Tuesday, January 31, 2012

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టీమ్ చేతిలో వైట్‌వాష్ అయ్యింది. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే, ఆసిస్ గతంలో భారత జట్టును వైట్‌వాష్ చేసిన ఏడాదే నేను జన్మించాను. నా బర్త్ డే ఇప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం బాధే కదా! -రాహుల్ బోస్

ఇరాక్‌లో ఏ అమెరికన్ సైనికుడూ లేడు. బిన్‌లాడెన్ ప్రమాదం లేదు, గడాఫీ కూడా అంతమయ్యాడు. ఎన్నో ‘చాలెంజ్’లను అధిగమించిన తర్వాత మా విదేశాంగ విధానాన్ని ‘చేంజ్’ చేసుకొంటున్నాం.
-కండోలిజా రైస్

వదిలించుకోటానికి అత్యంత కష్టమైన వ్యసనం- ప్రేమ. అలా వది లించుకోవటం మరికొన్ని వ్యసనాలకు దారితీయటమే కాదు, కొన్ని హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవ్వచ్చు...
-మహేశ్ భట్

నిజంగానే మీకు మతంపై నమ్మ కం ఉంటే ఎవరినైనా క్షమించగలరు. ఉదారవాదులైతే ఎదుటి వారి విశ్వాసాలను గౌరవించగలరు. అయితే జైపూర్ సమ్మేళనం విషయంలో రెండూ జరగలేదు. ఇందులో అసమర్థ ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది.
-చేతన్ భగత్

పిల్లలను పక్కన పడుకోపెట్టుకోవడం భారతీయ రీతి పెంపకంలో సర్వసాధారణం. అమ్మానాన్నల స్పర్శలోనే చిన్నారికి ప్రేమ రుచి తెలుస్తుంది. ఒక అభివృద్ధి చెందిన దేశం దీన్ని తప్పుగా పేర్కొనటం దురదృష్టకరం.
-సుష్మా స్వరాజ్

జావేద్ నాలుగు సంవత్సరాల క్రితం ఈ అవార్డు పొందారు, ఇప్పు డు మేము మిస్టర్ అండ్ మిసెస్ ‘పద్మభూషణ్’లం. వెల్లువలా వస్తున్న శుభాకాంక్షలకు ధన్యవాదాలు...
-షబానా అజ్మీ

కలలు కనడం ఆగినప్పుడు మన జీవితం ఆగిపోతుంది, నమ్మకం నశించినప్పుడు ఆశలు అంతరిస్తా యి, సంరక్షణ తీసుకోవడం ఆపేసినప్పుడు ప్రేమ నశిస్తుంది, పంచుకోవడం ఆపినప్పుడు స్నేహం అంతమవుతుంది... క్యూట్ కదా... -షేన్ వార్న్

నేను నేతాజీ అని మాట్లాడింది ‘సుభాస్‌చంద్రబోస్’ గురించి... ఈ మధ్యనే తనకు తాను నేతాజీ అనే ట్యాగ్ తగిలించుకొన్న ములాయం సింగ్ యాదవ్ గురించి కాదు..
-ప్రీతిశ్ నంది

( From Sakshi)

No comments:

Post a Comment