రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శత్రువులూ ఉండరనేది నిజం! ఇది మరోసారి ఋజువు కాబోతోంది. నిన్న మొన్నటి వరకూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న పక్షాలు ఒకటి కాబోతున్నాయి.. ఇది రాష్ట్ర రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
డిల్లీలో చంద్రబాబు బీజేపీ నేతలను కలవడంవెనక చాలా మంత్రాంగం నడిచిందని చంద్రబాబు భవిష్య రాజకీయ అవసరం దృష్ట్యా బీజేపీతో కలవడం తప్పదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మోడీ వ్యాఖ్యలు, మోడీపై తెదేపా అగ్ర నాయకుల ప్రశంసలు భవిష్యత్ లో NDA తో మరలా కలిసినడిచేందుకు ఎప్పటినుంచో బాబు ఆడుతున్న వ్యాహంగా తేలుతుంది. జగన్ ను బయటికి రాకుండా కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపిన విషయం కూడా నిజమేనని పరిశీలకులు అంటున్నారు. ఇంతకాలం జగన్ జైలు నుంచి బయటికి రాకపోవడానికి చంద్రబాబు కారణమేనని, బాబు తమతో చేతులు కలుపుతాడని ఆశించి కాంగ్రెస్ ఆయనచెప్పినట్లు నడచుకుందనీ కానీఇప్పుడు కాంగ్రెస్ బాబు రాబోయే ఎన్నికల అనంతరం తమతో చేతులు కలపడని తెలిసి జగన్ ను బయటికి రాకుండా ఆపలేమని బాబుకు చెప్పినట్లు పొగట్టా .. జగన్ ఎలాగో బయటికి వస్తాడుకనుక తను ఇక కాంగ్రెస్ కు మద్దతు పలికే అవసరంలేదని బాబు భావించినట్లు చెపుతున్నారు.
అలాగే తెలంగాణా ఇచ్చిన సందర్భంలోనూ కాంగ్రెస్ బాబునే ఇరకాటంలో పెట్టదలచిందని ఈ విషయాన్ని ఆయన గమనించే రెండు ప్రాంతాల్లో పార్టీ దెబ్బతినకుండా కాపాడుకోగలిగారనీ ఇకపై తెలుగుదేశం మరింత పుంజుకోవడం ఖాయమని తెలుగుదేశంతోపాటూ , కాంగ్రెస్ కూడా భావించిందని తెలుస్తోంది. తెలుగుదేశాన్ని దెబ్బకొట్టలంటే అది జగన్ తోనే సాధ్యమని ,ఎలాగో జగన్ ఎన్నికల తర్వాత తమకే సపోర్ట్ చేస్తాడు కనుక అతన్ని బయటికి తీసుకువచ్చే సమయం ఇదేనని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి క్రొత్తపార్టీ పెడతారనే ఊహాగానాలు సోనియాను కలవరపెడుతున్నాయని చెపుతున్నారు. అటు తెలంగాణలో కేసీయార్ , ఇటు సీమాంధ్రలో జగన్ తనకు ప్రస్తుతానికి చాలునని ఆదిశగానే అడుగులు వేయాలని సోనియా ఇప్పటికే పార్టీ పరిశీలకులకు స్పష్టంచేసినట్లు ఉహాగానాలు వస్తున్నాయి. తెలంగాణాపై వెనకడుగు వెయ్యకూడదని , అలాచేస్తే తెదేపా కే లాభమని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది
ఇటు YSRCP కూడా చంద్రబాబును బూచిగా చూపి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. జగన్ బయటికి వస్తున్నారన్న సమాచారం కాంగ్రెస్ నుండి వచ్చిందని కనుక కాంగ్రెస్ పై మెతక వైఖరితో ఉండాలని YSRCP నాయకులకు ఇప్పటికే సందేశాలు వెళ్ళాయని కొందరు భావిస్తున్నారు. మొన్న ఆ పార్టీ సమావేశంలో జగన్ ఓదార్పు యాత్రకు కూడా రోడ్ మ్యాప్ చేసారని, ఇటీవల సాక్షి పత్రిక , చానల్ లో తెదేపా,బీజేపీలనే దుమోత్తిపోస్తున్నారని వారు ఉదాహరణలు చూపుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు YSRCP పచ్చజెండా ఊపినట్లేనని విమర్శకులు చెపుతున్నారు.
మరి ఈ రాజకీయ క్రీడలలో చివరకు ఎవరు విజేతలో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

No comments:
Post a Comment