Saturday, August 31, 2013

హైదరాబాద్ ఉద్యోగుల్లో విభజన విద్వేషాలు

 తెలంగాణ ప్రకటన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సీమాంధ్ర, తెలంగాణా సంఘాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ విధ్వేషాలు పెంచుకుంటున్నారు. ఇంతకాలం సోదరులుగా కలిసి పనిచేస్తూ ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ మెలిగిన వీరిమధ్య విద్వేషాలు మొదలయ్యాయి. వీటికి కారణం ఖచ్చితంగా రాష్ట్రాన్ని వేరుచేయడం మాత్రం కాదు. ఎందుకంటే ఆనాడు సకలజనులసమ్మె, ఇతర తెలణ్గాణా ఉధ్యమాలలో తెలంగాణా ఉద్యోగులకు జరిగినప్పుడూ సీమాంధ్ర ఉద్యోగులు ఏమాత్రం చలించలేదు. తెలంగాణా ప్రకటనలో అస్పష్టత,వివిధ రాజకీయ నాయకుల అసంబద్ద వ్యాఖ్యలూ ఇరుపక్షాలవారినీ రెచ్చగొడుతున్నాయి. చివరికి ప్రభుత్వం కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడం ,సీయం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసమో తెలీడంలేదు.
తెలణ్గాణా, సీమాంధ్ర ఉద్యోగుల్లో పూర్తి విభేదాలు స్రుష్టించి వారిని కలిసి పనిచేయకుండా చేస్తే తెలంగాణా ఏర్పాటు మరింత సులభమౌతుందని ఇలా కొందరు ప్రవర్తిస్తున్నారని ఓ భావన కూడా ఉంది. ఏది ఏమైనా కేంద్రప్రభుత్వం ఆలశ్యం చేయకుండా తగు చర్యలు తీసుకోకుంటే ఇంకొన్ని కీలక విభాగాల్లోనూ విభజన సెగలు రగిలి రాష్ట్రం రావణకాష్టంగా మారబోతుందనడంలో సందేహం లేదు.

1 comment:

  1. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కారణాలతో సమ్మె చేయకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది!civil service neutralityని పాటించాలి!outsourcing ప్రపంచవ్యాప్తంగా నేలకొంటున్నరోజుల్లో శాశ్వత ఉద్యోగిబృందం ఎందుకు అనే ప్రశ్న వైపు ఈ సమ్మెలు ఆలోచింపజేస్తాయి!

    ReplyDelete