Wednesday, October 26, 2011

TV9 మెరుగైన సమాజం కోసమేనా? - నాచేదు అనుభవం

సాక్షిలో TV9 పై ప్రసారమైన ఓ కార్యక్రమం మొన్న చూసాను... దానిలో TV9లో ప్రసారమైన కధనాలు, దాని అవాస్తవాలు చెప్పారు..అప్పుడే నాకు TV9పై విపరీతమైన కోపం కలిగింది.. వెంటనే TV9 ఆఫీసుకి ఫోన్ (9948290901) చేసాను ..
ఎందుకిలా అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు? అని అడిగాను ఫోన్ ఎత్తిన వ్యక్తి " CBI వాళ్ళు చెప్పిందే వ్రాసాం ..అయినా అన్నీ కరెక్ట్ కావాలని ఏమీ లేదు కదా ? అని ఎదురు ప్రశ్నించాడు
నేను " మెరుగైన సమాజం కోసం అనే కేప్షన్ తీసెయ్ ముందు...వాస్తవాలు చూపాలి కదా ..ఇలా అవాస్తవాలు కళ్ళతో చూసినట్లు చెపితే ఎలా అని వాదించాను.
" వాస్తవాలు త్వరలో బయట పడతాయి ...చూస్తె చూడు లేక పోతే మానెయ్యి " అని ఫోన్ కట్ చేసాడు.

ఎలా పోతోంది మన ఈ జర్నలిజం ... అయినా మన రాష్ట్రానికి ఇన్ని న్యూస్ చానల్స్ అవసరమా ?
 కేవలం డబ్బు సంపాదించడం కోసమే పోటీ తత్వాన్ని పెంచుకొని మేమంటే మేము కరెక్ట్ అని అసత్య వార్తలు ప్రసారం చేసే వీరికి "సమాజోద్దరణ" కేప్శన్ లు అవసరమా ??

9 comments:

  1. I stooped long back to watch TV9. one of my friend had some love issue they ask her to come studio for discussion . she said she can't trust TV9 then they blackmailed like if you won't come we will telecast what ever we want . she said go head do it.
    TV9 and ABN just blackmailed channels .

    ReplyDelete
  2. జర్నలిజమా వీల్లబొందా ? బ్లాక్ మార్కెటింగ్. ,జర్నలిజం అనేపేరుఅడ్డుపెట్టుకుని సంపాదించుకోవటం .

    ReplyDelete
  3. What is that news which you found to be unreal? Send a complaint to the Press Council with the evidence you have.

    ReplyDelete
  4. సాక్షి చూసి మీకు టీవీ9 త‌ప్పువార్త ఇచ్చింద‌ని అనిపించిందా? అవి రెండూ బ‌ద్ధ శత్రువులైన సంస్థలు క‌దా. ఒక వేళ టీవీ9 స‌రైన వార్త ఇచ్చినా సాక్షి దానిని త‌ప్పనే అంటుంది స‌హ‌జంగా. మీరు మ‌రేదైనా క్రెడిబుల్ ఛాన‌ల్‌లో టీవీ9 గురించి వ‌స్తే న‌మ్మొచ్చుగానీ సాక్షిని ఎలా న‌మ్మారు

    ReplyDelete
  5. టీవీ9 త‌ప్పువార్త ఇచ్చింద‌ని సాక్షి చూసి నమ్మారు. అంతతేలిగ్గా నమ్మేసే మీరు
    సాక్షి త‌ప్పువార్త ఇచ్చింద‌ని టీవీ9 చూసి నమ్మాలికదా? లేదా యెవరి ఛానల్ ముందు మీరు చూసారో వాళ్ళే మంచివాళ్ళు అవతలి ఛానల్ దొంగలు అనుకుని ఆవేశపడిపోవడం వివేకమేనా?

    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతనె వేగపడక వివరంపదగున్
    వినికల్ల నిజము తెలిసిన
    మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ

    ఈ సుమతీ శతక పద్యం ఒకప్పుడు అందరికీ నోటికి వచ్చినదే కదా? మీకు తెలియదా? మంచి చెడ్డలు విచారించి ఆలోచించి నిర్ణయించుకోండి. ఊరికే కోపపడిపోతే యెలాగండీ?

    ఒకమాట. వివరింపదగున్ అంటే యిక్కడ వివరము అంటే కన్నం. అంటే రంధ్రాన్వేషణ చేసి చూడమని అర్ధం.

    ReplyDelete
  6. చిన్న సవరణ. మూడవపాదం 'కని కల్ల నిజము తెలిసిన' అని ఉండాలి.

    ReplyDelete
  7. మీరనేది జగన్ ఇంటికి సంభందించిన వార్త ఐతే నేనూ మిమ్మల్నే సమర్ధిస్తాను... సాక్షి చాలెంజ్ చేసినా నోరు మెదపట్లేదు ఆ tv9

    ReplyDelete
  8. సాక్షి చానెల్ ని కూడా చూసే వాళ్ళు ఉన్నారా?అది నీచమైన ప్రస్తుత మీడియాలో అతి నీచమైన చానెల్........ఇక చాలెంజ్ లంటారా తప్పు చేసిన ప్రతివాడు తొడుక్కునే రక్షణ కవచం అది.......

    ReplyDelete