Sunday, June 16, 2013

ప్రత్యేక రాష్టమ్రా? ప్యాకేజీనా?

తెలంగాణపై కేంద్రంలో కదలిక మొదలయింది. ప్రత్యేక రాష్టమ్రా? ప్యాకేజీనా అనే తర్జనభర్జన పై సూత్రపాయ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూర్ఖాలాండ్‌ తరహాలో అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి, దానికి 25 వేల కోట్ల రూపాయలు కేటాయించి, వాటి ఖర్చు-కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే బోర్డుకు ఊపిరిపోయనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు వల్ల లాభనష్టాలు పార్టీ కోణంలో చర్చించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ చివరకు శాంతిభద్రతల కోణంలోనే నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. కర్నూలు- అనంతతో కలిపి రాయల్‌ తెలంగాణపై చర్చ జరిగినా ప్యాకేజీలపైనే ఎక్కువమంది మొగ్గుచూపినట్లు సమాచారం. తెలంగాణను తేల్చివేయాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది.

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ-సీమాంధ్ర నేతలు చాలాకాలం నుంచి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మగిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశం తీర్మానించగా, దానిని అహ్మద్‌పటేల్‌ కూడా ధృవీకరించడం గమనార్హం. దీన్నిబట్టి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణనా? లేక ప్యాకేజీతో కూడిన అభివృద్ధిమండలా? అన్నదానిపై సీరియస్‌గానే చర్చించా రు. ఆ సందర్భంగా తెలంగాణ ఇస్తే తెలంగాణలోని అన్ని పార్లమెంటు సీట్లు సాధిస్తామని టీ కాంగ్రెస్‌ నేతలు భరోసా ఇస్తున్న వైనాన్ని ఆజాద్‌ సమావేశంలో మరోసారి నొక్కిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుందని సీమా ంధ్ర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనాన్నీ ఆయన సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఈక్రమంలోనే శాంతి భద్రతలు-తెలంగాణకు ముడిపెడుతూ కోర్‌కమిటీ సభ్యు లు ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. 

చిన్న రాష్ట్రాలవల్ల శాంతిభద్రతల సమస్య ఏస్థాయిలో వస్తుందో ఇటీవల చత్తీస్‌గఢ్‌ ఘటన చూశామని, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత సహా ఎంతమందిని పోగోట్టుకున్నామో గుర్తించాలని సూచించారు. అయితే, అదే సమయంలో తెలంగాణలో పార్టీ అభివృద్ధి, ఎన్నికల్లో గెలుపు కూడా ముఖ్యమయినం దున, ఆ కోణంలో అందరికీ ప్రయోజనకరంగా ఉండే నిర్ణ యం తీసుకోవాలని మరికొందరు సూచించారు. సీమాం ధ్రలో జగన్‌ హవాతో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం తెలంగాణ ప్రకటిస్తే తెలంగాణలో 15 సీట్లు ఖా యంగా వస్తాయని టీ వాదులు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చర్చ సందర్భంగానే పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్‌ తరహా అభివృద్ధి మండలి, ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చింది. 25 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, దానిపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ, అను మతి లేకుండా కేటాయింపు-ఖర్చు చేసుకునే వెసులు బాటు ఇవ్వాలని మెజారిటీ సభ్యులు సూచించగా, సోని యాగాంధీ కూడా దానిని సూత్రప్రాయంగా ఆమోదించి నట్లు సమాచారం. 

దానికి సంబంధించి రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలపై చర్చించారు. ఆ ప్రకారంగా.. 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు ఇవ్వాలని కేసీఆర్‌ స్వయంగా చెబుతుండటంతో 2014 వరకూ తెలంగాణ రాదన్న నిర్ధరణకు తెలంగాణ ప్రజలు మానసికంగా వచ్చినందున, అప్పటివరకూ అభివృద్ధి మీద దృష్టి సారిస్తే ఎన్నికల్లో అభివృద్ధి అంశం మీద ప్రచారం చేసే వెసులు బాటు ఉంటుందని విశ్లేషించారు. దానికితోడు తెలంగాణను రాజకీయ పార్టీలు వాడుకుంటు న్నాయని, అందులో భాగంగానే బందులు, ఆందోళనలు నిర్వహిస్తున్నారన్న అంచనాకు ప్రజలు వచ్చారని, అందుకే వాటికి దూరంగా ఉంటున్నారని మరో సభ్యుడు విశ్లేషిం చారు. ప్యాకేజీని ఒక్క తెలంగాణకే పరిమితం చేయకుం డా.. వెనుకబడిన జిల్లాలకూ ఇచ్చినట్టయితే వెనుకబడిన ప్రాంతాలకు కాంగ్రెస్‌ న్యాయం చేస్తుందన్న సంకేతా లివ్వవచ్చని సూచించారు. ఆప్రకారంగా సీమలో కర్నూ లు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, కోస్తాలో గుంటూరు లేదా ప్రకాశం జిల్లాలో ఒకటి ఎంపిక చేస్తే సరిపోతుందని సూచి ంచగా, మెజారిటీ సభ్యులు దానిపై మొగ్గుచూపినట్లు తెలు స్తోంది. 

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నం దున అవి ముగిసినతర్వాత ప్యాకేజీ అంశంపై చర్చించాల ని ఆజాద్‌ సూచించగా, కోర్‌ కమిటీ అందుకు ఆమోదిం చింది. అంతకుముందు తెలంగాణతోపాటు రాయలసీమ లోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల్‌ తెలంగాణ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరి గింది. దానికి కొందరు సభ్యులు మొగ్గుచూపినా, మెజా రిటీ సభ్యులు వ్యతిరేకించారు. తెలంగాణ అంశానికి ప్యాకే జీ సూత్రమే పరిష్కారమని కోర్‌ కమటీ నిర్ణయించినం దున, మరోసారి రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల తో అఖిలపక్షం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచించగా, మిగిలిన సభ్యులు దానిని ఆమోదిం చినట్లు తెలిసింది. అయితే, మరికొందరు మాత్రం దానికి రాష్ట్ర పార్టీలు ఏ మేరకు అంగీకరిస్తారన్నది సందేహమని అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. 
Fram: Surya 

1 comment:

  1. ప్యాకేజీపప్పులు తెలంగాణాలో ఇక ఉడకవు!ప్రత్యేకరాష్ట్రమొక్కటే తెలంగాణా ప్రజలను సంతృప్తి పరచగలదు!1969 ప్రత్యేకతెలంగాణా ఉద్యమమప్పుడే ప్రత్యేక తెలంగాణాను ప్రకటించక ఇందిరా గాంధీ రాజకీయంగా మర్రి చెన్నారెడ్డి ని manage చేసి పెద్దతప్పిదం చేసింది జయ ఆంధ్ర ఉద్యమం చెలరేగినప్పుడయినా తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఉండవలసింది!అప్పుడూనిమ్మకు నీరెత్తినట్లు చప్పుడు చేయకుండా మిన్నకున్నారు!చాపకింద నీరులా తెలంగాణా సమస్య పల్లెపల్లెలో నూక్ అండ్ కార్నర్ లో wildfire లా పాకిపోయినతర్వాత కేంద్రప్రభుత్వం చిదంబరంద్వారా డిక్లేర్ చేయించికూడా మళ్ళీ వెనకడుగు వేసింది!వెయ్యిమంది ప్రత్యేక తెలంగాణా కోసం ప్రాణాలర్పించిన తర్వాత కూడా కేంద్రానికి కనువిప్పు కలుగలేదు!ఇప్పుడు ప్రాణం మీదికి తెచ్చుకుంది!2014లో సాధారణ ఎన్నికలలో ఈవిధంగా దుందుడుకు విధానాలతో తెలంగాణా ప్రజలను ఎంతమాత్రం మెప్పించలేదు!

    ReplyDelete