Sunday, October 30, 2011

అనుకున్నదంతా అప్పుడే అయింది - కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

ఇదే బ్లాగులో "నా విశ్లేషణ: ఉప ఎన్నికల ఫలితాలు - పార్టీల భవిష్యత్తు" శీర్షికన ఓ పోస్టును గతంలో ప్రచురించాను.. అదే ఇప్పిడు జరుగుతుంది.
AA

ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, సోమారపు సత్యనారాయణ ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, డీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

నిన్న విద్యార్థిని స్వాతి గొంతు కోసిన ప్రేమోన్మాది నేడు పట్టాలపై శవమై

AA

ఇంజినీరింగ్‌ విద్యార్థిని స్వాతి గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది నజీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హసన్‌పర్తి మండలం కోమటిపల్లి రైల్వేట్రాక్‌పై నజీర్‌ మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. కేయూ సమీపంలోని గోపాలపురానికి చెందిన నజీర్‌ కొంతకాలంగా స్వాతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నజీర్‌ స్వాతి గొంతుకోయడంతో వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి చెందింది.
 అయితే నజీర్‌ను పోలీసులే చంపి, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.

Wednesday, October 26, 2011

TV9 మెరుగైన సమాజం కోసమేనా? - నాచేదు అనుభవం

సాక్షిలో TV9 పై ప్రసారమైన ఓ కార్యక్రమం మొన్న చూసాను... దానిలో TV9లో ప్రసారమైన కధనాలు, దాని అవాస్తవాలు చెప్పారు..అప్పుడే నాకు TV9పై విపరీతమైన కోపం కలిగింది.. వెంటనే TV9 ఆఫీసుకి ఫోన్ (9948290901) చేసాను ..
ఎందుకిలా అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు? అని అడిగాను ఫోన్ ఎత్తిన వ్యక్తి " CBI వాళ్ళు చెప్పిందే వ్రాసాం ..అయినా అన్నీ కరెక్ట్ కావాలని ఏమీ లేదు కదా ? అని ఎదురు ప్రశ్నించాడు
నేను " మెరుగైన సమాజం కోసం అనే కేప్షన్ తీసెయ్ ముందు...వాస్తవాలు చూపాలి కదా ..ఇలా అవాస్తవాలు కళ్ళతో చూసినట్లు చెపితే ఎలా అని వాదించాను.
" వాస్తవాలు త్వరలో బయట పడతాయి ...చూస్తె చూడు లేక పోతే మానెయ్యి " అని ఫోన్ కట్ చేసాడు.

ఎలా పోతోంది మన ఈ జర్నలిజం ... అయినా మన రాష్ట్రానికి ఇన్ని న్యూస్ చానల్స్ అవసరమా ?
 కేవలం డబ్బు సంపాదించడం కోసమే పోటీ తత్వాన్ని పెంచుకొని మేమంటే మేము కరెక్ట్ అని అసత్య వార్తలు ప్రసారం చేసే వీరికి "సమాజోద్దరణ" కేప్శన్ లు అవసరమా ??

Tuesday, October 25, 2011

మంచి గుణాలు పెంపొందించుకోండి!

మన మాటలు ఎంతో మందిని బాధిస్తాయనే విషయాన్ని మర్చిపోయి అవాకులు చెవాకులు పేలుతూంటాం. సరదాకో, పొద్దుపోవడానికో, కాలక్షేపానికో మాట్లాడుకునే మాటల్లో మనకు తెలియకుండానే ఎవరెవరినో నిందిస్తూంటాం. ఏ ఇద్దరు కలిసినా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం సర్వసాధారణమైంది. అయితే ఈ మాటలు ఎవరిని బాధించినా, బాధించకపోయినా ఈ అలవాట్లు వ్యక్తిలోని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయంటున్నారు మానసిక వైద్యులు.
మన మాటలు మనకి సరదాగా ఉండొచ్చు. ఈ అలవాటు ఒక దశ వరకు బాగానే ఉంటుంది. అయితే తర్వాత తర్వాత మనల్ని కూడా ఎవరైనా నిందిస్తారేమోననే ఆలోచన మొదలవుతుంది. దీనితో లోలోపల మధనపడటం మొదలవుతుంది. పరోక్షంగా ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. దీనివల్ల ఎవరో ఒకరికి అనుకూలంగా మాట్లాడే మాటలు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. అప్పుడు మీ వద్ద ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి జంకుతారు. మీ స్వభావం వల్ల మీకు దగ్గరయ్యే వాళ్లు చాలామందే ఉంటారు. ప్రతి దానిని స్పోర్టివ్‌గా తీసుకోవాలి. మనలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి.
అనేక మంది చేసే పనులను వాయిదా వేస్తూంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఉన్నత పదవుల్లో రాణించాలనుకునే వారికి ఇది మరింత సమస్యగా మారుతుంది. ఇలాంటి వాయిదా తత్వం వల్ల సామర్థ్యం లోపిస్తుంది. కాబట్టి చేయాల్సిన ప్రతి అసైన్‌మెంట్‌ని నిర్ణయించుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడం అలవరచుకోవాలి. మీరు చేసే పనిని మీరే ప్రశంసించుకుంటే ఇంకా మెరుగ్గా పని చేయగలుగుతారు. మొదటగా ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన పనిని షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ పోతే తప్పక మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లేకపోతే అందరిలాగానే వెనుకబడిపోతాం. అనుకున్న పనిని నేను చేయగలనని ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే ఆ పనిని పూర్తి బాధ్యతగా చేయగలుగుతాం.
అందరి గుర్తింపు పొందాలని, అతి మొహమాటాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. అలాగని ప్రశంసలని తోసిపుచ్చకూడదు. ఈ రెండింటి పైనా మంచి పట్టు సాధించాలి. కొన్నిసార్లు ప్రశంసలు విలువలు పెంచుతాయనే విషయాన్ని మరువకూడదు. ఎవరు పొగిడినా చిన్న థాంక్స్‌తో సరిపెట్టండి. అతి ఊహించుకుని, నేను తప్ప ఈ పని చేయగలిగిన వారెవరూ లేరనుకుంటే అది పొరపాటు. ఆరోగ్యకరమైన పోటీ తత్వం మరింత పనితనాన్ని పెంచుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోటీ పడటం వల్ల ఈర్ష్యాద్వేషాలు తలెత్తే అవకాశం ఉంది. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వాన్ని చిన్నప్పట్నుంచీ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప ఒకరిని దెబ్బతీసే భావనలను తుడిచేయాలి.
-పి.ఎం.( ఆంధ్ర భూమి నుండి )

Sunday, October 23, 2011

దీపావళి గ్రీటింగ్ SMS లు

పండుగాలోస్తే ఇంతకుముందు గ్రీటింగ్ కార్డ్స్ పంపే వాల్లం. ఈ సెల్ ఫోన్ లు వచ్చాక ప్రతీదానికీ ఓ చిన్నsms ద్వారా మన సందేశాన్ని పంపుతున్నాము. మీ కోసం ఈ దీపావళికి కొన్ని సాంపిల్ smsలు 




This SMS will EXPLODE in 5 seconds?.

:05

:04

:03

:02

:01

(((((BOOM)))))
?*?*?*?*?*?*?
*?*?HAPPY?*?*
?*?DIPAWALI?*?

Light For Ur Brightful Future;
Cracker For Ur Demolish
Of Ur Failure;
Rangoli For Ur Colorful Life;
. . . . H a p p y D i w a l i . . .

I Searched Many Gardens
To Select A Flower To Give U
As My Diwali Gift.
But, I Didn't Find Any Flower
Beautiful Than Ur Smile.
***** Happy Diwali *****

it is time to feel good
It Is Time To Feel Good,
Time 4 Reunion,
Time 2 Share Happiness,
Time To Feel Being Loved,
Time 2 Show Ur Love,
Time 2 Live For Others And
Time To Wish For Peace.
HAPPY DIWALI.
Cheeeeeers.





_l''l________
--/ l__l  Delivery
|     |     ________
L(o)__l___(o)__|
This van is loaded with
LOVE n CARE,
Wishing U and your family
A HAPPY DIWALI






Saturday, October 22, 2011

ప్రగతి బాటలో ఎస్సీ,ఎస్టీలు,ముస్లింలు:భారత మానవాభివృద్ధి నివేదిక -2011

మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో భారత్ గడిచిన పదేళ్లలో పురోగతి సాధించింది. దేశంలో అంతర్రాష్ట్ర అసమానతలు తగ్గుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు సామాజిక ప్రమాణాల్లో ప్రగతి పథం వైపు పయనిస్తున్నారు. 2004-05, 2009-10లో వినియోగం, వేతనాల్లో వృద్ధి నమోదైంది. మూడింట రెండొంతులు ప్రజలు పక్కా గృహాల్లో నివసిస్తున్నారు. మూడొంతుల మంది గృహావసరాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో హెచ్‌డీఐ 21 శాతం పెరిగి 0.467కు చేరుకుంది. అత్యధిక అక్షరాస్యత, మెరుగైన వైద్య సేవలు, ప్రజల వినియోగ వ్యయంలో కేరళ తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, గోవాలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ సూచికలో ఆంధ్రప్రదేశ్‌కు 15వ ర్యాంకు దక్కింది.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాంలు హెడ్‌డీఐ జాతీయ సగటు 0.467కన్నా వెనకబడి ఉన్నాయి. కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ మ్యాన్‌పవర్ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ‘ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్-2011: టువర్డ్స్ సోషల్ ఇన్‌క్ల్లూషన్’ను ఆవిష్కరించారు. అనంతరం మాంటెక్‌సింగ్ మాట్లాడుతూ నివేదికలో రాష్ట్రాల మధ్య అసమానతలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారని అన్నారు.


‘నివేదికలో మరో రెండు అసమానతలు స్పష్టమయ్యాయి. ఒకటి దేశంలో విభిన్న మతాలు, కులాల మధ్య అంతరాలు కాగా, మరొకటి ధార్మిక సముదాయాల మధ్య అంతరాలు. 11వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి లక్ష్యంగా నివేదిక కేంద్రీకృతమైంది. గడిచిన పదేళ్లలో దేశంలోని వెనకబడిన వర్గాలు అభ్యున్నతిని సాధించాయి. వారి అభివృద్ధి జాతీయ సగటుకు చేరువైంది. వెనకబడిన రాష్ట్రాలు కూడా అభివృద్ధి విషయంలో చాలా వరకు పురోగతిలో పయనిస్తున్నాయి’ అని వివరించారు. ఈ నివేదిక ప్రస్తావించిన అంశాలపై నేడు జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో చర్చిస్తామన్నారు.

అంతకుముందు ఐఏఎంఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సంతోష్ మెహరోత్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అభివృద్ధిలో జాతీయ సగటుకు చేరువయ్యే దిశగా పయనిస్తున్నారని చెప్పారు. గడిచిన 8 ఏళ్లతో పోలిస్తే భారత మానవాభివృద్ధి సూచికలో 21 శాతం వృద్ధి జరగగా, చైనాలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య విషయంలో సత్ఫలితాలు సాధిస్తున్నప్పటికీ తాగునీటి సరఫరా, వైద్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం విషయంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో 75 శాతం కుటుంబాలు ఇప్పటికీ ఆరుబయట బహిర్భూమికి వెళ్తుండటం పారిశుద్ధ్యానికి సవాళ్లు తెచ్చిపెడుతున్నాయన్నారు. పారిశుద్ధ్యం మెరుగు కోసం కేంద్రం రూ. 1200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 700 కోట్లు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా మహిళల్లో సగం మందికిపైగా రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ నివేదికలో వెల్లడైంది. అలాగే దేశంలో అక్షరాస్యత శాతం ప్రస్తుతానికి 74 శాతంగా నమోదైంది.

Wednesday, October 19, 2011

కన్యాశుల్కంపై పాశ్చాత్య ప్రభావం


 


gurajaada‘కన్యాశుల్కం’ నాటకంపై పాశ్చాత్య ప్రభావాలు, ఆ నాటక రచయిత గురజాడపై సాహిత్య పరిశోధకులకు మేలుబంతి వంటి అంశం. ‘మద యం’ పేరిట గురజాడ జీవితం, సాహిత్యాలపై సమగ్ర పరిశీలన వెలువరించిన కె.వి. రమణారెడ్డి, 1969లో బంగోరె (బండి గోపాలరెడ్డి) మాద్రాసు ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌‌స లైబ్రరీ నుంచి వెలికి తీసి ప్రచురించిన తొలి ‘కన్యాశుల్కం’, దీనితో పాటుగా వెలువరించిన విపులమైన వ్యాసాలు (ఆరుద్రవి, బంగోరెవి), ఈ నాటకం గురించిన కొంత మౌలిక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాయి.

‘కన్యాశుల్కం’ నాటక రచనా కాలానికి పాశ్చాత్య నాటకరంగంలో శక్తిమంతమైన నాటకాలు వచ్చాయి. 1912-13లలో వెలువడిన ఇంగ్లీష్‌ పుస్తకాలు కూడా గురజాడ ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆయన పుస్తకాలతో కనిపించడం ఆశ్చర్యపరచదు సరికదా 1915లో తాను మరణించేదాకా, సమకాలీన ప్రపంచ సాహిత్యంతో అధ్యయన సాన్నిహిత్యాన్ని గురజాడ కలిగి ఉన్నాడన్న విషయాన్ని సృష్టం చేస్తాయి.
కన్యాశుల్కం నాటకం తొలి డైలాగులోనే ఒక పాశ్చాత్య రెఫరెన్సు తీసుకు వస్తాడు గురజాడ. ‘బుర్ర బద్దలు కొడదమా అన్నంత కోపం వచ్చింది కానీ పూర్‌ రిచ్ఛర్డు చెప్పినట్టు పేషెన్స్‌ ఉంటేనే కాని లోకంలో పని జరగదు’. ఇక్కడ ఈ రిచ్ఛర్డు ఎవరో ఆనాటికి బంగోరెకి అంతుపట్టలేదు. ఆయన అదే తెలుపుతూ ‘ఈ మాట అన్నది యే రిచ్ఛర్డో పరిశోధించవల్సిఉంది. బహుశా షేక్‌స్పియర్‌ గారి రెండో రిచ్ఛర్డా? లేదా ఇది గిరీశం గారి వట్టి బుకాయింపేనేమో!’ అని, లఘుటిప్పణిలో తన బహిరంగ స్వగతం నమోదు చేశారు.

ఈ పూర్‌ రిచ్ఛర్డ్‌‌స బెంజమెన్‌ ఫ్రాంక్లిన్‌. ఈయన పూర్‌ రిచ్ఛర్డ్‌‌స ఆల్మొనాక్‌ పేరిట నడిపే పత్రికలో ఎన్నో సూక్తి పరంపరలుండేవి. మన వేమన పద్యాల వంటివి కావచ్చు, శతకానికి మకుటంగా ఉండే పాదం మినహాగా. దీన్ని అందుకో లేకపోయినా, తాను ముద్రించిన గురజాడ తొలి కన్యాశుల్కం ప్రతిలో ఎన్నో విలువైన ఆలోచనలు, ఆవిష్కరణలు చేశాడు బంగోరె. ఎంతలా తను సమకాలీన సారస్వతం చదువుకున్నాడో వాటి సమయోచిత ప్రస్తావనల ద్వారా గురజాడ నాటకంలో ముఖ్యపాత్రల్లో ఒకటైన గిరీశం కారెక్టర్‌ నిర్మాణంలో విని యోగించాడు. గిరీశం పాత్రకు గల చెడు లక్షణమల్లా జ్ఞానం లేకపోవడం కాదు, తెలిసిన దానికన్నా ఎక్కువే తాను ఎరుగుదునని భావించడం, తెలిసిన జ్ఞానాన్ని వంచన, దబాయింపు, మోసం వంటి చిన్న సైజు నేరాలకు ఉపయోగిస్తూ అనైతిక ప్రయోజనాన్ని ఆశిస్తూ, అందుకై ప్రణాళికలు రచించడమే.


lejends
కన్యాశుల్కం నాటకంలో కొత్తదనం ఏదైనా ఉందీ అంటే, అది గిరీశం ప్రతి నిధిగా నాటకంలో ప్రవేశించిందే అయివుం టుంది. లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్‌, కొంత ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం. గురజాడ గిరీశం పాత్ర సృష్టికి ముందే రష్యన్‌ రచయిత నికొలాయి గొగోల్‌ ‘గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టరు’ అనే సుప్రసిద్ధ నాటకంలో క్లెష్టాకోవ్‌ అనే పోజుల రాయుడ్ని, వంచనా శిల్పిని చిత్రణ చేశాడు.

ఒక పట్టణానికి మేయరుగా ఉన్న అవినీతిపరు డు, అతని అనుచర వర్గం- త్వరలో ఒక గవర్న మెంటు ఇన్స్‌స్పెక్టరు తమపై తనిఖీకి తమ ఊరికి రానున్నాడన్న విషయం తెలిసి గాబరా పడతారు. ఈలోగా వారికి తమ ఊళ్ళోనే గత కొద్దిరోజులుగా హోటల్‌లో ఉంటున్న క్లెష్టాకోవ్‌పై దృష్టిపడి, ఇతనే తన అసలు సంగతి పైకి చెప్పకుండా ఉన్న గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టర్‌గా భావించి సకల మర్యాదలూ చేస్తారు అతడికీ, అతడి సహాయకుడికి. వీరి కంగారు, భయం గమనించి పొందవలసిన లాభాలన్నీ పొంది క్లెష్టాకోవ్‌ తన సహాయకుడితో నిష్క్రమించాక, అప్పుడు వస్తుంది అసలు వర్తమానం- త్వరలో గవర్నమెంటు ఇన్స్‌స్పెక్టర్‌ రాబోతున్నాడని. జారు చక్రవర్తుల కాలపు రాచరిక వ్యవస్థలోని అవినీతిని ప్రస్ఫుటంగా చిత్రించిన నాటకం ఇది.

గురజాడ కన్యాశుల్క రచన కాలానికి కొన్ని దశాబ్దాల ముందే ప్రపంచ నాటక రంగంలో రష్యాలో నికోలాయి గొగోల్‌, ఇవాన్‌ తుర్జెనీవ్‌, అలెగ్జాండర్‌, ఆస్ట్రోవిస్కీ నాటక రచయితలుగా పేరు గాంచారు. రెవిజర్‌ (గవర్నమెంట్‌ ఇన్స్‌స్పెక్టర్‌)రె గొగోల్‌ 1836లోనూ, ఆస్ట్రావిస్కీ సైతం 1850-1870 మధ్య కాలంలో అరడజను వరకూ సాంఘిక నాటకాలు రాసి ఉన్నారు.
ఇవాళ్టి ఇంటర్‌నెట్‌, ఆధునిక సమాచార ప్రసార వేగం ఏమీ ఇంకా ఏర్పడని కాలంలో ‘బంగోరె’ కన్యాశుల్కంపై పరిశోధకుడిగా విశేష కృషిచేసి, గురజాడకు సమకాలికంగా ఇంకా నాడు ప్రపంచరంగంలో ఫ్రెంచి, స్వీడిష్‌, నార్వీబియన్‌, జర్మన్‌ నాటక రచయితలున్నారని పేర్కొంటూ వారి వివరాలు పొందుపరిచాడు.

బంగోరె మంచి పాఠకుడు కూడా కావడం వల్ల, ఆనాడు ఫ్రాన్సులో రాస్తున్న అలెగ్జాండర్‌ డ్యూమా, విక్టోరియన్‌ సార్డోవ్‌, స్వీడన్‌లో ఆగస్ట్‌ స్ట్రిండ్‌బర్గ్‌, నార్వేలో హెన్రిక్‌ ఇబ్సన్‌, జాన్‌స్టెన్‌ జార్న్‌సన్‌, రష్యాలో ఏరటన్‌ చెవోవ్‌, జర్మనీలో గెర్హార్ట్‌ హాప్ట్‌మన్‌, హెర్మాన్‌ సండర్‌మాన్‌, ఇంగ్లాండులో జార్జి బెర్నార్డ్‌షా, హెన్సీ ఆర్ధర్‌ జోన్స్‌, ఆర్థర్‌వింగ్‌ పినెరో- వీరందనికి ఉటంకిస్తూ ‘వీళ్ళు రాసిన అన్ని నాటకాలను నేను చదవలేదు గానీ, సగటున ఒకొక్కక్కరిదీ ఒక్కక్కటి చొప్పునైనా చదివిన జ్ఞాపకం ఉంది’ అంటాడు బంగోరె.
నిజానికి ప్రపంచ నాటకరంగంలో ‘కన్యాశుల్కం’ స్థానం ఏమిటి అన్న పరిశోధన 1969లో బంగోరెతోనే మొదలయినట్టు భావించాలి. అంత వరకూ మన సాంప్రదాయ నాటక రీతులలో ఎలా ఇముడుతుంది కన్యాశుల్కం? అని జరుగుతూ వచ్చిన ఆలోచనలను విస్తరించినవాడు బంగోరె.
కన్యాశుల్కం విశాలప్రాసంగికత (ఔ్చట్ఛట ్ఛజ్ఛూఠ్చిఛ్ఛి) పై అపార విశ్వాసంగలవాడు, తెలుగుజాతి గర్వపడాల్సిన సాహిత్య పరిశోధకుడు బంగోరె, ఇలా విస్పష్ట ప్రకటన చేస్తాడు: ‘తనకు సమకాలికంగా జీవించి ప్రపంచంలో ఆనాటికే నాగరికులుగా చలామణిలో ఉన్న ఈ నానాదేశాల ఉద్దండ నాటక రచయితల సరసన సగర్వంగా గురజాడ కూర్చోగలరు. వారి నాటకాల మధ్య దివిటీ ముందర ప్రమిద లాగ కాదు, దివిటీ ముందర ఇంకో దివిటీగా భాసించగల సత్తా తెలుగు కన్యాశుల్కానికి ఉందని నమ్మేవాళ్లలో నేనొకడిని’.
ఈ పరిశోధన ఇవాళ నిజమైన రీతిలో విస్తరించాల్సి ఉంది.

ఈ ఆధునిక సమాచార యుగంలో ఇది కష్టసాధ్యం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. పరిమిత వనరులతో, సాంకేతికత అంతగా వికాసం చెందని కాలాన బంగోరె చేసిన కృషి, ఇవాల్టి తరాల తెలుగు సాహిత్య పరిశోధకులకు, యువరచయితలకు ఆదర్శం కాగలిగితే, మనం వర్తమాన యుగంలో కన్యాశుల్కం నాటకాన్ని సర్వతోముఖ విపులతతో అందుకోగలుగుతాము. దీనినే కలగంటూ బంగోరె అన్న మాటలు ఇంకా మన ఆచరణకై ఎదురుచూస్తున్నాయి:

‘ఈ అన్ని ప్రపంచ భాషలలోనూ గురజాడకు కాస్త ముందు వెనుకల వచ్చి ఉన్న ఈ నానావిధ నాటకాలన్నీ ఏర్చి గుట్ట కట్టి, అన్నిటిని చదివి, సానుభూతితో, ఆధునిక నాటకంగా కన్యాశుల్కం స్థానమేమిటో తేల్చే విషయం మీదనే ఒక డాక్టరేట్‌ థీసీస్‌ సబ్జెక్టుగా మన మూడు విశ్వవిద్యాలయాలలో (1969 నాటికి) ఒకటైనా ఎన్నిక చేయాలని నా అభిలాష’.
కన్యాశుల్కం నాటక కాలపు భారతీయ నాటక రంగంపై మాన్యులు డా యు.ఎ. నరసింహమూర్తి విపుల గ్రంథం వచ్చింది కానీ దీని పరిధి దేశీయమైనది. ప్రపంచ స్థాయిలో ఈ బేరీజు వేసే బృహత్‌ కార్యం ఇంకా జరుగవలసి ఉంది. టాగూర్‌ 150వ జయంతి వెనువెంటనే గురజాడ 150వ జయంతి వస్తుంది. ఎందుకంటే ఇద్దరి పుట్టుకకు ఒక ఏడాది మాత్రమే తేడా. గురజాడను ఈ 150వ జయంతి వత్సరంలో నూతన మూల్యాంకనాలకై స్మరించుకోవడం, విశ్లేషణలు, కొత్త సమాచారాన్ని జోడించడం అనేది మన తరం రచయితలు పూనికతో చేయాల్సిన పని.

jagaddhatriఇది గురజాడకే కాక ఆయన సాహిత్య పరిశీలకులు, పరిశో ధకులు అయిన కె.వి.ఆర్‌., బంగోరెలకు కూడా మనం అర్పించే నివాళి అవుతుంది.ఉత్తమ పాత్రికేయులు నార్ల వేంకటేశ్వరరావు ‘ట్రెడిషనల్‌ ఇండియన్‌ కల్చర్‌’లో అన్న విధంగా: ‘సమకాలికం మరియు సార్వత్రికం, స్థానికం మరియు విశ్వజనీనం- అదీ గురజాడ అప్పారావు కళా ధర్మం’. దీన్ని సాకారం చేసుకొనే దిశలో మన ఉత్తమోత్తమ కృషిని నమోదు చేద్దాము.

Tuesday, October 18, 2011

అవస్థల్లో ‘ఆకాశవాణి’ సిబ్బంది!

నెహ్రూ వారసులమని గొప్పలు చెప్పుకుంటున్న వారు, ఆయన కలలుగన్న శ్రేయోరాజ్య భావనకు నీళ్లొదలడం విచారకరం. కాలానికి అనుగుణంగా ‘దేశాభివృద్ధి’ కోసమే, ప్రథమ భారత ప్రధాని నెహ్రూ రూపొం దించిన విధానాలకు సెలవు ప్రకటించక తప్పలేదని సన్నాయి నొక్కులు నొక్కడం విడ్డూరం కలిగించే విషయం. జాతి గర్వించదగ్గ ఆణిముత్యాల వంటి ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కోట్లాది మంది కడుపుకోతకు కార కులవుతున్నారు. ప్రజా ‘సంక్షేమ’బాటను వీడి వ్యాపారీకరణ పాట పాడుతున్నారు. చివరకు జాతి ప్రసారసాధనాలుగా ఖ్యాతిగడించిన ఆకాశవాణి, దూరదర్శన్‌లను సైతం వదలక వెంటాడటం విచారకరం.

కొండకోనల్లోని ఆదివాసీ జీవన విధానాన్నీ, మారుమూల పల్లెల్లోని గ్రామీణ సంస్కృతినీ, రైతుల కష్టాలనూ, కార్మికుల గోడును కళ్లకు కట్టడమే కాక, వారి అభివృద్ధిని కాంక్షస్తూ అందరికీ అర్థమయ్యే చక్కటి ‘కబుర్లు’ రూపంలో అద్భుత కార్యక్రమాలను రూపొందించిన చరిత్ర ఆకాశవాణి, దూరదర్శన్‌లకే సొంతం. వికాసవంతమైన జాతి నిర్మాణంలో ప్రసారమాధ్యమాల పాత్ర అనన్యం. అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించి, తద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ప్రభుత్వరంగ సంస్థలుగా కొనసాగే ప్రచారసాధనాలకే సాధ్యం. వ్యాపార దృష్టికి అది సాధ్యం కాదు.

ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, నిరక్షరాస్యత, బడి చదువులు వంటి మౌలిక విషయాల్లో ప్రజలను చైతన్య పరచి, దేశ ఆర్థిక ప్రగతిలో వారిని మమేకం చేయడం కీలకమైన అంశం. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆకాశవాణి, దూర దర్శన్‌లను పూర్తి స్థాయిలో సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలకు కారణభూతమైంది. సంస్కరించడమంటే ప్రైవేటీకరణ, వ్యాపారీకరణలకు గురిచేసి, ఔట్‌సోర్సింగ్ విధానాలతో సంస్థను బలహీనపరచడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం కాకూడదు. దీంతో కార్యక్రమాల్లో పటిష్టత లోపించిందన్నది కూడా వాస్తవం. ఈ లోపాలను అధిగమించి కార్యక్రమాల్లో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పెంపొందించేలా ఆకాశవాణి, దూరదర్శన్‌లను తీర్చిదిద్దడానికే ‘ప్రసారభారతి’ వ్యవస్థను రూపొందించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆచరణ దానికి పూర్తి విరుద్ధంగా తయారయిందన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. దేశంలో నేడు 745 చానళ్లు రంగప్రవేశం చేయడమే దానికి పెద్ద ఉదాహరణ.

ప్రసారభారతి నిర్వహణ లోపభూయిష్టంగా మారడంతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, అలవెన్సులు చెల్లించడం లేదు. 1989 నుండి పదోన్నతులు కరువై ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొంది. మరోవైపు, ఆర్థిక స్వావలంబన పేరుతో రిక్రూట్‌మెంట్‌కూ, ప్రమోషన్లకూ స్వస్తి చెప్పారు. ఈ లోటుపాట్లను ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలపై అధికారులు కన్నెర్రచేయడం పరిపాటిగా మారింది.

ఎందరో మహానుభావులైన జాతి నేతలు పెంచి పోషించిన ప్రజా ప్రసారసాధనాలను దెబ్బతీయెద్దన్నందుకే ఇంతటి శిక్షను విధించడం అమానుషం. ఇటీవల ఆకాశవాణి, దూరదర్శన్‌లకు చెందిన 9 ఉద్యోగ సంఘాల గుర్తింపును ఒక్క కలంపోటుతో రద్దుచేయడం దానికి పరాకాష్ట. ప్రజా వాణినీ బాణినీ వినిపించే సంస్థలను రక్షించుకోవడానికి విజ్ఞులు చొరవ చూపాలని మనవి.
సాక్షి లో :
-వలేటి గోపీచంద్ రాష్ట్ర కార్యదర్శి,
ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ ఆలిండియా రేడియో - దూరదర్శన్, హైదరాబాద్

త్వరలో ‘మదర్ థెరిసా’ మెగా సీరియల్

ctober 17th, 2011
శ్రీ మహాగణపతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఓ మెగా డైలీ సీరియల్ ‘మదర్ థెరిసా’కు శ్రీకారం చుట్టారు. మదర్ థెరిసా జీవిత కథ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సీరియల్‌ని నిర్మాత రావుల వెంకటేష్, బి.అశోక్‌రావు దర్శకత్వంలో అందించనున్నారు. మదర్ థెరిసా లాంటి మాతృమూర్తి జీవితం గురించి అందరికీ తెలీదు. 1910లో ఆల్బేనియాలో పుట్టి తన 8వ ఏట తండ్రిని పోగొట్టుకుని పశ్చిమబెంగాల్ ప్రజల కష్టాలను చూసి 1921లో ఇండియాకి ఆపై టీచర్‌గా పనిచేసి, మానవ సేవ చేయడానికి 1931లో ‘నన్’గా రూపాంతరం చెందిన ఆ మాతృమూర్తి జీవితకథను రాయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు. మానవ సేవను తు.చ తప్పకుండా పాటించిన మదర్ థెరిసా జీవిత చరిత్రను ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు నాకెంతో గర్వపడుతున్నానని నిర్మాత తెలియజేశారు. మదర్ థెరిసా బాల్యం, పెరిగిన ప్రదేశాలు, మదర్ థెరిసాగా రూపాంతరం చెందడానికి ఆమె పడిన మానసిక సంఘర్షణ, థెరిసా అయ్యాక సేవ చేయడానికి ఎన్ని కష్టాలు పడిందన్నది ఈ డైలీ సీరియల్ తెలుపబోతోంది.

నా విశ్లేషణ: ఉప ఎన్నికల ఫలితాలు - పార్టీల భవిష్యత్తు

         నిన్న వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితాలనుంచి కాంగ్రెస్ ఏమి నేర్చుకుంటుందో గానీ ప్రతిపక్షాలు, ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
          దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకత ఉందనేది వాస్తవం. అది కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎన్నో స్కాం లలో చిక్కుకొని పోయింది.కాంగ్రెస్ పెద్దల సాయంతో దాని మిత్రపక్షాలూ స్కాం లలో భాగాస్వాములయ్యాయి. సచ్చీలుడనుకొన్నమన్మోహన్ కూడా బురద అంటించు కొన్నాడు..ఉన్న స్కాములు కావని క్రోత్తవి రోజూ బయట పడుతూనే ఉన్నాయి.అంతేకాక కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాహితాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని ధరలూ పెరిగి,ఆర్దికాభివ్రుద్ది కుంటు పడుతున్నా కనీసం ఏ సాహసోపేత నిర్ణయం చేయలేక పోతోంది.ప్రశాంతంగా ఉన్న "ఆంధ్ర ప్రదేశ్" లో ఒకసారి తెలంగాణ ఇస్తామని, మేరోసారి కమిటీలనీ,సంప్రదింపులనీ  ముందూ వెనకా చూడకుండా చిచ్చు పెట్టి మన అభివ్రుద్దినీ కుమ్తుపరిచిమ్ది.నిజానికి 125 ఏళ్లు చరిత్ర ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటిదాకా తెలంగాణా విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదంటే అది ఎంత దుర్భాగ్యమో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఈ విషయంలో BJPయే బెస్టు. తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయమైనా తీసుకుంది.
            అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న హజారే పై బురద జల్లుడు కార్యక్రమం , రామ్దేవ్ పై కేసులు ఇవాన్నే కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దిగజార్చాయి.ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏహ్య భావాన్ని పెంచుతున్నాయి.ఇది సహజంగానే ప్రతిపక్షాలకు కలిసొస్తుంది.దాని వల్లే ఉప ఎన్నికల్లో NDA పక్షాలు నేగ్గగాలిగాయి అని తెల్సుకోవాలి.
            ఇక BJP ప్రతిపక్షంగా విజయం సాధించిందా అంటే లేదనే చెప్పాలి ఆ పార్టీ ఏమీ తక్కువతినలేదనడానికి కర్నాటక లో భారీ స్కాముల్లో ఉన్న ఆ పార్టీ నాయ కులే ఉదాహరణ.రారి ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పై తమ విజయం భవిష్యత్ లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్ట బోతున్నారనడానికి సంకేతంగా అనికోదానికీ వీల్లేదు.రాధయాత్రాలూ, మౌన దీక్షలూ కంటే ఆ పార్టీ నాయకులకు ఐక్యత ,నీతీ,నిజాయితీ ముఖ్యం.ఇప్పటికీ హిందూ అనుకూల RSS ఆజ్ఞాలతోనే పనిచేస్తున్న పార్టీ దేశ ప్రజలందరి మన్ననలనూ ఎలా పొందగలదు?ఇకన్సైనా హిందూ అనుకూల సక్తుల నుంచి బయటపడి ప్రజాహిత పార్టీగా మారాలి. అప్పుడే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న  మరిన్ని పార్టీలూ, శక్తులూ రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీతో జతకట్టే అవకాసం రాగలదు అప్పుడే ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ఆశ నేరవేరవచ్చు.
           ఆంధ్ర సంగతి చెప్పనక్కర్లేదు...కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్భవించిన TDP అవన్నీ మర్చిపోయి ఆ పార్టీతో జతకట్టేలా ప్రవర్తిస్తున్నట్లు ప్రజలందరూ ఊహిస్తున్నారు.బాన్స్వాడా లో తమ ఓట్లు కాంగ్రెస్ కు బదలాయించి TRS బలం తగ్గిందని చూపిడ్డామనుకోమ్తే దాని కంట్లో అది పోడుచుకున్నట్లే .!!!భవిష్యత్ లో తెలంగాణ లో జరిగే ఏ ఎన్నికలకూ ఆ పార్టీ కి ఓట్లే కాదు, అభ్యర్ధులు కూడా దొరకని పరిస్తితిలో ఉంటుందీ పార్టీ. అప్పుడు TDP కేవలం సీమ అంధ్ర పార్టీగా మిగిపోనుమ్ది. ఇదే జరిగితే రెండు కళ్ళ సిదాంతం అవలంభిస్తున్న చంద్రబాబుకు ఓ కన్ను పోయినట్లే.
         చెప్పాలంటే YSR కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగు. కనీసం ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే తత్వాన్ని ఎంచుకున్నాడు జగన్.ఎన్నికలు ఏమ్తోదూరంలో ఉన్నా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మనిషి అనిపిమ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయనపై ఉన్న CBI కేసులు ప్రజలు గుర్తించారు .కేసులూ నడుస్తూనే ఉన్నాయి .వాటి నుండి మిస్టర్ క్లీన్ గా బయట పడితేనే ప్రజల మన్ననలు , విశ్వసనీయత పొందుతాడు.
ఈ పార్టీ కూడా తెలంగాణ లో అడుగు పెట్టె సాహసం చెయ్యట్లేదు.
        నిజానికి తెలంగాణ లో TRS తప్ప మిగతా పార్టీలు బలహీన మావ్వడానికి మరో కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే .
మిఖ్యమంత్రి గానీ, ఇతర సీమామ్ధ్ర మంత్రులు గానీ తెలంగాణా లో తిరగాలేకపోతే ఇక ఇతర పార్టీల వాళ్ళు ఎలా తిరగాగలరు?
       కనీసం ఇప్పుడు బాన్స్ వాడా ఫలితం చూసైనా ఆ పార్టీ తెలంగాణలో సభలు పెట్టె సాహసం చేయాలి. లేకపోతె ఈ ప్రాంతంలోణి ఆ పార్టీ MP, MLA లు కూడా వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీ పెట్టుకోవదమో TRS గూటికి చేరుకోవదమో చేయడం ఖాయం. ఎండు కంటే వారికి పార్టీ కన్నా పదవులు ముఖ్యం కదా..!!
      TRS విషయానికి వస్తే ఆ పార్టీ ఉద్యమాలూ , సమ్మెలూ చేసేముందు అన్ని వర్గాల మద్దతూ కూడగట్టడమే కాదు ప్రజల ఇబ్బందినీ ఆలోచించాలి.లేదంటే ప్రజాగ్రహాన్ని చవిచూసే పార్తీల పరిస్తితి వస్తుంది. ఈ పార్టే కాంగ్రెస్ పై తెలంగాణ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొనేలా ఒత్తిడి పెంచాలి.ఒకవేళ ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే రాబోయే ఎన్నికలలో కేంద్రంలో BJP ప్రభుత్వం వచ్చేందుకు తమ వంతు సాయమందిమ్చాలంటే ప్రజా మద్దతు తప్పనిసరికదా..!!
    ఇప్పటికైనా పార్టీలు మేలుకుంటే తమకు భవిష్యత్తు ఉంటుంది..లేదా పార్టీల భవిత మారడం ఖాయం.