Sunday, September 22, 2013

100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు...




సౌత్ ఇండియా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేత తలపెట్టిన 100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు చెన్నై లోని నెహ్రు ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను నిన్న జయలలిత ప్రారంభించారు. ఒక్కోరోజు ఒక్కోభాషకు  పండుగలా పండుగలా కేటాయించగా మొదటిరోజు తమిళ చలనచిత్ర పండుగ జరిగింది . 
అసలు 3.5.2013 నాటికే  భారత చలనచిత్రరంగం పుట్టి 100 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తొలిసినిమా ఇప్పుడే మొగ్గవేసింది. అప్పట్లో ఆ మొగ్గ... పెరిగి ఇంత పెద్ద పుష్పంగా మారి.. తుమ్మెదలను ఆస్వాదించే తీయదనాన్ని ఇస్తుందని ఆనాడు ఎవ్వరూ ఊహించి ఉండరు. అమెరికాలో ఫీచర్‌ ఫిల్ములు తయారైన 1912లోనే మన దేశంలోనూ తొలి కథాచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ నూరేళ్ళ కాలగతిలో 1,268 మూకీలు, వివిధ భాషల్లో దాదాపు 44 వేల టాకీల అనుభవం భారతీయ సినిమా ఘనచరిత్ర. ఇవాళ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, ఖండాంతరాలు దాటిన అతి పెద్ద ప్రేక్షక వర్గమూ మనదే! హాలీవుడ్‌ చిత్రాలకు సైతం మనది.
 సినిమా పుట్టుపూర్వోత్తరాలను కాసేపు గుర్తుచేసుకుందాం....
లూయీ లూమియర్‌ సోదరులు : మొట్టమొదటి సినిమా నిర్మాతలు లూయీ లూమియర్‌, ఆగస్ట్‌ లూమియర్‌ సోదరులు. 1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శన జరిగింది. అంతవరకు నిశ్చలనంగా ఉన్న బొమ్మలు మొట్టమొదటిసారిగా తెరపై కదలనారం భించాయి. 1903లో ప్రపంచంలో తొలి మూకీకథా చిత్రంగా ఎడ్విన్‌ పోర్టర్‌ అనే నిర్మాత కదిలే మూకీ బొమ్మలకి ఒక కథ అల్లి.. 'ది గ్రేట్‌ ట్రయిన్‌ రోబరి' అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు. భారతదేశంలో బొంబాయిలోని వాట్సన్‌ హోటల్‌లో 1896, జులై 7వ తేదీన లూమియర్‌ బ్రదర్స్‌ నిర్మించిన సజీవ సినామాటోగ్రాఫ్‌ చిత్రాలు 'ఎంట్రీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫ్‌, అరైవల్‌ ఆఫ్‌ ట్రయిన్‌- చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. బొంబాయితో పాటుగా కలకత్తాలోని స్టార్‌ థియేటర్‌లో కూడా ఈ ప్రదర్శనలు వేయడంతో భారత చలనచిత్ర చరిత్ర సినీ ప్రస్థానానికి బాటలు వేయడం జరిగింది. అప్పట్లో అరైవల్‌ ఆఫ్‌ ట్రయిన్‌- చిత్రం ప్రదర్శిస్తుంటే.. రైలు మీదుగా వస్తున్నందని జనాలంతా పారిపోయేవారట. వారికి నచ్చజెప్పి మళ్ళీ తీసుకురావడానికి చాలా సమయం పట్టేది.
భారతీయ కథతో భారతీయ సంస్కృతితో నిజమైన తొలి భారతీయ సినిమాగా, ఆయన నిర్మించిన తొలి మూకీ కథా చిత్రం 'రాజా హరిశ్చంద్ర'. 1913 మే 3న బొంబాయిలోని కారొనేషన్‌ సినిమాటోగ్రాఫ్‌ థియేటర్‌లో విడుదలైంది. భారతీయ సినిమాకు శాశ్వత చిరునామా యిచ్చి చరిత్రకెక్కిన కళాకోవిదుడు దాదాసాహెబ్‌ ఫాల్కే. ఆయన తదంతరం సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఆయన పేరుమీద అవార్డులు ఇవ్వడం ఆరంభించారు.
1927 అక్టోబర్‌ 6న 'ది జాబ్‌ సింగర్‌' అనే శబ్ద చిత్రం వచ్చింది. వార్నర్‌ బ్రదర్స్‌, న్యూయార్క్‌లో ప్రదర్శించబడ్డ ఈ చిత్రంలో తొలిసారిగా తెరమీద నుంచి మాటలు విని నివ్వెరపడి, ఆనందపడి, హర్షధ్వానాలతో సినిమా ప్రకియకు స్వాగతం పలికారు.
ఆ రోజుల్లోనే బొంబాయికి చెందిన అబ్దులలీ యూసఫలీ సినీ ప్రదర్శకుడిగా ముఖ్యపాత్ర పోషించారు. ఓ డేరాలో సంచార సినీ ప్రదర్శనల్ని ప్రారంభించారు. ఎక్కడికిపడితే అక్కడకు మోసుకుపోగల తన బయోస్కోప్‌ సామగ్రితో ఇతర దేశాలకూ వెళ్ళారు. చివరకు 1908లో భారత్‌కు వచ్చి, ఇక్కడా సంచార సినీ ప్రదర్శనలిచ్చారు. ఆట వస్తువు లాంటి బయోస్కోప్‌ను పరిశ్రమస్థాయికి తెచ్చారు.

దక్షిణ భారతావనికి వస్తే, కోయంబత్తూరుకు చెందిన రైల్వే ఉద్యోగి సామి విన్సెంట్‌ సినిమా మీద ప్రేమతో ఉద్యోగాన్ని కూడా వదిలేసి, 1905 నుంచి దక్షిణాదిన ఊరూరా తిరుగుతూ చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే, మద్రాసు ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడ్డ తెలుగుబిడ్డ రఘుపతి వెంకయ్యనాయుడు విదేశాల నుంచి సామగ్రి తెప్పించి, 1909-12 మధ్యలో ప్రముఖ సినీ ప్రదర్శకుడిగా ఎదిగారు. విదేశాలకూ తన ప్రదర్శనలను విస్తరించారు.  

కళా రూపంగా సినిమా ఆవిర్భవించిన ఆ ఆరంభ దినాల్లో ఇప్పటిలాగా ప్రదర్శనలకు లైసెన్సు తీసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే, విద్యుచ్ఛక్తితో కూడా పని లేదు. మెగ్నీషియమ్‌ దీపాల సాయంతో ఫిల్మును తెరపై చూపేవారు. ఈ సినీ ప్రదర్శనలు, వాటికన్నా ముందే దేశంలోకొచ్చిన గ్రామ్‌ఫోన్‌, ముద్రణాలయ వసతులు కలసి కొత్త పరిణామానికి దోహదపడ్డాయి. సాంప్రదాయ భారత సమాజంలో మార్పు వచ్చింది. ఈ ప్రదర్శనలకు క్రమంతప్పక వచ్చే ప్రేక్షక వర్గం తయారైంది.
     1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో లూమియర్‌ బ్రదర్స్‌ ఏర్పాటు చేసిన సినిమా టోగ్రఫీ తొలి ప్రదర్శన అయితే తెలుగులో నాగార్జున నటించిన గ్రీకువీరుడు చిత్రం నేపథ్యం కూడా పారిస్‌ కావడం విశేషం. అప్పటి తరం మిగలక పోయినా... వారు పండిం చిన పంటను ఆస్వాదించ డానికి మరిన్ని తరాలు ఇటువంటి సినిమా ఉత్సవాలను చేసుకుంటూనే ఉంటాయి.

No comments:

Post a Comment