Saturday, September 28, 2013

' గాన కోకిల ' @ 85

గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం. బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జన్మదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
దాదాపు ఏడు దశాబ్దాలపాటు హిందీ సినీపరిశ్రమలో గాయనిగా లతామంగేష్కర్‌ వెలుగొందుతున్నారు. 1929, సెప్టెంబరు 28న జన్మించిన ఈ గానకోకిల.. 1942 నుంచి సినీ కళా ప్రయాణం ఆరంభమైంది. 'మహల్' అనే చిత్రంలో 'ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా' అనే పాటతో తన గానాన్ని వినిపించారు. ఆమెను ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ పిలిచేవారు. దాదాపు 36 భాషల్లో వెయ్యికు పైగా సినిమాలకు ఆమె  ఆలపించారు. క్లాసికల్‌ నుంచి రొమాంటిక్‌ వరకు, గజల్స్‌ నుంచి భజనల వరకు అన్ని రకాల గేయాలు ఆమె ఆలపించి సరికొత్త రికార్డును సృష్టించారు.
ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం 'భారతరత్న' పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీపాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన సినిమా పాటలు పాడారు.

No comments:

Post a Comment