Sunday, October 29, 2023

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి తెదేపా దూరం

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెదేపా నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ములాఖత్‌ సందర్భంగా రాజమహేంద్రవరం జైలులో ఆయన్ను తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కలిశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో తెలంగాణ నేతలకు వివరించాలని కాసానికి ఆయన సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని తెలంగాణ నేతలకు ఆ పార్టీ సీనియర్‌ నేతలు వివరిస్తున్నారు.

No comments:

Post a Comment