లండన్‌లో వేలం వేసిన మహాత్మాగాంధీకి చెందిన వస్తువులను ముంబయికి చెందిన
ప్రముఖ వ్యాపారి దక్కించుకున్నారు. యుకెలోని ముల్లక్ అనే సంస్థ గాంధీ
వస్తువులను మార్చి నెలలో వేలం వేసింది. బాపూజీ వస్తువులను వేలంలో తాను
దక్కించుకున్నట్టు మాజీ కేంద్ర మంత్రి, పబ్లిషర్ కమల్ మోరార్కర్
వెల్లడించారు. వాటిని త్వరలోనే భారత్‌కు తీసుకురానున్నట్టు తెలిపారు.
గాంధీ హత్యా స్థలం నుంచి సేకరించిన రక్తంతో తడిచిన గడ్డి, మట్టి కళ్ళజోడు,
చెక్కతో చేసిన చరఖా గాంధీ సంతకంతో ఉన్న పత్రాలు, ఆయన జీవిత చరిత్రకు
సంబంధించిన కొన్ని లేఖలు వేలంలో దక్కించుకున్నట్టు చెప్పారు. వేలంలో లక్ష
పౌండ్లకు పైనే చెల్లించానని అన్నారు.
వస్తువులను ఢిల్లీ జాతీయ లైబ్రరీలో ప్రదర్శించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే సంతోషమని అంటూ వ్యాపార దృక్పధంతో వాటిని కొనలేదని వివరించారు. మోరార్కర్ ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ తరఫున కొనుగోలు చేసిన వాటిని తిరిగి విక్రయించాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. జాతి సంపద బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతోనే పాల్గొన్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే వాటిని భారత్‌కు తీసుకురానున్నట్టు మోరార్కర్ వెల్లడించారు.

No comments:
Post a Comment