కేoద్రం
అనుసరించే విధానాలు గతిహీనతను పొంది, దేశ ఆర్థిక పరిస్థితి మరింత బలహీనమైన
తరుణంలో నూతన సంవత్సరం ప్రవేశించింది. సహజంగానే దేశ ప్రజలు, మనదేశాన్ని
అభిమానించే ఇతర దేశాల ఆకాంక్షలు ఈ దుస్థితిలో నెరవేరుతాయని భావించడం కేవలం
అత్యాశే అవుతుంది. నిజం చెప్పాలంటే మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ,
సాపేక్షంగా శాంతి, బహుళ జాతులు, భిన్న మతాలతో కూడి ఉన్నది. ఇప్పుడే
పురోగామి పథంలో పయనిస్తున్న ఆర్థిక శక్తిగా, అన్ని వేళల్లో నిశిత పరిశీలనకు
గురౌతుంటుంది. ఈ నేపథ్యంలో నిరంతరం చోటుచేసుకునే మార్పుల కారణంగా,
అంతర్జాతీయంగా మనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలి తప్ప, ఎవరో మనకు
అటువంటి అవకాశం కల్పించరు. బలీయమైన ఆర్థిక శక్తిగా, ఇప్పటి వరకు భారత్‌పై
ప్రపంచ దేశాల్లో నెలకొనివున్న అభిప్రాయాన్ని అదే మాదిరి కొనసాగించడానికి
చాలా కష్టపడాలి. ముఖ్యంగా దేశంలోని లక్షలాది మందిని దారిద్య్ర రేఖనుంచి
ఎగువకు తీసుకొచ్చిన దేశంగా, దౌత్య, ఆర్థిక, సైనిక వ్యవహారాల్లో మనదేశం ఎంతో
గొప్ప పేరు సంపాదించుకుంది. అంతేకాదు సైన్యానికి ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం, అన్ని దేశాలు శాంతి,
సామరస్యాలతో మనుగడ సాగించాలన్న సహనశీలతను కలిగివుండటం వంటివి మనదేశ
ప్రతిష్టకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి
చెందిన విధాన నిర్ణేతలు, మీడియా సంస్థలు, ప్రజలు.. తరచుగా ప్రజాస్వామ్య
ప్రాధాన్యతల ఒత్తిడికి తేలిగ్గా లొంగిపోతూ.. అంతర్జాతీయ స్థాయి లో విస్తృత
ప్రాతిపదికన మనదేశం నిర్వహించాల్సిన పాత్రపై పెరుగుతున్న డిమాండ్‌ను
మరచిపోతుండటమే విషాదం. దాతృత్వం, సంస్కరణలు స్వదేశంనుంచే ప్రారంభ కావాలి.
కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యవస్థలో తీవ్ర పోటీ నెలకొన్న
తరుణంలో నిష్క్రియాపరత్వం, ఉదాశీనత వంటి లక్షణాలు, మనదేశానికున్న వాస్తవ
శక్తిని బయల్పడనీయకుండా ఒక పరిధిలోనే ఉండేలా చేస్తాయి.
అంతర్జాతీయ వ్యవహారాల్లో మనదేశం మరింత విస్తృతంగా పాలు పంచుకోకుండా
ప్రధానంగా అడ్డుపడుతున్నవి.. మనలో నెలకొన్ని ఉష్టప్రక్షి-నమ్మకాలు మాత్రమే.
మన సమస్యలు ప్రధానంగా అంతర్గతమైనవని, ముందుగా వాటిని పరిష్కరించుకున్న
తర్వాత మాత్రమే మనం సూపర్‌పవర్‌ల స్థాయిలోకి ప్రవేశించగలుగుతామన్న గట్టి
నమ్మకం మనలో నరనరానా వ్యాపించి ఉంది. విదేశీ సహకారంకోసం అడుగు
ముందుకేయడానికి పూర్వం మనం ముఖ్యంగా దేశీయంగా నెలకొని ఉన్న దైన్య
పరిస్థితులపై ముందుగా దృష్టి కేంద్రీకరించాలన్న వాదనలు మనకు తరచుగా
వినవస్తుంటాయి. అంతేకాదు అంతర్గతంగా కొనసాగుతున్న మతహింస, మావోయిస్టులు,
వేర్పాటు వాదులతో కొనసాగుతున్న సాయుధ సంఘర్షణలను అణచివేయడంలో ప్రత్యేక
దృష్టిపెట్టి..అన్ని పరిస్థితులను చక్కదిద్దుకున్న తర్వాత మాత్రమే,
ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో శాంతి పరిరక్షణకోసం సంసిద్ధతను వ్యక్తం
చేయాలనేది ఆయా వాదనల సారాశం. మనం దిగుమతి చేసుకున్న ఇటువంటి హ్రస్వదృష్టితో
కూడిన ఆలోచనలు ( వీటినే కాంతి బాజ్‌పేయి..అట్టడుగున ఉన్న విదేశాంగా విధానం
అని పేర్కొన్నారు) ప్రపంచ దేశాల్లో, నిర్వహించాల్సిన కార్యకలాపాల్లో
పాల్గొనకుండా చేస్తున్నాయి. అంతేకాదు ఈ తరహా ఆలోచనా విధానాలు, మనదేశానికి
చెందిన యువత విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో తమ
కెరీర్‌ను కొనసాగించడానికి పెద్ద ఆటంకంగా మారాయ. ఫలితంగా ప్రపంచ పాలనా
వ్యవస్థలో భారత్ తన సంభావ్య శక్తిని ప్రదర్శించలేకపోతున్నది. దీనివల్ల మనం
ఎంతసేపూ బాహ్య వాతావరణం నుంచి స్వీకరించే విధానంలోనే మిగిలిపోతాం. ఇవన్నీ
మనదేశం అంతర్జాతీయంగా మరింత శక్తివంతంగా, పలుకుబడి కలిగిన దేశంగా
రూపొందాలన్న లక్ష్యసాధనకు పెద్ద ఆటంకంగా పరిణమిస్తున్నాయి.ప్రపంచ దేశాల్లో వ్యవహరించే సమయంలో భారత్‌కు ఎప్పటికప్పుడు సృజనాత్మక ఆలోచనలు, పార్శ్వ ప్రవేశ మార్గాలు లేపోతే, మనకై మనమే అంతర్జాతీయ సమాజంలో వేలెత్తి చూపించుకునే విధంగా తీసుకునే స్థిర నిర్ణయాల ఉచ్చులో పడిపోతాం. ఫలితంగా అంతర్జాతీయ వ్యవస్థలో మనం వివక్షకు గురికావడమే కాకుండా, నెలకొన్న పరిస్థితిలో స్వల్ప మార్పులను మాత్రమే చేయగలిగే స్థితిలో ఉంటాం. మనదేశ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రముఖుడితో..అంతర్జాతీయ వ్యవహారాల్లో మన పాత్రను చురుగ్గా నిర్వహించలేకపోవడం, ముఖ్యంగా యుద్ధాలు తదితర ప్రపంచ సమస్యలు,ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అనైతిక సంస్థలను ఎత్తేయడం వంటి అంశాల్లో భారత్ ఎందుకని ప్రపంచ వేదికలపై చురుగ్గా మనగలగ పోతున్ననదంటూ ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఒక్కటే. ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినా లేదా అంతర్జాతీ సమస్యలో తలదూర్చినా..్భరత్ తన పరిమితులను తాను ఎల్లవేళలా గుర్తెరిగి ప్రవర్తించక తప్పదు. అంతేకాదు సమూల మార్పులకోసం పోరాడే సమయంలో అత్యంత జాగరూకత కూడా అవసరం. మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా, ఆశలు ఆంకాక్షలు గరిష్ఠ స్థాయిలో ఉండే మనదేశం, సిగ్గు బిడియం, ఓటమిభయం వంటి వాటికి దూరంగా ఉంటూ, ప్రపంచంలో మార్పులు తీసుకొచ్చేందుకు ముందుకు దూసుకొని వెళ్ళే మనస్తత్వాన్ని కలిగివుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధైర్యంగా తీసుకునే వివేచనతో కూడిన దూకుడు నిర్ణయాల ద్వారానే అది సాధ్యం మరి!
కానీ అంతర్జాతీయ వ్యవహారాల్లో మన దేశపు ఉద్యోగస్వామ్యం.. ఒక నిబంధనను రూపొందించేవారుగా కంటే..నిబంధనను స్వీకరించేవారుగానే ఉండటానికి ఇష్టపడతారనేది సత్యం. అసలు మనదేశానికి రాజకీయపరంగా స్ఫూర్తిదాయకమైన నాయకత్వం లేదన్న సంగతిపై ఎంతమందికి అవగాహన ఉన్నది? ఇదే సమయంలో అంతర్జాతీయ వేదికలపై తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించలేకపోతున్నదన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజానికి ఈ రెండు అవస్థలు ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగివున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూకు మాత్రమే సంపూర్ణ అంతర్జాతీయ అవగాహనతోపాటు, తన నాయకత్వ పటిమతో దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని అతిశక్తివంతమైన లక్ష్యం వైపునకు నడిపించగలిగే మనం అటువంటి గొప్ప నాయకులకోసం వేచిచూసేదానికంటే.. ప్రపంచ శాంతి, భద్రత కోసం కృషిచేస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను..సమానత్వం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికన అత్యద్భుత రీతిలో మలచగల.. భారత సమాజంలోని సైద్ధాంతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను సక్రియాత్మకం చేయడం ఉత్తమం.
అంతర్జాతీయ రాజకీయాల్లో ‘ఆర్థికేతర’, ‘సైనికేతర’..‘ఉదార శక్తి’గా పేరున్న మనదేశం..కేవలం ఆకర్షణీయమైన సాంస్కృతిక (చలన చిత్రాలు, నాటకాలు, సంగీతం) కళలు లేదా విజ్ఞాన (వ్యవసాయం, పురావస్తువులు, యోగ, కామసూత్ర, ఆయుర్వేద) రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా, భౌగోళికంగా మనకు సుదూర ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో నెలకొని ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా, భారత అనే్వషణ మమేకం కాగలగాలి. అమెరికాకు చెందిన రాజకీయ శాస్తవ్రేత్త ఒకరు...అగ్రరాజ్యమంటే..‘అసాధారణ సామర్ధ్యం’ కలిగి..తనకు పొరుగున లేక సమీపంలో కాకుండా సుదూర ప్రాంతాల్లోని దేశాల విదేశాంగ విధానాలను కూడా అనుశీలనం చేయగల సామర్ధాన్ని కలిగివుండాలి,’ అని నిర్వచించారు. మరి మనదేశం అటువంటి అసాధారణ సామర్ధ్యాలను పెంచుకోవడానికి కాని, సాపేక్షంగా బలహీన విదేశాంగవిధానం కలిగిన దేశాల వ్యవహారాల్లో తలదూర్చడానికి కాని ఏవిధమైన ప్రయత్నాలు చేయడం లేదు! అంతేకాదు ఉపఖండ స్థాయికంటే కొద్దిగా ఎక్కువ స్థాయి అయిన ప్రాంతీయ స్థాయి నాయకత్వ పరిమాణానికి కూడా వృద్ధి చెందాలన్న ఆలోచనలో లేదు. మరి అంతర్జాతీయ స్థాయిలో చైనాతో పోటీ పడాలని భావిస్తున్న మనదేశం అనుసరిస్తున్న సంకుచిత ఆలోచనా విధానం దేశాన్ని అడు గు ముందుకు వేయనీయడంలేదు.
వాస్తవిక ఆలోచనా దృక్పథంతో, కార్యకలాపాలను చేపట్టడం, ఆర్థిక, మానవ వనరులను కొద్దిగా విస్తరించడం ద్వారా భారత్ తనలోని ఉదారశక్తిని మరింత విస్తరింపజేయగలదనేది నిష్టుర సత్యం. మనం ‘అమెరికన్ సీడ్ కార్ప్స్’కు స్థానిక బీజాలను నాటడం ద్వారా.. గణితశాస్త్రం, సైన్స్ వంటి రంగాల్లో..్భరతీయుల ఆలోచనా సరళిని ప్రపంచ దేశాల్లో ప్రశంసాపాత్రం చేయవచ్చు. అంతేకాదు మనం అంతర్జాతీయ వైద్య దళాలను ఏర్పాటు చేసి, యుద్ధాలు జరిగే ప్రదేశాలకు, ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలకు, సంఘర్షణలు ముగిసిన ప్రదేశాలకు పంపవచ్చు. క్యూబా వీటిని సమర్ధవంతంగా నిర్వహించింది. శ్రామిక జీవులతో కూడిన ఉత్పాదక సంఘాలను ఏర్పాటు చేసి..విదేశాలకు వలస వెళ్ళే కార్మికులకు ఉత్తమ జీవితం లభించే విధంగా ఆయా దేశాలతో బేరసారాలు నడుపవచ్చు. మనం 24 గంటలూ ప్రసారమయ్యే ప్రపంచ వార్తలు ఛానళ్ళను (ఆంగ్ల భాషలో) ఏర్పాటు చేయాలి. చైనాకు చెందిన ‘సిసిటివి’, రష్యాకు చెందిన ‘ఆర్‌టి’ల మాదిరిగా ఇవి ఉండాలి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాల్లో దేశాల్లో భారతీయ పత్రికలు ప్రాంతీయ ఎడిషన్లు ప్రచురించేలా చేయవచ్చు. చైనా డైలీ, దక్షిణాఫ్రికాలో ప్రత్యేకంగా ఒక ఎడిషన్‌ను ప్రారంభించిన విధంగా. అదేవిధంగా గాంధీ శాంతి సంఘాలను, యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతాలకు పంపడం..అక్కడి విభిన్న జాతు లు మధ్య మళ్ళీ సంబంధాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకునేలా చేయడం వం టి కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఈవిధంగా సాంస్కృతిక, ప్రభుత్వ దౌత్యవ్యవహారాలు.. మనకు ఒక బ్రాండ్ విలువను, ప్రతిష్టను పెంచేవిధంగా ఎంతగానో తోడ్పడతాయి. వీటితోపాటు భారత్ సామాజిక దౌత్యాన్ని కూడా చేపట్టవచ్చు. తద్వారా మన దేశ ప్రజల్లోని సమస్యల పరిష్కార సామర్ధ్యాన్ని, సుదూర దేశాల్లోని ప్రజలు ఆమోదించి, సంఘీభావాన్ని ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. 2013లో భారత్ అటువంటి చర్యల ద్వారా అంతర్జాతీయ సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
- శ్రీరాం చౌలియా
No comments:
Post a Comment