Tuesday, October 18, 2011

త్వరలో ‘మదర్ థెరిసా’ మెగా సీరియల్

ctober 17th, 2011
శ్రీ మహాగణపతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఓ మెగా డైలీ సీరియల్ ‘మదర్ థెరిసా’కు శ్రీకారం చుట్టారు. మదర్ థెరిసా జీవిత కథ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సీరియల్‌ని నిర్మాత రావుల వెంకటేష్, బి.అశోక్‌రావు దర్శకత్వంలో అందించనున్నారు. మదర్ థెరిసా లాంటి మాతృమూర్తి జీవితం గురించి అందరికీ తెలీదు. 1910లో ఆల్బేనియాలో పుట్టి తన 8వ ఏట తండ్రిని పోగొట్టుకుని పశ్చిమబెంగాల్ ప్రజల కష్టాలను చూసి 1921లో ఇండియాకి ఆపై టీచర్‌గా పనిచేసి, మానవ సేవ చేయడానికి 1931లో ‘నన్’గా రూపాంతరం చెందిన ఆ మాతృమూర్తి జీవితకథను రాయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు. మానవ సేవను తు.చ తప్పకుండా పాటించిన మదర్ థెరిసా జీవిత చరిత్రను ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నాకెంతో గర్వపడుతున్నానని నిర్మాత తెలియజేశారు. మదర్ థెరిసా బాల్యం, పెరిగిన ప్రదేశాలు, మదర్ థెరిసాగా రూపాంతరం చెందడానికి ఆమె పడిన మానసిక సంఘర్షణ, థెరిసా అయ్యాక సేవ చేయడానికి ఎన్ని కష్టాలు పడిందన్నది ఈ డైలీ సీరియల్ తెలుపబోతోంది.

1 comment:

  1. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న !

    she stands on it.

    ReplyDelete