Saturday, November 2, 2013

చీకటి వెలుగుల రంగేళీ..దీపావళి

'చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి'...అని తెలుగు సినిమా కవి రాసింది. ఆనంద ఉత్సహాలతో జాతి, కుల, మత, వర్గ విబేధాలను విస్మరించి,సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల 'దీపావళి'. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని పురాణాలు చెబుతుంటాయి. అశ్వయుజ మాసంలో ఈ పండుగ వస్తుంది. మొదటి రోజు నరకచతుర్దశి, రెండో రోజు దీపావళి అమవాస్య, మూడోది బలి పౌడ్యమి అని జరుపుకుంటుంటారు. దీపావళి పండుగను ఎందుకు జరుపుకొంటారు అనడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలో రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని ప్రచారం ఉంది. దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమ్మోస్తుతే అగ్ని కాంతిని, తేజస్సునీ, రక్షణనీ, ఆరోగ్యాన్నీ, ధైర్యాన్నీ అందిస్తుందని, దోషాలను తొలగిస్తుందని పండితులు చెబుతుంటారు. దీపావళి పర్వదినంలో దీపం పెట్టడం, లక్ష్మీదేవిని పూజించడం చేస్తుంటారు. దీపావళి పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్ లో దీపావళి రోజున శివ సహితముంగా కాళీ పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పండుగ నాడు అమావాస్య చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, మతాబులు కాల్చి పండుగను జరుపుకుంటుంటారు. ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఇంటిని దీపాలతో అలంకరిస్తుంటారు. కొందరు లక్ష్మీ పూజను చేస్తారు. 
Source: Prajasaksti 

No comments:

Post a Comment