Saturday, February 16, 2013

మాంటిసోరి పాఠశాలలో పాఠాలు చెప్పిన జేడీ లక్ష్మినారాయణ

  
15alp-2-aఅలంపూర్‌, మేజర్‌ న్యూస్‌: అలంపూరులో ఐదవ శక్తిపీఠమైన జోగు ళాంబదేవిని, బాలబ్ర హ్మేశ్వరస్వామిని శుక్ర వారం సీబీసీఐడీ జేడీ లక్ష్మి నారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయాలలో ఆయన ప్రత్యే క పూజలు జరిపించారు. అనంతరం ఆయన స్థానికి మాంటిసోరి ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలోని అడిటోరి యంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. తన విద్యార్థి దశలో గురువుల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలతో మసులుకొనేవారో విద్యార్థులకు తెలిపారు. ప్రతి విద్యార్థి, విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర కృషి చేయాలని అన్నారు.

మాంటిసోరి పాఠశాల మంచి వాతావరణంలో వుంది గనుక విద్యార్థులు కూడా పాఠశాలకు అంత పేరు ప్రఖ్యా తులు తెచ్చిపెట్టాలని విద్యార్థులనుద్దేశించి ప్రసంగిం చారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. తన తల్లి కూడ ఒక టీచరని, ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధా నం ఇచ్చారు. తను జేడి స్థాయికి చేరుకోవడానికి తన తల్లి కారణమని చెప్పారు. చరిత్రలో గొప్పవారి జీవిత చరిత్రలు చదవాలని విద్యార్థుల కు చెప్పారు. మహాత్మాగాంధి, నేతాజి, అంబేద్కరు లాంటి వారి జీవిత చరిత్రలు చదివితే వారు అంత ఉన్నత స్థానానికి ఏ విధంగా చేరుకున్నారో అర్థం అవుతుందని అన్నారు.

No comments:

Post a Comment