Monday, January 16, 2012

ఎర్రజెండా ఎటుపోతోంది ?



ఉనికిని కాపాడుకునే ప్ర యత్నంలో వామపక్షాలు తలమునకలవుతున్నాయి. గతం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ‘వామపక్షాలు కలిసి ఉద్యమిద్దాం’ అని అనేక పర్యాయాలు కోరినా తిప్పికొట్టిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ మధ్య ఉమ్మడి ఉద్యమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కాగా ఆరేళ్లుగా సీపీఐ, సీపీఎంలు గతంలో మాదిరి ఉద్యమాలను నిర్మించలేక పో తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి చేసిన విద్యుత్‌ ఉద్యమం చంద్రబాబు అధికార పీఠాన్ని కుదిపేశాయి. అదేవిధంగా తరువాత చేపట్టిన ముదిగొండ, గంగవరం ఉద్యమాలు కూడా అధికార పక్షాన్ని ముచ్చెమటలు పట్టించాయి. అ యితే వామపక్షాలలో ఇప్పుడా స్పీడు కనిపించడం లేదు. ఇందుకు ప్రజలు సహకరించడం లేదా? లేక వామపక్షాల లో ఉద్యమ స్ఫూర్తి కొరవడిందా? అనే అనుమానాలు సర్వ త్రా వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 2 నుండి ఖమ్మంలో జ రుగనున్న సీపీఎం రాష్ట్ర మహాసభలో ఇటువంటి అనేక అంశాలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. 1997 నుండి సుదీర్ఘ కాలంగా పార్టీ రాష్ర్ట కార్యదర్శిగా కొనసాగుతున్న బీవీ రాఘవులు వచ్చే నెలలో జరగనున్న మహాసభలకు కొనసాగుతారా? లేదా తేలనున్నది. రాఘ వులు సీపీఎం రాష్టక్రార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన నాటి నుం డి పార్టీని దూకుడు మీద నడిపించారు. నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా అనే క ఉద్యమాలకు నాయకత్వం వహించారు. గ్లోబలైజేషన్‌, లిబరలైజేషన్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టారు. అంతే కాకుండా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్‌సన్‌, అమెరికా అధ్యక్షుడు బిల్‌.క్లింటన్‌ తదితర ప్రపంచ ప్రఖ్యా తి గాంచిన నేతలు రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పటుచోట్ల వారిని ఘెరావ్‌ల తో నిరసనసెగలు తగిలేలా చేశారు. ఇక చంద్రబాబు నా యుడు వృత్తిదారులను ఆదుకుంటామంటూ ‘ఆదరణ’ ప థకం ద్వారా పరికరాలను అందించిన సందర్భంలోనూ వి నూత్న రీతిలో నిరసనలు తెలిపారు. పనికిరాని పనిము ట్లను చంద్రబాబు అందజేశారని జిల్లా స్థాయి లో ఎగ్జిబిష న్‌లు ఏర్పాటు చేసి బాబు బండారాన్ని బట్టబయలు చేశా రు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా బడుగు, బలీహ నవర్గాలకు చెందిన ముగ్గురు కార్యకర్తలను కూడా సీపీఎం కోల్పోయింది.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనకు వ్యతిరేకం గా ‘బాబు జమానా.. అవినీతి ఖజానా’ పుస్తకం వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని కూడా సీపీఎం వదిలి పెట్టలేదు. ఎన్నికలలో కాం గ్రెస్‌తో పొత్తుపెట్టుకుని 9మంది ఎమ్మెల్యేలను గెలిపించు కున్నప్పటికీ నాడు అవినీతిపై రాజీపడలేదు. ముదిగొండ, గంగవరం ఘటనలలో పోలీసులు జరిపిన పాశవిక కాల్పులలో సీపీఎం కార్యకర్తలు ప్రాణాల ర్పించారు. ఇప్పు డు అటువంటి పోరాటాలు మచ్చుకైనా కనిపించట్లేదు.

తోక పార్టీల ముద్ర చెరిగేనా?
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వ్యతిరే కంగా ప్రతిపక్ష పార్టీతో కలిసి వామపక్షాలు ఉద్యమిస్తాయ నే విమర్శ ఉంది. అంతేకాదు, మొక్కుబడి విన్యాసాలే తప్ప దీటైైన ఉద్యమాలు నిర్మించుకోపోవడం వామపక్ష పార్టీల్లో ప్రధాన లోపమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు తోపార్టీలు అంటూ ఇతర రాజకీయ పార్టీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోక పార్టీలన్న ముద్రను చెరిపేసుకునేందుకైనా సొంత ఉద్యమాలకు శ్రీకారం చుట్ట పోవడం వామపక్ష పార్టీల్లో ప్రధాన లోపంగా చెబుతు న్నారు. ప్రభుత్వ విధానాలపై నిస్పక్షపాతంగా రాజీలేని పోరాటాలు చేసిన సీపీఎం నేడు ఎందుకు చప్పబడింది?

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టి న నిరసన కార్యక్రమాలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, విద్యు త్‌ చార్జీల పెంపుపైనా నామమాత్రంగా సీపీఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నాలుగు రోడ్ల కూడళ్లలో ఎర్ర జెండాలు పట్టుకుని కార్యకర్తలతో ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టి నినాదాలతో సరిపుచ్చింది. గతంలో మాదిరి జన సమీకరణ చేయడంలో పూర్తిగా విఫలమైందంటు న్నారు. ఆనాటి మిలిటెంట్‌ పోరాటాలు నేడు ఎక్కడా కనిపించడం లేదనే చెప్పవచ్చు. గతంతో పోల్చుకుంటే పార్టీ అనుబంధంగా ఉన్న ప్రజా సంఘాల కార్యకర్తల సం ఖ్య కూడా తగ్గినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సీపీఎం, సీపీఐలు పాలు నీళ్లగా కలిసి పోతాయని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ‘ప్రజా సమస్య లపై ఐక్య ఉద్యమాలు చేస్తాం.. కలిసి వచ్చే లౌకిక ప్రజా తంత్ర శక్తులన్నింటితో కలిసి సమరశీల పోరాటాలు చే స్తాం.. ఉభయ వామపక్ష పార్టీలుగా ీసీపీఐ, సీపీఎం పార్టీ లు సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉద్యమాలను చేయడం ద్వా రా చివరకు ఈ రెండు పార్టీలు విలీనానికి దారితీసా ్తయి’ అని సీపీఐ అగ్రనేత ఎబీ. బర్ధన్‌ ఈ మధ్య పార్టీ జాతీయ సమితి సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ అంశంపై సీపీఐ, సీపీఎంలు చెరో దారి పట్టా యి. సీపీఐ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తూ.. టీఆర్‌ ఎస్‌కు కొమ్ముకాస్తోంది. ఇక సీపీఎం ఆది నుండి చెబుతు న్న విధంగానే సమైక్యాంధ్రకు కట్టుబడి నిలబడింది. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలు భిన్న ధృవాలుగా ఉంటే .. ఏ విధంగా కలిసి పనిచేస్తారనేది ప్రజల్లో సందేహాలు నెల కొంటున్నాయి.

పార్టీ పగ్గాలు మళ్లీ అగ్రవర్ణాలకేనా?
రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి లాంటి కీలక బాధ్యత లను వరుసగా మూడు పర్యాయాల కంటే ఎక్కువగా ఒకే వ్యక్తికి కట్టబెట్టకూడదన్నది సీపీఎం జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయంగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ సారి కూడా మళ్లీ బీవీ రాఘవులుకే సారథ్య బాధ్యతలు అ ప్పగిస్తామని ఖమ్మం జిల్లాలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానిం చినట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేత ఈ సారి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపడతారనే భావన ఉండేది. తమ్మినేని వీరభద్రం ప్రకటనతో దానికి తెరపడినట్లయింది. ఈ విధంగా పార్టీలో ఎంత కాలం ‘కమ్మ’దనాన్ని కొనసాగిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీలో ఒక్క సారైనా బడుగు నేతకు స్థానం కల్పించరా? అనే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.
Courtesy: Suyaa

No comments:

Post a Comment