కరిష్మా కపూర్, రీనా కపూర్
90 దశకంలో కరిష్మా తన కరిష్మాను కొససాగించా, నేడు కరినా తన చెరిష్మాను కొనసాగిస్తున్నారు. అనారి, జిగర్, రాజాబాబు, అందాస్ వంటి హిట్ చిత్రాలలో నటించి అనేక జాతీయ అవార్డులను అందుకుండి కరిష్మా. ‘రెఫ్యూజీ’ చిత్రంలో బాలీవుడ్‌లో ప్రవేశించి నేడు రూ. వందకోట్లు కలెక్ట చేసే హీరోయిన్‌గా అవతరించింది కరీనా. మార్లిన్ మాన్రో జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘హీరోయిన్’ వంటి చిత్రాలలో బిజీగా ఉంది కరీనా.
కాజోల్ - నిషా
బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ కథానాయికలతో ఒకరు కాజోల్. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్‌కుచ్‌హోతాహే, ప్యార్ కియాతో డర్నా క్యా, మైనేమ్ ఈజ్ ఖాన్ వంటి హిట్ చిత్రాలలో నటించారు. నిషా విషయానికి వస్తే బాలీవుడ్‌లో అన్ సక్సెస్‌ఫుల్ అయిన కథానాయికలలో నిషా ఒకరు. హిందీ చిత్రాలలో మంచి గుర్తింపు రాకపోవడంలో కాజోల్ చెల్లెలు నిషా తెలుగు చిత్రం ‘నీవల్లే నీవల్లే’ వంటి చిత్రాలలో కనిపించింది. ఒకరు హిట్టూ ఒకరు ఫట్టూ అనమాట.
శిల్పాశెట్టీ - షమితా శెట్టీ
‘ధడ్‌కన్, బాజీగర్, రిష్తే, ఫిర్ మిలేంగే వంటి హిట్ చిత్రాలలో నటించి ఉత్తమ కథానాయికగా అవార్డు సాధించారు ‘శిల్పా శెట్టీ’. బిగ్ బాస్ రియాల్టీ కార్య క్రమంలో పాల్గొనటం, రిచర్డ్ గేర్ వ్యవహారం వంటి విషయాలతో అంతర్జాతీయంగా పాపులర్ అయ్యారు. యోగా సీడీలను కూడా రిలీజ్ చేసి సంచలనం కలిగించారు శిల్పా. రాజ్ కుంద్రాను వివాహం చేసు కున్న శిల్పా త్వరలోనే అమ్మతనంలోని అప్యాయతను రుచిచూడబోతోంది. ఇక షమితా విషయానికి వస్తే జహర్, క్యాష్, హేబేబి వంటి చిత్రాలలో నటించి మంచి కథానాయికగా గుర్తింపు సాధించారు.
అనా - ఇషా
హేమా మాలిని ముద్దులు కూతుళ్లది ఒకే దారి కానీ, గమ్యం మాత్రం వేరు. తల్లిదండ్రులు చిత్రసీమలో తారా స్థాయిలో ఉన్నా అనా డియోల్ మాత్రం కేవలం తన శాస్ర్తీయ నృత్యప్రదర్శనలకే పరిమితం అయ్యింది. ఇషా డియోల్ విషయానికి వస్తే ‘ధూమ్’, దస్ వంటి చిత్రాలలో నటించి మంచి కథానాయికగా గుర్తింపు సాధించింది. తల్లి హేమా మాలినితో కలిసి అనా, ఇషాలు తరచుగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను ఇస్తారు. ఇషా చిత్రాలకు, అనా ప్రకటనలకు పరిమితం అయ్యారు.
శృతి హాసన్ - అక్షర హాసన్
కమల్ హాసన్ ముద్దులు కూతురు శృతి హసన్ అటు సింగర్‌గా, ఇటు కథానాయిగా బిజీగా ఉంది. సూర్యతో ‘సెవెన్త్ సెన్స్’లో నటి తొలి హిట్‌తో నటిగా మంచి గుర్తింపు సాధించింది. హిందీలో ‘లక్, దిల్ తో బచ్చా హేజీ వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో అనగనగా ఓ ధీరుడు, ఓ మైఫ్రెండ్ వంటి తెలుగు చిత్రాలలో నటించిన శృతి పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. అక్షర హాసన్ కూడా త్వరలోనే చిత్రసీమలో అడుగుపెట్టనుందని సమాచారం.
సైఫ్ అలీఖాన్ - సోహా అలీఖాన్
బాలీవుడ్ చోటే నవాబ్ ‘సైఫ్ అలీ ఖాన్’ జీవితంలో కరీనా వచ్చాక, చిత్ర సీమలో సెకెండ్ ఇన్నింగ్ బాగా నడిచింది. ‘రేస్’, ‘ఆరక్షణ్’, ‘కుర్బాన్’ వంటి హిట్ చిత్రాలతో మంచి ఊపుడులో ఉన్నాడు. 2012లో కరీనాతో వివాహం జరగనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక సోహ అలి ఖాన్ విషయానికి వస్తే ‘రంగ్ దే బసంతి’ వంటి హిట్ చిత్రాలలో నటించిన సోహ తరువాత తన జాదూను కోనసాగించలేక పోయింది.ఇమ్రాన్ హష్మీతో ‘తుమ్‌మిలే’ చిత్రం తరవాత ఆ స్థాయి చిత్రాలలో కనిపించలేదు.సైఫ్-సోహాలు కొన్ని ప్రకటనలో కలిసి నటించారు.
సన్ని డియోల్- బాబీ డియోల్
బేతాబ్,అర్జుమ్, త్రిదేవ్, ఘాయల్,డర్, జీత్, ఘాతక్, గదర్ వంటి హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సాధించిన నటుడు సన్నీ డియోల్. సన్నీ ‘ఏ ఢాయ్ కిలోకా హాత్ జబ్ ఉడ్తా హేనా, ఇన్సాన్ ఉటతా నహీ ఉట్‌జాతాహే’ ( నా చెయ్యి పడితే పడితే మనిషి లేవడు ..లేచి పోతాడు) డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. బాబీ డియోల్ ‘సోల్జర్, బిచ్చూ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీని సంపాదించాడు. బాబీ చిత్రం ‘ప్లేయర్స్’ నేడు విడుదల కానుంది.
సల్మాన్-అర్బాస్-సోహైల్
బాలీవుడ్‌లో సల్మాన్-అర్బాస్-సోహైల్ సోదరుల హవా కొనసాగుతోంది. ఈ ఖాన్ సోదరులలో ముందుగా చిత్రసీమలో ప్రవేశించింది కండల వీరుడు సల్మాన్ ఖాన్. వీరి ముగ్గురిలో సల్మాన్ ఖాన్ పెద్దవాడు, తరువాత అర్బాస్ ఖాన్, అందరికన్నా చిన్న వాడు సోహైల్ ఖాన్. సల్మాన్ అర్బాస్‌లు కలిసి హలో బ్రదర్, ప్యార్ కియాతో డర్నాక్యా చిత్రాలు చేశారు. ఇటీవలే రూ.వంద కోట్ల కలెక్షన్‌ను కొల్లగొట్టిన సల్మాన్ చిత్రం ‘దబంగ్’ను అర్బాస్ ఖాన్‌నిర్మించాడు. త్వరలో ‘దబంగ్-2’ కూడా రాబోతుంది. మరి సల్మాన్-సోహైల్‌లు కలిసి ‘మైనే ప్యార్ క్యూకియా’ వంటి చిత్రాలలో కలిసి నటించారు.
మలైకా అరోరా - అమృతా అరోరా
‘దిల్సే’ చిత్రంలో ‘ఛయ్య ఛయ్య’ పాట నుంచి ‘దబంగ్’ చిత్రంలో ‘మున్నీ బద్నామ్’ వరకు పాపులర్ ఐటం సాంగ్‌లలో మంచి గుర్తింపు సాధించింది మలైకా అరోరా. బాలీవుడ్ కథానాయకుడు, నిర్మాత అర్బాస్ ఖాన్‌ను అమె 1998లో వివాహం చేసుకున్నారు. తెలుగులో ప్రిన్స్ మహేష్‌బాబు ‘అతిధి’లో ‘రాత్రైన నాకు ఓకే’ లో ఐటం సాంగ్‌లో ఇరగదీసింది. అమృతా విషయానికి వస్తే ‘స్పీడ్, అవారా పాగల్ దీవానే వంటి చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు సాధించింది. అయితే చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం లేవు.
రియా - సోనమ్
సావరియా చిత్రంతో బాలీవుడ్ వెండి తెరకు పరిచయమైన ‘మిస్టర్ లఖన్’ అనిల్ కపూర్ కూతురు ‘సోనమ్ కపూర్’ ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’ వంటి చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకుంది. సోనమ్ నటించిన ప్లేయర్స్ చిత్రం నేడు విడుదల కానుంది.ఇక సోనమ్ చెల్లెలు రియా విషయానికి వస్తే అమె న్యూయార్క్‌లో చదువుకుంది. సిని రంగానికి దూరంగా ఉంది.
No comments:
Post a Comment