Friday, March 16, 2012

సచిన్ వందో సెంచరీ కొట్టాడోచ్ !!


అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడ జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సచిన్ సెంచరీ కొట్టాడు. ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 33 ఇన్నింగ్స్ తరువాత ఈ సెంచరీ కొట్టాడు.
టెస్ట్ లో 51 సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడుగా సచిన్ నిలిచాడు. సచిన్188 టెస్ట్ మ్యాచ్ లు, 462 వన్డే మ్యాచ్ లు ఆడాడు. అన్ని టెస్ట్ దేశాలపైన సెంచరీ చేశాడు. ఒన్డేల్లో అన్ని టీమ్ లపై సెంచరీలు చేసిన ఘనత దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాపై అత్యధికంగా 8 సెంచరీలు చేశాడు. 1990 ఆగస్ట్ 14న సచిన్ ఇంగ్లండ్ పై తొలి సెంచరీ చేశాడు.

4 comments:

  1. ఆయనగారు నింపాదిగా నూరవశతకాన్ని చేరుకున్నారు.
    బంగ్లాదేశ్ match ఎగరేసుకొని పోయింది.
    మనకో ౩౦ పరుగులు తక్కువయ్యయి సచిన్ దయవలన.

    ReplyDelete
  2. SO WHAT . I FIND THIS CETURY MANIA INSTEAD OF WINNING THE MATCHES QUITE IRRITATING. PLAYERS MUST HAVE SENSE TO PLAY TO WIN THE MATCHES FOR THE COUNTRY RATHER THAN GETTING PERSONAL RECORDS..

    ReplyDelete
  3. ఓ దరిద్రం వదిలింది

    ReplyDelete
  4. మొత్తం మీద 'బ్లాగ్' డాక్టర్ శ్రీ 'మరణం' గారి సలహా పని చేసి నట్టు వుంది.

    అల్ చీర్స్ టు డాక్టర్ శ్రీ 'మరణం' - బ్లాగ్ యారమణ గారు !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete