ఆదాయపు
పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లో సినీ, టివి ఆర్టిస్టుల ఇళ్ళ ఫై కొరడా
జులిపించారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుండి అర్థ రాత్రి వరకూ మొత్తం 12 బృందాలు
వారి ఇళ్ళ ఫై ఈ దాడులు నిర్వహించాయి. హాస్య నటుడు బ్రహ్మానందం, గాయని
సునీత, గీతా మాధురి, టి వి ఆర్టిస్టులు ఓంకార్, ఉదయ భాను, ఝాన్సీ,సుమ ల
ఇళ్ళ ఫై ఏక కాలంలో 40 మంది అధికారులు దాడులు నిర్వహించారు.
వీరి ఆదాయానికి తగినట్లుగా పన్ను కట్టలేదనే కారణంగా వీరి ఇళ్ళ ఫై దాడులు
నిర్వహించినట్లుగా సమాచారం. ఈ సినీ ప్రముఖుల ఆదాయానికి సంభందించిన
వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు అధికారులు సేకరించినట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, శ్రీ నగర కాలనీ, మోతీ నగర్ ప్రాంతాల్లో
హైదరాబాద్ ఫిలిం సర్కిల్ కమీషనర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
తన ఇంట్లో దాడులు నిర్వహిస్తున్న సమయంలో బ్రహ్మానందం షూటింగ్ లో ఉన్నట్లు
తెలిసింది. అలాగే ఝాన్సీ, సుమ లు కూడా వారి ఇళ్లలో దాడులు నిర్వహించే
సమయంలో వారి ఇళ్లలో లేరు. ఈ దాడులకు సంభందించిన పూర్తి వివరాలు
అందించేందుకు అధికారులు నిరాకరించారు. ఐతే, త్వరలో అన్ని వివరాలు
అందిస్తామని మాత్రం వారు ప్రకటించారు.
No comments:
Post a Comment