రాస్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సీయం కూడా తరచూ ప్రతిఘటించడం, జగన్ దీక్ష నేపధ్యంలో కాంగ్రెస్ ఒక మెట్టు దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర కేంద్రమంత్రులూ రాజీనామాలకు సిద్దమవడంతో అటు బీజేపీ వైఖరిలోనూ మార్పు వస్తే తాము అవమాన పడడం ఖాయం అని కాంగ్రెస్ గ్రహించింది. కనుక తెలంగాణా విభజన ఖాయమన్న తమ అభిప్రాయం ఎలాగూ స్పష్టం చేసాము కనుక ప్రస్తుతం వివిధ పార్టీలు తమ తమ ఎజెండాలౌ, క్రొత్త రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్యాకేజిలు, జలాల పంపిణీ వంటి సమస్యలపై తమ అభిప్రాయాలు,సూచనలతో ముందుకు రావాలని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్న ప్రకటనను కాంగ్రెస్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ద్వారా అటు తెలంగాణా వాదులనూ నొప్పించకుండా, సీమాంధ్ర పార్టీలను డిఫెన్స్ లో పడేయవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
అటు సీయం క్రొత్తపార్టీ పెట్టబోతున్నారన్న పుకార్లూ ఊపందుకోవడం కాంగ్రెస్ ను కలవర పెడుతున్నాయి. సీయంకు లొంగకుండా కనీసం జగన్ కు పేరురావాలని కాంగ్రెస్ ఆశిస్తుందని కొన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర స్థాయిలో జగన్ దీక్ష విరమించాలని , అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని ప్రకటించబోతున్నారని అనుకుంటున్నారు.
మరి ఈ ప్రకటన ఎలా చేస్తారో, దీని పర్యవసానాలు ఏమిటో వేచిచూడాలి!

No comments:
Post a Comment