Friday, November 22, 2013

[ॐ] ఓంకారం అంటే?

 “ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం;’. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఉదాహరణకు బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్న;;ప్పటికి ఆప్యాయంగా ఆ బిడ్దను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవత్తముర్తులు, మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతున్నారు.
హిందూ ధర్మంలో చాలా కీలకమైన అంశం ఓంకారం. కాబట్టి ఆదిలోనే దానినందిస్తున్నాము. ఓంకారమంటే బ్రహ్మవిద్య.
ఓం అనే పదాన్ని తీసుకుంటే, ఇది ఒక పదమా ? లేక అక్షరమా ? లేక వాక్యమా ? భాషలో అచ్చులు, హల్లులు కలిసి ఉంటాయి. కొన్ని హల్లులు అచ్చులు కలిసి అర్థాన్ని ఇవ్వగలిగితే పదం అని అంటాం. 'గోవు' ఇది కొన్ని అక్షరాల కలయిక,ఆ కలయిక ద్వారా ఒక అర్థాన్ని ఇవ్వగల శక్తి దానిలో ఏర్పడింది, కనుక పదం అని అంటాం. అలానే కొన్ని పదములు కలిసి మన సంశయాలను తీర్చగలిగినట్లుగా అర్థం ఇవ్వగలిగితే దాన్ని వాక్యం అని అంటాం. 'గోవు పాలు ఇచ్చును' ఇలా కొన్ని వాక్యాలు కలిసి మనకు గోవు ఏమి చేస్తుంది అనే సంశయాన్ని తీర్చి, ఒక అర్థాన్ని ఇస్తుంది కనక అది ఒక వాక్యం అని అంటాం. 'ఓం' అనేది అక్షరమా ? 'ఓం ఇత్యేకాక్షరం' అంటుంది వేదం. అంటే ఓం అనేది ఒక అక్షరం. భగవద్గీతలో భగవానుడు 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామ్ అనుస్మరన్'  అని చెబుతాడు. ఓం అనేది ఒక అక్షరం, ఇది బ్రహ్మ, ఇది వేదం.  ఏం చెబుతుంది అది ? 'మామ్ అనుస్మరన్' నన్ను తలవాలి అని చెప్పాడు. ఇది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వ గలదు కనక దీన్ని ఒక పదం అని కూడా అనవచ్చు. ఇది కొన్ని అక్షరముల కూర్పు కూడా. అవి 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు. ఈ మూడు అక్షరాలు కలిసి ఒక పదం అయ్యింది. మామూలుగా కొన్ని అక్షరాలు కలిసి పదం అయ్యి ఒక అర్థాన్ని ఇస్తాయి, కానీ ఒక్కో అక్షరాన్ని విడదీస్తే ఏమి అర్థాన్ని ఇవ్వవు. ఇక్కడ ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి విడి విడి అర్థాన్ని ఇవ్వగలవు. అట్లా అకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, ఉకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు, మకారం స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలదు. కనుక ఇవి మూడు పదాలు అని కూడా చెప్పవచ్చు. ఇలా మూడు పదాలు కలిసిన ఓంకారం ఒక స్వతంత్ర అర్థాన్ని ఇవ్వగలదు, మన సంశయాలను తీర్చగలదు కనక వాక్యం అని చెప్పవచ్చు. అందుకే ఓంకారాన్ని ఒక అక్షరం అని చెప్పవచ్చు, ఒక పదం అని చెప్పవచ్చు లేదా ఒక వాక్యం అని చెప్పవచ్చు. ఓంకారంలో ఉన్న 'అ','ఉ' మరియూ 'మ్' అనే అక్షరాలు ఒక్కోటి ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి, పదంగా ఏం అర్థాన్ని ఇస్తాయో తెలుసుకోవాలి అట్లా వాక్యంగా కలిసి ఏం అర్థాన్ని ఇస్తాయో కూడా తెలుసుకోవాలి.  
  ‘అసలు మంత్రం అంటే ఏమిటి?’ అన్న సందేహం కొంత మందికి కలుగవచ్చు.
మననాత్ త్రాయతే
ఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ౠషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.
‘ఐం’, ‘శ్రీం’, ‘హ్రీం’, ‘క్లీం’ అనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతములైన మహా మంత్రాలవుతున్నాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రంలక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు.  క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి ‘ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలు ‘యజస్సులూ.
ఇక అన్ని మంత్రాలకు ముందు ‘ఓం’ కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే ‘ఓం’ కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవశరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ‘ఓంకారం’.  ‘ఓం’ నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ౠగ్వేదంనుండి ‘ఆకారం, యజుర్వేదం నుండి ‘ఊకారం, సామవేదం నుండి ‘మాకారం కలసి ‘ఓంకారం’ ఏర్పడిందని ౠషివాక్కు.
సకలవేదరూపం ఓంకారం.”

No comments:

Post a Comment