వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ
ఆదివారం రాత్రి 7.20 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ నేత జూపూడి
ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించారు. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి
ఉన్నా కూడా.. జగన్ ను సీబీఐ దుందుడుకుగా వ్యవహరించి అన్యాయంగా అరెస్ట్
చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి
ఉద్రేకానికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. ఈ అరెస్ట్ దారుణమని
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వరుసగా మూడో రోజూ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్
అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన కుటుంబీకులు ఆదివారం
సాయంత్రం 7.15 గంటల సమయంలో దిల్ కుష్ అతిథి గృహానికి బయల్దేరారు. వారిలో
జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, బావ అనిల్, వైవీ
సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment