షాపింగ్ టిప్స్
రోజూ దినపత్రికల్లో సూచించే మార్కెట్ ధరలను మీరువెళ్లే  సూపర్‌మార్కెట్‌ల ధరలతో పోల్చుకుంటే వ్యత్యాసం తెలిసిపోతుంది. మిగతా  సూపర్‌మార్కెట్ ధరలను కూడా ఒకసారి పరిశీలిస్తే తెలివైన నిర్ణయం  తీసుకోవచ్చు. ఈ మాత్రం అవగాహనతో భవిష్యత్తులో జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
చాలా  వరకు సూపర్‌మార్కెట్‌లో వినియోగదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా కావల్సిన  సౌకర్యాలను ఏర్పాటుచేస్తారు. ఎ.సి. సంగీతం. మ్యాగజైన్లు, జ్యూస్‌సెంటర్,  స్నాక్స్ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కతోవకు పట్టిస్తాయి.
ఒక  పక్క మ్యూజిక్ వింటూ స్నాక్స్ నములుతూ వస్తువుల ధరలను అంతగా  పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువువైపే  కేంద్రీదకరించండి.
వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి  మార్కెట్‌కి వెళ్లండి. వారిని తోడు తీసుకువెళితే వాళ్ల అవసరాలే ఎక్కువగా  ఉంటాయి. చాక్లెట్లు, ఐస్‌క్రీం, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచీ పెడుతూనే  ఉంటారు.
ప్రొడక్ట్ ఉన్నచోట లైటింగ్ అమరిక భారీగా ఉంటుంది. ఆ  వెలుతురు కారణంగా ఒక్కోసారి ధరలు సరిగా కనిపించకపోవచ్చు. కానీ దానిని అలా  వదిలేయకుండా నిశితంగా పరిశీలించి చూడాలి. అర్ధం కాకపోతే  షాపువారిని అడిగి  తెలుసుకోవాలి. షాపు దర్పం చూసి మొహమాటపడితే నష్ట పోయేది మీరే.
కొన్ని  వస్తువులపై ఫ్రీ ఆఫర్ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొను గోలు  చేస్తారు. ఆ వస్తువు అప్పటికీి అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి.
ఇంకొద్ది సమయంలో క్యాష్‌కౌంటర్‌క్  వెళ్తాం అనుకున్నప్పుడు ఒకసారి బాస్కెట్‌లో ఉన్న సామాగ్రిని చెక్ చేయండి.
కొన్ని  వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగతుంది.  వీటికారణంగా చివరకు బిల్ ఎక్కువవుతుంది. కాబట్టి కొనేముందు ఒక్కసారి  ఆలోచించాలి.
మీరు తీసుకున్న వస్తువులకు మ్యానువల్ బిల్  ఉండదు. ప్రతీది స్కాన్ చేసి బిల్‌చేసే విధానం ఇప్పుడు అంతటా అమలులో ఉంది  కాబట్టి స్కానర్ ఇచ్నిన బిల్ కరెక్ట్‌గా ఉందో లేదో తిరిగి చెక్ చేయండి  షాపింగ్‌లో ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం.(సూర్య దినపత్రిక నుండి )
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment