సమంత
 ‘ఏం మాయ చేసిం’దో ఏమో కానీ.. టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో ఇప్పుడు ఆమె 
కొంగుపట్టుకుని తిరుగుతున్నాడట. ఈ విషయాన్ని సమంతయే స్వయంగా బటయపెట్టింది. 
తమ ప్రేమ విషయం పెద్దలకు కూడా తెలుసని, తమ పెళ్లికి వాళ్లు కూడా గ్రీన్ 
సిగ్నల్ ఇచ్చారని, ఇక పప్పన్నం పెట్టించడమే లేటని చెప్పుకొచ్చింది సమంత. 
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని, అప్పుడు విభిన్నమైన పాత్రలు 
ఎంచుకుంటానని సమంత చెబుతోంది. తనకి కాబోయే భర్తది చాలా మంచి మనసని, ఆపదలో 
ఉన్నవారికి సహాయం చేస్తాడని... అతనిలో ఉన్న ఆ మంచి గుణం తనకి బాగా 
నచ్చిందంటోంది. నాగచైతన్యతో కెరీర్ స్టార్ట్ చేసిన సమంత... ప్రస్తుతం 
నితిన్‌తో నటిస్తోంది. తనతో పనిచేసిన యువ కథానాయకుడినే ప్రేమపెళ్లి 
చేసుకుంటానని సమంత చెబుతుండడంతో... ఆ యంగ్ హీరో ఎవరయి ఉంటారు? అంటూ 
టాలీవుడ్ సినీ జనాలు గుసగుసలాడుతున్నారు.
No comments:
Post a Comment