Sunday, May 12, 2013

అయ్యా! రవి ప్రకాష్ గారూ ఇదేనా మీ "మెరుగైన సమాజం" ?

నిన్న కర్నూలులో రవిప్రకాష్పై ఓ మాజీ విలేఖరి చెప్పుతో దాడి చేసిన ఘటన సంచనలం సృస్టించింది. సదరు మాజీ విలేఖరి రమణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసారు.  అయితే ఆ ఘటన తర్వాత టివి9 సిబ్బంది సదరు నిందితుడిని తమకు ఓ పావుగంట అప్పగించండి అని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అప్పటికే అతనిపై ఆ సిబ్బంది దాడి చేసి గాయ పరిచారు.
సాక్షాత్తూ ప్రదానిపైనే బూటు విసిరిన సంఘటనలు గతంలో జరిగాయి. కానీ వారిని పోలీసులు అరెస్ట్ చేయడమూ, కొన్ని కేసులలో క్షమించి వదిలేయడమూ కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ "మెరుగైన" సిబ్బంది ఓ పావు గంట ఆ నిందితునితో ఫుట్ బాల్ ఆడుకోవడానికో లేక ఏదైనా పార్ట్ తీసివేయడానికో అడిగారని ఊహించవచ్చా! రాయలసీన రౌడీలు, ఫ్రాక్షనిస్టులు అంటూ విరుచుకు పడుతున్న రవిప్రకాష్ గారు దీనికి ఏమి సమాధానంచెపుతారు?  పోలీసులు టివి9 సిబ్బందిపై కేసు నమోదు చెయ్యరా?

2 comments:

  1. నీతులు చెప్పడానికి మాత్రమే,ఇప్పటికైనా అర్థం అయ్యింది కదండి.దాడి చేసిన నిందితుని పోలీసులకు అప్పగించకుండా,తమకు అప్పగించమని డిమాండ్ చేయడం ఏ ప్రజాస్వామ్యం లో భాగమో!

    ReplyDelete
  2. tv నైనోడు మెరుగైన సమాజం కోసం అని కాకుండా సమాజాన్ని చెడగొట్టడం కోసం అని కేప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది

    ReplyDelete