Friday, January 6, 2012

ఇంటి ఓనర్లకో నమస్కారం!

ఇంటివాళ్లతో నీళ్ళ తంటాలు తప్పవు. అద్దె ఇల్లు అనగానే ఎన్నో రకాల సమస్యలు. ముఖ్యంగా కరెంట్, నీటి దగ్గర ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ మధ్య ఇండివిడ్యువల్ హౌస్‌లకి ఎవరూ అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఎందువల్లనంటే ఆ ఇంటి ఓనర్ కుటుంబంలో వారికి విచిత్రస్వభావాలుంటాయి. కొందరు ఇంటి ఓనర్లు హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మనం కట్టే కర్టెన్స్ దగ్గరినుంచి అంతా వాళ్ళ ఇష్టమే. ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుని చూపిస్తే ఇంటి అద్దె పెంచేసేవారు. చీర కొనుక్కుంటే విచిత్రం, అంత సంపాదిస్తారు... ఇంత సంపాదిస్తారు.. అని అంటారు. వండుకుంటే ఏం వండుకుంటున్నారు? పచ్చడా? కూర, పులుసుతో సరిపెట్టుకుంటున్నారా? పప్పులో ఏం కూర వేసారని కొందరు అడుగుతూ ఉంటారు.
అద్దె ఇల్లు సుఖంగా ఉంటే చాలనుకునేవారు ఎక్కువ. కొందరు ఇంటి ఓనర్ల కుటుంబ సభ్యులు చటుక్కున పైకి వచ్చి డైనింగ్ టేబుల్‌మీద నుంచి ఏదైనా సర్దుకు వెళ్లిపోతారు. అలా వద్దంటే గొడవే! పండగలు, పబ్బాలు వస్తే ఇంటి ఆవిడకు పేరంటాలు మాదిరిగా చీర పెట్టాలి. పండగకి బంధువులతోపాటు భోజనం, చీర పెట్టాలి. నేను ఇక్కడ తింటాను. మరి అంకుల్‌కి ఎలా?-అని క్యారేజీలోనో, బాక్సులోనో ఓనరమ్మ సర్దుకువెళ్ళిపోతుంది. మళ్ళీ మన అవసరానికి ఏదైనా అడిగితే అంతే సంగతులు. ఏమిటో సరోజా ఇవ్వాళ కడుపునొప్పిగా వుంది. ఎవరైనా, ఏదైనా ఇస్తే బాగుండును-అనిపిస్తోంది అంటుంది.. ఇంటి ఓనరూ విజరుూభవ!
వాటర్ బిల్లు కడుతున్నా సరే నీళ్ళు ఇవ్వడానికి కొందరు నానాతిప్పలు పెడతారు. ఈ బాధలు పడలేకే నీళ్లు నింపడానికి కొన్ని చోట్ల డబ్బాలు కొనుక్కుంటున్నారు. అలాగే, అద్దె ఇళ్లలో ఎప్పటికప్పుడు ట్యాప్‌లు రిపేరుకు వస్తాయి. వాటిని రిపేర్ చేయిస్తే మూడు వందల చొప్పున ఖర్చు అయ్యింది. పది ట్యాప్‌లకి మూడు వేలు ఖర్చు అయింది. అయినా వాషర్ పోయింది, స్పిండిల్ పోయిందంటూ రకరకాలుగా ప్లంబర్స్ చేత డబ్బు ఖర్చుపెట్టించేవారు. కొన్నిచోట్ల వంటింట్లో సింక్ లేకపోవడమేమిటనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న ఎవరికైనా విసుగే. 5 అడుగుల పొడుగు 3 అడుగుల వెడల్పు వంటిల్లు .అందులో గ్యాస్ గట్టు లేదంటూ మనం వాపోవాల్సిందే.
కిటికీలు ఉంటాయి కానీ వాటికి సరైన తలుపులు ఉండవు. ఆ ఇంట్లోకి ఎవరు వస్తే వారు టెంపరరీగా ప్లాస్టిక్‌వి పెట్టుకుంటారు. అదొక గొప్ప పాలసీ అని చెప్పాలి. ఇంక కరెంటు విషయానికి వస్తే ఎక్కడికక్కడ వైర్లు వేలాడుతూ ఉంటాయి. టెంపరరీ ఫిట్టింగ్స్. ఏది ఏమైనా ఆ నలుగురూ తెలుసున్న వాళ్ళు ఉన్నారు, అందుకని ఇక్కడ ఉన్నామని చెప్పాలి. తుమ్మినా, దగ్గినా అయినవాళ్ళు వస్తూ ఉంటారు. చక్కగా వండిన వంటకాలు రుచి చూపించవచ్చును.
ఇక కారు విషయానికి వస్తే, ఇంటి ఓనరుకు బ్రిటీష్ కాలపు కారు ఉంటుంది. ఆ కారు ఎప్పుడూ బయటకి తియ్యరు. కేవలం స్టేటస్ సింబల్ మాత్రమే. మాకూ కారు ఉంది. నాల్గు స్కూటర్లు తాళాలు వేసి ఉంటాయి... ఇది రిచ్ సింబల్ మాత్రమే.
ఇంక ఇంట్లో ఎంతమంది ఉంటారు? వారి అలవాట్లు ఏమిటి? పిల్లలెంతమంది? పెద్దలెంత ఈ లెక్క ఇంటివాళ్ళకి, వంటవాళ్ళకి, పనివాళ్ళకి అందరికీ అవసరమే. ఇంటి కోడలు వస్తేనే ఇంటి అద్దె పెంచమనే ఇంటి వారు జీతం పెంచమనే వంట మనిషి, బట్టలు పెరిగాయి గనుక బిల్లు పెంచమనే చాకలి, పనిమనిషి వీరంతా కూడా కోడల్ని లెక్క కడతారు. ఏంటో ఈ విచిత్ర జీవితాలు. గతంలో పెళ్ళికి పట్టు చీర ఇచ్చి ఒకామె పీట పట్టుకు తిరిగిందట. ఆ విధంగా ఇల్లు అద్దెకిచ్చి ఉదయం, సాయంత్రం పైకి వచ్చి సతాయిస్తారు.
అంట్లు తోమేచోట జిగురు ఉంది. అంట్లు అలా పరిచేస్తావేమిటి? పళ్ళాల్లో మెతుకులు ఉన్నాయి. అవి డస్ట్‌బిన్‌లో పోసి తొలిచి పళ్ళాలు పెట్టాలి. సింక్ దగ్గర అద్దం ఉంటే నిద్ర లేచి బ్రష్ చేసి చేసిన వెంటనే ముఖం చూసుకోవటానికి ఉంటుంది. ఇలాంటివి మినిమమ్ ఫెసిలిటీస్ అని చెప్పాలి. అయినా అద్దె ఇళ్ళల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు, కనీస అవసరాలు ఉండవు. ఏదో నాలుగు గోడలు , కిటికీలు పెడతారు. వారి గుమ్మాలు అంతంత మాత్రమే. మేకు కొడితే కింద పడిపోతాయి అన్నట్లు ఉంటాయి.
ఏంటో అదే అపార్ట్‌మెంట్స్ అయితే అద్దెకి ఇచ్చేవాళ్ళు ఫర్నిష్డ్ చేసి ఇస్తారు. అమ్మా.. అద్దెకు ఉండేవారు ఎంతో హాయిగా ఉండాలి అంటారు. రెంట్ విషయంలో కూడా దేనికదే బిల్లు. ఏ విధమైన ఆంక్షలు ఉండవు. ఒక్కటే మాట ఏది అయినా రిపేర్ వస్తే వాళ్ళిచ్చిన అడ్వాన్స్‌తో ఆ పని చేయించి వెళ్ళమంటారు. అది వాళ్ళ పద్ధతి. అంతేగాని ఇల్లు అద్దెకి ఇచ్చాము కదా, ఇంటిలోకి రోజూ వచ్చి... అలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకున్నారు, మా ఇంటిని శుభ్రంగా ఉంచడంలేదు, బాత్‌రూమ్ సింక్‌ల దగ్గరనుంచి టైల్స్ వరకూ అన్నికూడా ఎంతో క్లీన్‌గా ఉంచాలంటారు. వాళ్ళ ప్రాణాలన్నీ ఆ ఇంటి వాటా మీదనే ఉంటాయి. అలా ఉంది, ఇలా ఉంది అని వంక లేని రోజు ఉండదు. నీళ్ళు వెయ్యాలన్నా ఇంటివాళ్ళు ఎంతో బాధపడిపోతారు. వాళ్ళ బంగారం ఏదో దోచుకుపోతున్నట్లు ఫీల్ అవుతారు. ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు. ఏడవకూడదు. అరవకూడదు. ఇది వారి రూల్సు. మనం ఏదైనా అంటే ఇంతే సంగతులు. అయితే కొందరు ఇంటిమీద డబ్బు పెడితే లక్షల ఖర్చు అనీ, అదే వడ్డీలకు తిప్పితే బంగారం లాంటి ఇల్లు అద్దెకు వస్తుందనే అభిప్రాయంతో కొంతమంది ఇల్లు అద్దెకు ఉండటానికి ఇష్టం చూపిస్తున్నారు. అందుకే అద్దె ఇల్లు ప్రహసనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో నష్టాలు కష్టాలు ఉంటాయి.
( ఆంధ్రభూమి నుండి)

1 comment:

  1. ఈ ఓనర్లు ఉన్నారే.. వారిగురించి ఒక పుస్తకమే రాయవచ్చు.. హైదరాబాద్ కొత్తగా వచినప్పుడు ఒకరి ఇంట్లో సింగిల్ రూం రెంట్ కి తీసుకున్నాను.. ఆంటీ చాల బాగామట్లాడుతుంది ఆమెని చూసి మంచి ఇంట్లో రూం దొరికింది అని సంతోష పడ్డాము కాని అది ఎన్ని రోజులు లేదు..
    వారికి ఒక పాప బాబు ఉన్నారు.. వాళ్ళు చదువు తున్నారు.. అంకుల్ జాబ్ చేస్తారు.. వాళ్ళు మార్నింగ్ నైన్ కి వెళ్ళిపోతారు.. రూమ్ కి వచ్చిన కొత్తలో ఏమి తెలియదు గా. రోజు మార్నింగ్ నైన్ కి పవర్ పోయేది ఏమో పవర్ కట్ ఏమో అనుకున్నాము.. నేను టెన్ కి బయటకు వెళ్ళేవాడిని.. అలా వెళ్తూ పక్క ఇంట్లో మోటార్స్ నడుస్తూ కనిపించేది టీవీ సౌండ్స్ వినిపించేవి మొదటిలో అంతగా తెలియలేదు ఆ తరువాత ఒకరోజు రూమ్ లోనే ఉండి పోయాను.. రోజులాగే పవర్ పోయింది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్న ఆంటీ ని అడిగా ఏమిటి ఇలా పవర్ పోయింది అని ఏమో బాబు తెలియదు అని చెప్పింది.. మధ్యానం పన్నేడుకు వచ్చింది అబ్బ ఇంత సేపు పవర్ కట్ ఏమిటి అనుకున్నాను.. మళ్ళి ఒన్ కి పవర్ పోయింది అబ్బ ఇది ఏమిటి నరకం రా బాబు అనుకోని బయటకు వచ్చాను.. అప్పుడు వాళ్ళ పాప బాబు స్కూల్ వెళ్తున్నారు మధ్యానం లంచ్ కి హోం కి వచ్చారు.. అప్పుడు మ్యాటర్ అర్ధం అయింది.. పక్క ఇంట్లో వెళ్లి అడిగాను పవర్ ఉందా అని వాళ్ళు చెప్పారు ఉందీ బాబు అని మార్నింగ్ నుచి ఉందా లేక ఇప్పుడే వచ్చిందా అని వాళ్ళు చెప్పారు బాబు ఇది హైదరాబాద్ సమ్మర్ లోనే పవర్ కట్ ఉండదు ఇప్పుడు పవర్ కట్ ఏమిటి అని నవ్వారు.. వెళ్లి ఆంటీ ని అడిగాను పవర్ పక్క ఇంట్లో ఉండి మన ఇంట్లో లేదు అని చెప్పను ఏమో అంది ఆ తరువాత తెలిసింది ఏమిటి అంటే ఆకుల్ పాప బాబు వెళ్ళగానే మెయిన్ ఆఫ్ చేసి మళ్ళి మద్యానం ఆన్ చేస్తుంది వాళ్ళు వెళ్ళగానే మళ్ళి ఆఫ్ చేసి సాయంత్రం ఆన్ చేశేది.. ఆ విషయం మరుసటి రోజు అర్ధం అయింది.. ఆ రోజు సాయంత్రం ఆకుల్ రాగానే చెప్పాము ఏమిటి ఎలా ఎందుకు చేస్తున్నారు అని.. అవునా అని లోపలి వెళ్ళాడు ఏమి జరిగిందో తెలియదు.. తరువాత బయటకు వెళ్ళిపోయాడు ఆ తరువాత తెలిసింది అకుల్ ఆంటి ముందు పిల్లి అని.. హ హ హ.. మరుసటి రోజు ఆంటీ తో గొడవ పెట్టుకున్నాం.. నెల రెంట్ కట్టి పోర్టీన్ డేస్ ఉండి కాలి చేసి హాస్టల్ కి వెళ్ళిపోయాను.. అక్కడ కొన్ని రోజులు ఉండి తిండి పడక బయటకు వచ్చా.. ఇంకో రూమ్ తీసుకున్న అక్కడ వారి గురించి మళ్ళి చెప్పుతాను..

    ReplyDelete