Showing posts with label Business. Show all posts
Showing posts with label Business. Show all posts

Thursday, October 3, 2013

రేపట్నుంచి 2జి నెట్ రేట్లను పెంచిన ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ 2జి నెలవారీ ప్యాక్ ల ధరలను రేపట్నుంచి భారీగా పెంచనుంది. Rs.125/- గా ఉన్న 1 జిబి ప్యాక్ ధర Rs.155/- గా, Rs.198/- గా ఉన్న అన్ లిమిటెడ్ ప్యాక్ ధర Rs.256/- గా పెంచనుంది. మిగతా రేట్ల వివరాలు :
Rs.16/- ---80MB ( 3Days)
Rs.25/- --- 125MB ( 5 days)
Rs.75/- --- 300MB (15 days)
Rs.198 --- 2GB ( 30 days)

స్మార్ట్ ఫోన్ కష్టమర్లు 3జి ఎక్కువగా ఉపయోగించేలా చేయడానికే ఈ ధర పెంచబోతున్నదని భావించవచ్చు.

Friday, April 19, 2013

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంచబ్యాంకు

ప్రపంచంలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ. 65(1.25 అమెరికన్ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2 బిలియన్) మందిని నిరుపేదలుగా ఇది పరిగణనలోకి తీసుకుంది. వారిలో మూడో వంతు అంటే దాదాపు 40 కోట్ల మంది భారతీయులే ఉండటం గమనార్హం. పేదలు, నిరుపేదలు ఎక్కడున్నారనే ప్రాంతాలవారీ గణాంకాల ఆధారంగా రూపొందించిన ప్రపంచ అభివృద్ధి సూచికల ప్రకారం... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుపేదల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.

1981లో ప్రపంచ నిరుపేదల్లో సగం మంది ఇక్కడే ఉండగా, అది 2010 నాటికి 21 శాతానికి తగ్గింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా మాత్రం 59 శాతం పెరిగింది. అయితే గురువారం ప్రపంచబ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం 120 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడో వంతు కన్నా ఎక్కువ మంది ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని ప్రపంచబ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడు, ఆర్థికవేత్త కౌశిక్ బసు వెల్లడించారు. ఆఫ్రికా ఉప సహారా ప్రాంతంలో అత్యంత పేదరికం స్థాయి 1999తో పోలిస్తే 2010 నాటికి పది పాయింట్లు తగ్గి, 48 శాతం ఉంది. ప్రపంచం మొత్తం మీద పేదల సంఖ్య క్రమేపీ తగ్గుతుంటే ఒక్క ఈ ప్రాంతంలో మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. 

సాక్షి దినపత్రిక నుండి 

Tuesday, June 12, 2012

భారత్, చైనాల్లో ఆర్థిక వృద్ధిరేటు మందగమన సంకేతాలు: ఓఈసీడీ


ప్రపంచంలోనే జోరైన వృద్ధిరేటును కనబరుస్తున్న భారత్, చైనాల్లో మందగమనం సంకేతాలు వెలుగుచూస్తున్నాయని పారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) పేర్కొంది. మరోపక్క, జపాన్, అమెరికా, రష్యాల్లో ఆర్థిక వృద్ధిరేటు మెరుగవుతోందని తెలిపింది. ఒక దేశ ఆర్థిక కార్యకలాపాల్లో టర్నింగ్ పాయింట్‌లకు తొలి సంకేతంగా భావించే కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్‌ఐ) ఆధారంగా గుర్తించిన తాజా గణాంకాల ప్రకారం ఓఈసీడీ ఈ వివరాలను వెల్లడించింది.

భారత్, చైనాల దీర్ఘకాలిక ఆర్థిక కార్యకలాపాల ధోరణి సీఎల్‌ఐ పాయింట్ ప్రకారం మార్చి తర్వాత తగ్గుముఖం పట్టిందని వివరించింది. భారత్ సీఎల్‌ఐ మార్చిలో 98.2 కాగా, ఏప్రిల్‌లో ఇది 98కి తగ్గింది. అదేవిధంగా చైనా సీఎల్‌ఐ మార్చిలో 99.4గా నమోదైంది. ఏప్రిల్‌లో 99.1కి తగ్గింది. గతేడాది భారత్ వృద్ధిరేటు తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఓఈసీడీ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.