Tuesday, January 10, 2012
రాహుల్ ఎన్నటికీ ప్రధాని కాలేడు:శివసేన చీఫ్ బాల్‌ఠాక్రే
కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీపై.. శివసేనాధిపేతి బాల్‌ఠాక్రే మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు రాహుల్‌కు లేవని, అది ఎప్పటికీ జరగదని పార్టీ పత్రిక ‘సామ్నా’ ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. పై విధంగా స్పందించారు. కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ, గోవింద్‌వల్లభ్ పంత్ వంటి మహామహుల శకం ముగిసిందని, ప్రస్తుత నేతల్లో అసలు నాయకత్వ లక్షణాలే లేవని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 4.5 శాతం ఉప కోటా ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయంపై ఠాక్రే మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేలే పూర్తి బాధ్యుడని విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment