సౌతిండియా నెం.1 హీరో, దక్షిణభారత దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.. అతనే శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్ సూపర్‌స్టార్ రజనీకాంత్. ఈరోజు ఆయన పుట్టినరోజు. 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63 వ ఏట అడుగుపెడుతున్న ఆయన జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇలాంటి తేదీ (12-12-12) వచ్చేది ఈ ఒక్కరోజే కాబట్టి. ఈ ప్రత్యేక తేదీని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఈ వేడుకలను స్పెషల్ గా నిర్వహిస్తున్నారు.
ఆయన జీవితం చూస్తే సినిమా కష్టాలు అంటాం కాని అంతకంటే ఎక్కువగానే ఓ విజయవంతమైన సినిమాకు సరిపడే చరిత్ర రజనీకి ఉంది. అయిదేళ్ల వయసులోనే ఆయన తల్లిని పొగొట్టుకున్నారు. తిండికి నానా పాట్లు పడుతూ ప్రభుత్వ పాఠశాలలో కన్నడ మీడియంలో చదువుకున్నారు. తరువాత జీవన సమరంలో అనేక కష్టాలు పడ్డారు. మూటలుమోసే కూలిగా పనిచేశారు. ఆ తరువాత బస్ కండక్టర్‌గా పనిచేశారు.రజనీకాంత్ మొదట పాపులర్ కన్నడ నాటకాల రచయిత, దర్శకులు టోపి మునియప్ప వద్ద నటనలో శిక్షణపొందారు. ఆయన నాటకాల్లో పలు పాత్రల్లో నటించారు. 1973లో ఆయనతో కలిసి నాటకాలు చేసిన రాజ్ బహదూర్ అనే స్నేహితుడు రజనీకాంత్‌ను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణపొందాలని సూచించారు. దీంతో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్‌కు రెండు సంవత్సరాల పాటు అవసరమైన ఆర్థిక సహాయం కూడా రాజ్‌బహదూర్ చేశాడు. ఒకసారి రజనీకాంత్ నాటక ప్రదర్శనను ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ చూశారు. అనంతరం రజనీ నటనకు మెచ్చుకొని తమిళం నేర్చుకోవాలని సూచించారు. తమిళం నేర్చుకున్న అనంతరమే ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
సినిమాల్లోకి...
1975లో విడుదలైన అపూర్వ రాగాంగల్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు రజనీకాంత్. ఈ సినిమా ఆయనకు నేషనల్ ఫిల్మ్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కె.బాలచందర్ దర్శకత్వం వహించారు. క్రమక్రమంగా ఆయన తమిళ సినీ రగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆతర్వాత ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించారు. బాలీవుడ్‌లో సైతం హిట్ సినిమాలతో తనదైన ముద్ర వేశారు. 2007లో విడుదలైన శివాజీ చిత్రంలో నటించినందుకు గాను ఆయనకు 26 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించడం విశేషం. దీంతో ఆసియాలో హీరో జాకీ ఛాన్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న రెండవ హీరో అయ్యారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా కూడా చేశారు. ఇక ఇటీవల విడుదలైన రోబో చిత్రం రజనీకి ఎంతో పాపులారిటీ తీసుకువచ్చింది. చంద్రముఖి, భాషా, శివాజీ వంటి సూపర్ హిట్ చిత్రాలు రజనీకాంత్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.
అవార్డులు...
పాపులర్ హీరో రజనీకాంత్‌కు 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డు దక్కింది. 1984లో రజనీకాంత్‌కు నల్లవనుకు నల్లవన్ అనే తమిళచిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ తమిళ్ యాక్టర్ అవార్డు వచ్చింది. మూంద్రు ముగమ్, ముత్తు, పదయప్ప, చంద్రముఖి, శివాజీ చిత్రాల్లో నటనకు గాను ఆయనకు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. 1984లో కలైమమాని అవార్డు, 1989లో ఎంజిఆర్ అవార్డులు దక్కాయి. 1995లో సౌతిండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయనకు కలైచెలవమ్ అవారును అందజేసి ఘనంగా సత్కరించింది. ఇవేగాకుండా పలు అవార్డులెన్నో ఆయన్ని వరించాయి.
కుటుంబ నేపథ్యం...
సూపర్‌స్టార్ రజనీకాంత్ 1950 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన బెంగళూర్‌లో జన్మించారు. ఆయన మహరాష్ట్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాంభాయ్, రామోజీరావు గైక్వాడ్‌లు. వారి సంతానంలో చిన్నవాడు రజనీకాంత్. ఇద్దరు అన్నలు, ఒక అక్క ఆయనకు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఐదు సంవత్సరాల వయసులో తల్లి మృతిచెందడంతో రజనీకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమ యంలో వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమైంది. చివరికి చిన్నతనంలోనే రజనీకాంత్ చిన్న,చిన్న ఉద్యోగాలె న్నింటోనో చేశారు. కూలీగా సైతం పనిచేశారు. ఆయన బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాలలో చదువుకున్నారు. రామ కృష్ణ మిషన్ విద్యా సంస్థలలో ఉన్నతవిద్యను అభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1966 నుంచి 1973 వరకు బెంగళూర్, చెనై్న నగరాల్లో పలుచోట్ల పనిచేశారు. కొంతకాలం బెంగళూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో బస్ కండ క్టర్‌గా సైతం పనిచేశారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చిన అనంతరం 1981లో మన రాష్ర్టంలోని తిరుపతిలో లతా రంగచారి అనే యువతిని 31 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1981 సం వత్సరం ఫిబ్రవరి 26న జరిగింది. వారికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య వివాహం తమిళ హీరో ధనుష్‌తో జరుగగా, సౌందర్య వివాహం పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో జరిగింది.

No comments:
Post a Comment