Thursday, July 5, 2012

క్షమించు నేస్తం!

క్షమించు నేస్తం!
తప్పు నాది కాదు -
ఎప్పుడో వెళ్ళిపోయిన రైలుబండికి
ఇప్పుడు టికెట్ అడుగుతున్నావు నువ్వు!
అయినా పట్టాలలా పడి వుండాలనుకుంటున్నావు!
రైలుతో నువ్వు సాగేదెలా ?
అప్పటికీ నువ్వు లేచి కదుల్తావేమోనని
సిగ్నల్ లైటు గిలగిలా కొట్టుకుంది
మరి లాభంలేక నీరసించి యిప్పుడే ఆరిపోయింది.
గమనించావో లేదో,
మనం మనుష్యులం.
హమేషా కాలంతో ముందుకు సాగటం
మన కవష్యం!
రేపటి హిస్టరీలోకి నీ పేరు కావాలనంటే
ఏదో ఓ తంటా పడి యిరికించేద్దును
కానీ గజనీ మహమ్మదుతోనో
బహమనీ సుల్తానులతోనో
యుద్ధానికి రమ్మంటే -
నేనేమై పోవాలి ?

Source : http://venkatmails.com/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%82/

No comments:

Post a Comment