ప్రపంచంలోనే జోరైన వృద్ధిరేటును కనబరుస్తున్న భారత్, చైనాల్లో మందగమనం సంకేతాలు వెలుగుచూస్తున్నాయని పారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) పేర్కొంది. మరోపక్క, జపాన్, అమెరికా, రష్యాల్లో ఆర్థిక వృద్ధిరేటు మెరుగవుతోందని తెలిపింది. ఒక దేశ ఆర్థిక కార్యకలాపాల్లో టర్నింగ్ పాయింట్‌లకు తొలి సంకేతంగా భావించే కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్‌ఐ) ఆధారంగా గుర్తించిన తాజా గణాంకాల ప్రకారం ఓఈసీడీ ఈ వివరాలను వెల్లడించింది.
భారత్, చైనాల దీర్ఘకాలిక ఆర్థిక కార్యకలాపాల ధోరణి సీఎల్‌ఐ పాయింట్ ప్రకారం మార్చి తర్వాత తగ్గుముఖం పట్టిందని వివరించింది. భారత్ సీఎల్‌ఐ మార్చిలో 98.2 కాగా, ఏప్రిల్‌లో ఇది 98కి తగ్గింది. అదేవిధంగా చైనా సీఎల్‌ఐ మార్చిలో 99.4గా నమోదైంది. ఏప్రిల్‌లో 99.1కి తగ్గింది. గతేడాది భారత్ వృద్ధిరేటు తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఓఈసీడీ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
No comments:
Post a Comment