Monday, March 12, 2012
ఎన్డీయేలోకి సుబ్రహ్మణ్యస్వామి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మరో పార్టీ చేరింది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఎన్డీయే కూటమిని పటిష్ఠపరిచే దిశగా కృషి చేస్తున్న బీజేపీ.. సుబ్రహ్మణ్యస్వామి నేతృత్వంలోని జనతా పార్టీని తమ కూటమిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసంలో ఆదివారం జరిగిన ఎన్డీయే ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘మా కూటమిలో చేరేందుకు స్వామి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన ఎన్డీయే నేతలతో కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు’ అని బీజేపీ సీనియర్ నేత అహ్లూవాలియా విలేకరులకు తెలిపారు. జనతా పార్టీ రాకతో ఎన్డీయే మిత్రపక్షాల సంఖ్య ఆరుకు చేరింది. ప్రస్తుతం బీజేపీ, జేడీయూ, శిరోమణి అకాలీ దళ్, శివసేన, రాందాస్ అథావాలె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ భేటీకి అథావాలె, సుబ్రమణ్యస్వామి హాజరుకాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment