారత్, చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నాయని, అయితే అమెరికా కంపెనీలు అలాంటి వారికోసం ఆ దేశాలవైపు చూడకుండా ఉండా

లని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దీన్ని నిరోధించడానికి అమెరికాలోని విద్యార్థులకు శిక్షణ, తగిన విద్యను అందించడానికి విద్యా సంస్థలు, అధ్యాపకులకు తగిన వనరులను అందించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.‘యాజమాన్యాలు నిపుణులైన, విద్యావంతులైన వర్కర్లను కోరుకుంటున్నాయి. అలాంటి వాళ్ల కోసం వారు భారత్, చైనాలలో వెతుకుతున్నారు. అమెరికాలోనే అలాంటి వారు వ్యాపార సంస్థలకు లభించేలా చేయాలని నేను అనుకుంటున్నాను’ అని 2013 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను అమెరికా కాంగ్రెస్‌కు పంపించిన అనంతరం నగర శివార్లలోని ఒక కమ్యూనిటీ కాలేజిలో ప్రసంగిస్తూ ఒబామా అన్నారు. యాజమాన్యాలు కోరుకునే నైపుణ్యాలు, శిక్షణ తమ పిల్లలకు చదువు చెప్పించే స్ర్తి పురుషులతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. కేవలం పరీక్షలకోసం పాఠాలు చెప్పడం కాక విద్యార్థులు నేర్చుకోవడానికి వీలు కల్పించే అవకాశాన్ని, వనరులను విద్యాసంస్థలకు కల్పించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేకాక చదువులు ఖరీదయినవిగా మారడానికి ఇది సమయం కాదని, అందువల్ల విద్యా రుణాలపై వడ్డీరేట్లను ఈ ఏడాది జూలైనుంచి రెట్టింపు చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమెరికాలో ప్రతి కుటుంబానికి చదువులు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని , 21వ శతాబ్దంలో అమెరికా చేస్తున్న హామీలో ఇది కూడా ఒక భాగమని ఒబామా నొక్కి చెప్పారు.